Biscuit Halwa Recipe: చూస్తేనే నోరూరిపోయే బిస్కెట్ హల్వాను ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు.. ఇదిగో ఈ రెసిపీతో ట్రై చేసేయండి!-try this simple and delicious halwa recipe with biscuits its yummy ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Biscuit Halwa Recipe: చూస్తేనే నోరూరిపోయే బిస్కెట్ హల్వాను ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు.. ఇదిగో ఈ రెసిపీతో ట్రై చేసేయండి!

Biscuit Halwa Recipe: చూస్తేనే నోరూరిపోయే బిస్కెట్ హల్వాను ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు.. ఇదిగో ఈ రెసిపీతో ట్రై చేసేయండి!

Ramya Sri Marka HT Telugu

Biscuit Halwa Recipe: బిస్కెట్లతో హల్వా ఎప్పుడైనా ట్రై చేశారా? ఇదిగోండి ఈ రెసిపీతో చేసి చూడండి. ఇంట్లో వాళ్లంతా లొట్టలేసుకుని మరీ తినేస్తారు. స్మూత్‌గా, సింపుల్‌గా రెడీ అయ్యే బిస్కెట్ హల్వాను తయారు చేయడం చాలా ఈజీ కూడా!

బిస్కెట్లతో తయారు చేసిన స్వీట్ హల్వా (Chef Deena Cooks/youtube)

హల్వా అంటే కేవలం కూరగాయలు, పండ్లతో మాత్రమే కాదు.. పిల్లలు ఇష్టంగా తినే, ఇంట్లో ఎప్పుడూ ఉండే బిస్కెట్లతో కూడా తయారు చేయచ్చు. ఈ బిస్కెట్ హల్వాను ఒక్కసారి రుచి చూశారంటే మళ్లీ మళ్లీ చేసుకుని తినాలనుకుంటారు. అంత రుచిగా ఉంటుంది. పిల్లలతో పాటు పెద్దలు కూడా దీన్ని చాలా ఇష్టంగా తింటారు. హల్వా రుచి నచ్చని వారికి కూడా బిస్కెట్ హల్వా కచ్చితంగా నచ్చుతుంది. దీన్ని తయారు చేయడం కూడా చాలా సులువు. ఇంకెందుకు ఆలస్యం సింపుల్‌గా రెడీ అయ్యే రుచికరమైన బిస్కెట్ హల్వాను ఎలా తయారు చేయాలో చూసేద్దా రండి..

బిస్కెట్ హల్వా తయారీకి కావాల్సిన పదార్థాలు..

  • బిస్కెట్లు- 15(మీకు నచ్చినవి)
  • పాలు - పావు లీటర్
  • నెయ్యి - 3 నుంచి 4 టేబుల్ స్పూన్లు
  • చక్కెర - రుచికి సరిపడా
  • డ్రై ఫ్రుట్స్- మీకు కావలసినన్ని

బిస్కెట్ హల్వా తయారు చేసుకునే పద్ధతి..

  1. బిస్కెట్ హల్వా తయారీ కోసం ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో మీకు నచ్చిన బిస్కెట్లను 15 నుంచి 20 వరకూ చిన్న చిన్న ముక్కులగా కట్ చేసి వేయండి. ఇక్కడ మీకు నచ్చిన ఏ బిస్కెట్లను అయినా తీసుకోవచ్చు. మీరు తీసుకున్న బిస్కెట్లు ఎక్కువ తీపి రుచి కలిగి ఉండేవి అయితే చక్కెరను కాస్త తగ్గించి వేసుకోవాలని గుర్తుంచుకోండి.
  2. తరువాత పాలను తీసుకుని బిస్కెట్లలో పోసి పక్కన పెట్టండి.(ప్యాకెట్ పాల కన్నా గేదె పాటు మరింత రుచిగా ఉంటాయి)
  3. ఒక నిమిషం పాటు పాలలో బిస్కెట్లన్నీ నానిన తర్వాత స్మాషర్ సహాయంతో వాటిని మెత్తటి పేస్టులా తయారు చేయండి.
  4. ఇప్పుడు ఒక ఫ్రైయింగ్ పాన్ తీసుకుని దాంట్లో నెయ్యి వేసి వేడి చేయండి.
  5. నెయ్యి వేడెక్కిన తర్వాత దాంట్లో మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్(బాదం, జీడి పప్పు, పిస్తా)వంటి వాటిని తీసుకుని సన్నగా కట్ చేసుకుని దోరగా వేయించుకోండి.
  6. డ్రై ఫ్రూట్స్ అన్నీ నెయ్యిలో చక్కగా వేగిన తర్వాత వాటిని తీసి పక్కకు పెట్టుకోండి.
  7. ఇప్పుడు ఇదే పాన్‌లో మెత్తటి పేస్టులా తయారు చేసి పెట్టుకున్న బిస్కెట్ మిశ్రమాన్ని వేసి వేయించండి.
  8. ఇందులోనే పావు కప్పు వరకూ చక్కెన వేసి బాగా కలపండి.
  9. చక్కెర వేసిన తర్వాత ఈ మిశ్రమం గట్టిపడేంత వరకూ కలుపుతూ వేడి చేయండి.
  10. బిస్కెట్ మిశ్రమం అంతా గట్టిపడ్డ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి అలాగే వదిలేయండి.
  11. ఇప్పుడు వేరొక పాన్ తీసుకుని దాంట్లో మరొక పావు కప్పు చక్కెర వేసి వేడి చేయండి.
  12. చక్కెర అంతా కరికి చిక్కటి సిరప్ లా తయారైన తర్వాత దాన్ని తీసుకెళ్లి బిస్కెట్ పేస్టులో వేయండి.
  13. ఇందులోనే నెయ్యిలో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్‌ను వేసి అన్నీ కలిసిపోయేంత వరకూ బాగా కలపండి.

అంతే సింపుల్ అండ్ టేస్టీ బిస్కెట్ హల్వా రెడీ అయినట్టే. సర్వ్ చేసుకున్ని తిన్నారంటే ఇదే బెస్ట్ హల్వా అంటారు. ఇంటికి వచ్చిన అతిథులకు చేసి పెట్టారంటే రెసిపీ ఏంటని కచ్చితంగా అడుగుతారు. కావాలంటై ట్రై చేసి చూడండి. అందరి మెప్పూ పొందండి.

Ramya Sri Marka

eMail
రమ్య శ్రీ మార్క హిందుస్థాన్ టైమ్స్‌లో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్. జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న ఆమె లైఫ్ స్టైల్, ఆస్ట్రాలజీ వార్తలు రాయడంలో ప్రత్యేకత కలిగి ఉంది. కాకాతీయ యూనివర్సిటీలో జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ పట్టా పొందారు. గతంలో ఈనాడు, టీన్యూస్, ఈటీవీ భారత్ వంటి సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు.లింక్డ్‌ఇన్‌లో ఆమెతో కనెక్ట్ అవ్వండి.

సంబంధిత కథనం