Spicy Tawa Idli: చప్పటి ఇడ్లీలు పిల్లలకు నచ్చడం లేదా..? స్పైసీగా తవా ఇడ్లీ చేసి పెట్టండి బాక్సు ఖాళీ చేసేస్తారు-try this spicy tawa idli recipe with leftover idli for your kids breakfast and snack ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Spicy Tawa Idli: చప్పటి ఇడ్లీలు పిల్లలకు నచ్చడం లేదా..? స్పైసీగా తవా ఇడ్లీ చేసి పెట్టండి బాక్సు ఖాళీ చేసేస్తారు

Spicy Tawa Idli: చప్పటి ఇడ్లీలు పిల్లలకు నచ్చడం లేదా..? స్పైసీగా తవా ఇడ్లీ చేసి పెట్టండి బాక్సు ఖాళీ చేసేస్తారు

Ramya Sri Marka HT Telugu
Jan 03, 2025 06:30 AM IST

Spicy Tawa Idli: ఎప్పుడూ ఇవే చప్పటి ఇడ్లీలా.. బోర్ కొడుతున్నాయి. కొత్తగా ఏదైనా చెయ్యమ్మా! అని పిల్లలు, ఇంట్లో వాళ్లు అంటున్నారా? అయితే ఇది మీకు కోసమే. మీరు ఎప్పుడూ చేసే ఇడ్లీలతోనే కొత్తగా ఓ పదార్థాన్ని చేయచ్చు. టేస్టీగా, స్పైసీగా ఉండే ఈ తవా ఇడ్లీ అందరికీ నచ్చుతుంది. ఎలా తయారుచేయాలో తెలుసుకోండి.

స్పైసీగా తవా ఇడ్లీ చేసి పెట్టండి
స్పైసీగా తవా ఇడ్లీ చేసి పెట్టండి

ఎప్పుడూ ఇవే చప్పటి ఇడ్లీలు తినాలా..? స్పైసీగా ఏమైనా చేసి పెట్టచ్చు కదమ్మా.. అని పిల్లలు తరచూ అడుగుతున్నారా? అయితే ఇది మీ కోసమే. మీరు ఎప్పుడూ చేసే మామూలు ఇడ్లీలతోనే ఇంట్లో వాళ్లకీ నచ్చేలా కొత్తగా ఒక పదార్థాన్ని తయారు చేయచ్చు. ముఖ్యంగా పిల్లలు ఇష్టంగా తినేలా స్పైసీగా, ఈజీగా చేసి పెట్టచ్చు. ఉదయాన్నే ఇడ్లీలు తినడం నచ్చకపోయినా, సాయంత్రానికి ఇడ్లీలు మిగిలిపోయినా ఇలా స్పైసీ తవా ఇడ్లీలను తయారు చేసి పెట్టండి.ఈ రెసినీ అందరికీ కచ్చితంగా నచ్చుతుంది. ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌గా, సాయంత్రం స్నాక్స్‌గా ఉపయోగపడే స్పైసీ తవా ఇడ్లీని ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి..

yearly horoscope entry point

స్పైసీ తవా ఇడ్లీ తయారీకి కావాల్సినవి..

  • శనగపప్పు- రెండు టేబుల్ స్పూన్లు
  • మినపపప్పు- రెండు టేబుల్ స్పూన్లు
  • ఎండు కొబ్బరి ముక్కలు- రెండు టేబుల్ స్పూన్లు
  • బియ్యం- ఒక టేబుల్ స్పూన్
  • నవ్వులు ఒక టేబుల్ స్పూన్
  • మిరియాలు
  • ఎండు మిర్చీ 5 లేదా 6
  • పుట్నాలు
  • చింతపండు
  • ఇడ్లీలు
  • బటర్ లేదా నెయ్యి లేదా నూనె రెండు టేబుల్ స్పూన్లు
  • ఆవాలు 1/2 టీస్పూన్
  • జీలకర్ర 1/2 టీస్పూన్
  • కరివేపాకు తాళింపుకు సరిపడా
  • తరిగిన ఉల్లిపాయ ఒకటి
  • తరిగిన టమాటా ఒకటి
  • తరిగిన పచ్చిమిరపకాయలు రెండు
  • పసుపు 1/2 టీస్పూన్
  • కారం పొడి 1/2 టీస్పూన్
  • ఉప్పు రుచికి తగినంత
  • తరిగిన కొత్తిమీర

తయారీ విధానం..

