Valentines Day: వాలెంటైన్స్ డే కు ఇలా స్టైలిష్‌గా కనిపించేందుకు ట్రై చేయండి, ఇక్కడ కొన్ని ఫ్యాషన్ చిట్కాలు ఉన్నాయి-try to look stylish on valentines day here are some fashion tips ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Valentines Day: వాలెంటైన్స్ డే కు ఇలా స్టైలిష్‌గా కనిపించేందుకు ట్రై చేయండి, ఇక్కడ కొన్ని ఫ్యాషన్ చిట్కాలు ఉన్నాయి

Valentines Day: వాలెంటైన్స్ డే కు ఇలా స్టైలిష్‌గా కనిపించేందుకు ట్రై చేయండి, ఇక్కడ కొన్ని ఫ్యాషన్ చిట్కాలు ఉన్నాయి

Haritha Chappa HT Telugu
Published Feb 11, 2025 04:30 PM IST

ఫిబ్రవరి 14 వాలెంటైన్స్ డే. ప్రేమికులు ఈ రోజును ప్రత్యేకంగా నిర్వహించుకుంటారు. అమ్మాయిలు ప్రేమికుల రోజుకు అందంగా తయారయ్యేందుకు ముందస్తుగా సిద్ధమవుతారు. ఈ రోజు స్టైలిష్‌గా కనిపించడానికి కొన్ని ఫ్యాషన్ హ్యాక్స్ ఇక్కడ ఉన్నాయి.

వాలెంటైన్స్ డే డ్రెస్సింగ్ స్టైల్
వాలెంటైన్స్ డే డ్రెస్సింగ్ స్టైల్

ఫిబ్రవరి అంటనే ప్రేమ మాసం. ఇక ప్రేమ వారం ఇప్పుడు నడుస్తోంది. రోజ్ డే మొదలైన ప్రేమ వారం ఫిబ్రవరి 14 వాలెంటైన్స్ డేతో ముగుస్తుంది. ప్రేమికులు ఈ రోజు కోసం ఎంతో ఏడాదంతా ఎదురు చూస్తారు. ఫిబ్రవరిలో వచ్చే ఈ ప్రత్యేకమైన రోజుకు ప్రేమ పక్షులు ముందస్తుగానే సిద్ధమవుతారు. వాలెంటైన్స్ డే రోజున జంటలు డేట్‌కు వెళతారు లేదా స్నేహితులతో కలిసి నైట్ అవుట్‌కు వెళతారు. అమ్మాయిలు ఈ రోజు అందంగా కనిపించాలని కోరుకుంటారు. మీరు కూడా ఈ ప్రత్యేకమైన రోజున మీ భాగస్వామితో డేట్‌కు వెళుతున్నట్లయితే, ఇక్కడ ఇచ్చిన ఫ్యాషన్ హ్యాక్స్ మీకు ఉపయోగపడతాయి. ఈ హ్యాక్స్ ద్వారా మీరు డబ్బును కూడా ఆదా చేసుకోవచ్చు. వాలెంటైన్స్ డే కోసం ఫ్యాషన్ హ్యాక్స్ చూడండి.

అందమైన రెడ్ టాప్‌

మీ వద్ద రెడ్ కలర్ టాప్ ఉంటే వాలెంటైన్స్ డే కు వేసుకుంటే సరిపోతుంది. ఈ టాప్‌ను బేజ్ మినీ స్కర్ట్, మోకాలి వరకు ఉన్న కిట్టెన్ బూట్లతో జత చేయండి. దీనితోపాటు అందమైన స్లింగ్ బ్యాగ్‌ను క్యారీ చేయండి. ఈ లుక్‌లో మీ జుట్టును హాఫ్ బన్‌లో కట్టుకోవచ్చు. క్యూట్ లుక్ కోసం ఈ స్టైల్ ఉత్తమం. మీ వద్ద బేజ్ కలర్ స్కర్ట్ లేకపోతే దీన్ని బ్లాక్ లేదా ఆఫ్ వైట్ కలర్ స్కర్ట్‌తో కూడా జత చేయవచ్చు.

షైనింగ్ డ్రెస్

మీరు రాత్రి సమయంలో మీ భాగస్వామితో డేట్‌కు వెళుతున్నట్లయితే, షైనింగ్ డ్రెస్ అద్భుతంగా ఉంటుంది. ఈ రకమైన డ్రెస్‌ను బోల్డ్ ఈయర్ రింగ్స్, ఆకర్షణీయమైన సిల్వర్ లేదా గోల్డ్ హీల్స్‌తో జత చేయండి. మేకప్‌ను న్యూడ్‌గా ఉంచి, లిప్‌స్టిక్‌ను డార్క్ లేదా లైట్ డ్రెస్ కలర్‌కు తగినట్లుగా ఎంచుకోండి.

కార్సెట్ టాప్

మోకాలి వరకు ఉన్న డెనిమ్ స్కర్ట్‌తో అందమైన కార్సెట్ టాప్‌ను ధరించవచ్చు. దీన్ని మీరు క్రాప్డ్ బాంబర్ జాకెట్, వైట్ స్నీకర్స్‌తో లేదా లాంగ్ కోట్, స్టిలెట్టోస్‌తో జత చేయవచ్చు. స్టైలింగ్ కోసం జుట్టును కర్ల్ చేసి విప్పి ఉంచి, న్యూడ్ మేకప్‌తో లుక్‌ను పూర్తి చేయండి.

ప్లెయిన్ రెడ్ డ్రెస్

వాలెంటైన్స్ డే రోజున రెడ్ కలర్ డ్రెస్ అద్భుతంగా ఉంటుంది. దీన్ని మీరు ఓపెన్ హెయిర్, న్యూడ్ మేకప్‌తో స్టైల్ చేయవచ్చు. ఈ రకమైన డ్రెస్‌ను స్టడ్ ఈయర్ రింగ్స్, హై హీల్స్‌తో జత చేయండి. స్టైల్ కోసం స్లింగ్ బ్యాగ్ కూడా తీసుకోవచ్చు.

Haritha Chappa

TwittereMail
హరిత హిందూస్తాన్ టైమ్స్‌లో చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్లో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, తెలుగు సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్‌వర్క్‌లలో పని చేశారు. ప్రింట్, డిజిటల్ జర్నలిజంలో 17 ఏళ్ల అనుభవం ఉంది. 2023 డిసెంబరు నుంచి హిందూస్థాన్ టైమ్స్‌లో ఆస్ట్రాలజీ, లైఫ్‌స్టైల్ సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.
Whats_app_banner

సంబంధిత కథనం