తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు(TSLPRB) ఎస్సీటీ ఎస్సై పరీక్ష హాల్ టికెట్స్ ను విడుదల చేసింది. ఈ నెల 21 నుంచి వెబ్ సైట్లో అందుబాటులో ఉంటాయి. 26న ఎస్సీటీ ఎస్సై టెక్నికల్ పేపర్ రాత పరీక్ష జరగనుంది. దీనికి సంబంధించిన హాల్ టికెట్స్ ను విడుదల చేశారు. 21వ తేదీ ఉదయం ఎనిమిది గంటల నుంచి ఈ హాల్ టికెట్స్ వెబ్ సైట్లో అందుబాటులో ఉంటాయి.,ఈ నెల 21వ తేదీ ఉదయం 8 గంటల నుంచి ఈ హాల్ టికెట్స్ డౌన్ లోడ్ చేసుకోవచ్చు. మార్చి 21న ఉదయం 8 గంటల నుంచి 24న అర్ధరాత్రి 12 గంటల వరకు అభ్యర్థులు తమ హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఈ మేరకు TSLPRB తెలిపింది.,ఇక ఎస్సీటీ ఎస్సై టెక్నికల్ పేపర్ రాత పరీక్ష.. ఈ నెల 26న ఉదయం పది గంటలకు నుంచి మధ్యాహ్నం 1 గంట వరకూ జరుగుతుంది. ఈ పరీక్ష హాల్ టికెట్స్ డౌన్ లోడ్ చేసుకునేందుకు.. TSLPRB వెబ్‌సైట్ www.tslprb.in కు వెళ్లాలి. వివరాలను.. వెబ్ సైట్లో ఎంటర్ చేసి.. హాల్ టికెట్ డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక వేళ హాట్ టికెట్లు డౌన్ లోడ్ కాకుంటే.. support@tslprb.inకు మెయిల్ చేయండి. లేకపోతే.. 9393711110, 9391005006 నెంబర్లకు ఫోన్ చేయడం ద్వారా హాల్ టికెట్లను తీసుకోవచ్చు.,ఎస్సీటీ ఎస్సై పోస్టుల భర్తీ కోసం నిర్వహించే.. మిగతా రెండు పేపర్లకు సంబంధించిన హాల్ టికెట్లను విడిగా జారీ చేయనుంది టీఎస్ఎల్పీఆర్బీ. వాటిని డౌన్ లోడ్ చేసుకునేందుకు తేదీలను మళ్లీ ప్రకటించనుంది. హాల్ టికెట్స్ డౌన్ లోడ్ చేసుకోగానే.. దానిపై చెప్పిన ప్రదేశంలో పాస్ పోర్ట్ సైజ్ ఫొటోను అంటించాలి. హాల్ టికెట్ మీద పాస్ ఫొటో లేకపోతే.. పరీక్ష హాల్ లోకి అనుమతించరు.,మార్చి 26న ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ ఎస్సీటీ ఎస్సై టెక్నికల్ పేపర్ పరీక్ష ఉంటుంది. ఏప్రిల్ 2న ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ ఎస్సీటీ కానిస్టేబుల్(డ్రైవర్) డ్రైవర్ ఆపరేటర్ పోస్టులకు టెక్నికల్ పేపర్, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకూ ఎస్సీటీ కానిస్టేబుల్(మెకానిక్) పోస్టులకు టెక్నికల్ పేపర్ పరీక్షలు నిర్వహించనున్నారు.,ఏప్రిల్ 8న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ అన్ని ఎస్సీటీ ఎస్సై/ ఏఎస్సైఐ పోస్టులకు అర్థిమెటిక్ అండ్ రీజనింగ్/ మెంటల్ ఎబిలిటీ టెస్ట్ నిర్వహిస్తారు. మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు అన్ని ఎస్సీటీ ఎస్సై/ ఏఎస్సై పోస్టులకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ పరీక్ష ఉంటుంది.,ఏప్రిల్ 9న ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ ఎస్సీటీ ఎస్సై(సివిల్) పోస్టులకు జనరల్ స్టడీస్ పరీక్ష నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్ర 5.30 గంటల వరకూ అన్ని ఎస్సీటీ ఎస్సై(సివిల్) పోస్టులకు తెలుగు/ఉర్దూ పరీక్ష ఉంటుంది. చివరిగా.. ఏప్రిల్ 30న ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ ఎస్సీటీ కానిస్టేబుల్(సివిల్), ఇతర కానిస్టేబుల్ సమాన పోస్టులకు జనరల్ స్టడీస్ పరీక్ష జరగనుంది. మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు అన్ని ఎస్సీటీ కానిస్టేబుల్(IT&CO) పోస్టులకు టెక్నికల్ పరీక్ష ఉంటుంది.,