  1. ముందుగా మనం రోజూ చేసుకున్నట్లే ఇడ్లీలను చేసి పక్కక్కు పెట్టుకోవాలి.
  2. తరువాత శనగపప్పు, మినపపప్పు,పుట్నాలు ఎండు కొబ్బరి ముక్కలు, బియ్యం, నువ్వులు, ఎండిమిర్చీలు, మిరియాలు అన్నింటినీ ఒకదాని తర్వాత ఒకటి తీసుకుని వేయించాలి.
  3. ఈ మసాలా దినుసులన్నీ చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ లోకి తీసుకుని దాంట్లో చింతపండు వేసి మెత్తటి పౌడర్ లాగా చేసి పక్కక్కు పెట్టేయండి.
  4. ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఇడ్లీలను ముక్కలుగా కట్ చేసుకోవాలి. వీటిని పిల్లలకు నచ్చే విధంగా రకరకాల షేపుల్లో కట్ చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల పిల్లలు మరింత ఇష్టంగా తింటారు.
  5. తరువాత ఒక ఫ్రైయింగ్ ప్యాన్ తీసకుని దాంట్లో రెండు టేబుల్ స్పూన్ల బటర్ లేదా నెయ్యి వేయాలి. ఇవి రెండూ లేకపోతే నూనె పోయండి.
  6. నూనె వేడెక్కిన తర్వాత దాంట్లో ముక్కలుగా చేసుకున్న ఇడ్లీలను వేసి వేయించాలి. ఇడ్లీలు కాస్త క్రిస్పీగా, రంగు మారేంత వరకూ వేయించి పక్కక్కు పెట్టుకోవాలి.
  7. తరువాత అదే ఫ్రైయింగ్ ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ నూనె లేదా నెయ్యి వేయాలి.
  8. నెయ్యి వేడిక్కిన తర్వాత అందులో జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసి వేయించాలి.
  9. తరువాత దాంట్లోనే తరిగిన ఉల్లిపాయలు వేయాలి.
  10. ఉల్లిపాయలు గోధుమ రంగులోకి మారేంతవరకూ వేయించుకున్న తర్వాత దాంట్లో పచ్చిమిర్చీ వేసి వేయించాలి.
  11. పచ్చిమిర్చీ కూడా చక్కగా వేగిన తర్వాత దాంట్లో సన్నగా తరిగి పెట్టుకున్న టమాటాలు వేసి వేయించాలి.
  12. టామాటాలను పూర్తిగా వేయించుకున్న తర్వాత దాంట్లో మనం మనం ముందుగా తయారు చేసుకున్న మసాలా పొడి, ఉప్పు వేసి బాగా కలపాలి.
  13. వీటిని పచ్చి వాసన పోయేంత వరకూ వేయించిన తర్వాత ముక్కలుగా చేసి పక్కక్కు పెట్టుకున్న ఇడ్లీలను దీంట్లో వేయాలి.
  14. మనం వేసుకున్న మసాలాలు అన్నీ ఇడ్లీలకు పట్టేంత వరకూ వాటిని ఫ్రై చేయాలి.
  15. ఇడ్డీలు వేగిన తర్వాత రుచి చూసి ఉప్పు కారం తగ్గితే మరింత వేసుకువాలి. మిగిలిపోయిన ఇడ్లీలు అయితే పుల్లగా ఉంటాయి కనుక కాస్త ఎక్కువ మసాలాలు అసవరం అవుతాయని గుర్తుంచుకోండి.
  16. ఇడ్లీలు చక్కగా వేగిన తర్వాత తరిగి పెట్టుకున్న కొత్తిమీరను వేసి స్టవ్ ఆఫ్ చేసేయండి.
  17. అంతే స్పైసీగా ఉండే తవా ఇడ్లీ తయారయినట్లే. వేడి వేడిగా సర్వ్ చేసి తినేయచ్చు. పిల్లలకు బాక్సుల్లోకి కూడా పెట్టేయచ్చు.

Whats_app_banner