Pumpkin Kabab Recipe: పిల్లలు గుమ్మడికాయ తినకపోతే ఈ రుచికరమైన కూరగాయల కబాబ్‌లు తయారు చేయండి, నిమిషాల్లో అయిపోతుంది!
Mix Vegetable Kabab Recipe: పిల్లల లంచ్ బాక్స్‌లో ఆరోగ్యకరమైన, రుచికరమైన స్నాక్స్ పెట్టాలనుకుంటున్నారా? అయితే గుమ్మడికాయ, క్యాబేజీ వంటి కూరగాయలతో తయారు చేసిన కబాబ్‌లు తయారు చేయండి. ఇది చాలా త్వరగా అయిపోతుంది.

చాలా మంది పిల్లలు కూరగాయలు తినడానికి ఇష్టపడరు. ముఖ్యంగా గుమ్మడికాయ, క్యాబేజీ, క్యారెట్ వంటి కూరగాయల పేరు చెబుతేనే ముఖం విరుచుకుంటరారు. అలాంటి వారికి లంచ్ బాక్సోల్లోకి అన్నం కూరతో పాటు స్నాక్స్ పెట్టడం చాలా కష్టం. అది తినను, ఇది తినను అంటూ బాక్సులు తినకుండానే తీసుకొస్తారు. ఇలాంటి సందర్భాల్లో మీరు వారికి ఆరోగ్యకరమైన, రుచికరమైన కబాబ్‌లను తయారు చేసి లంచ్ బాక్స్‌లో ప్యాక్ చేయవచ్చు. ఈ రుచికరమైన స్నాక్స్ ను పిల్లల బాక్సుల్లో పెట్టి పంపారంటే పిల్లలు వదలకుండా తినేస్తారు. ఇలా చేయడం వల్ల పిల్లలకు కూరగాయలు తినిపించడం గురించి చింతించాల్సిన అవసరం లేదు. కూరగాయలతో కబాబ్‌లు ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం.
గుమ్మడికాయ, కాలిఫ్లవర్ కబాబ్‌ల తయారీకి కావలసిన పదార్థాలు:
- అర కప్పు గుమ్మడికాయ
- అర కప్పు క్యారెట్ ముక్కలు
- అర కప్పు కాలిఫ్లవర్ ముక్కలు
- ఒక కప్పు మష్రూమ్స్
- ఒక ఉల్లిపాయ
- అర కప్పు నానబెట్టిన మూంగ్ దాల్
- నూరు గ్రాముల పనీర్
- రెండు చెంచాల పొడి బేసం
- రెండు పచ్చిమిర్చి
- 5-6 వెల్లుల్లి రెబ్బలు
- బాగా తరిగిన కొత్తిమీర
- అల్లం ముక్క
- రుచికి తగినంత ఉప్పు
- ఒక చెంచా కొత్తిమీర విత్తనాలు
- అర చెంచా నల్ల మిరియాలు
- రెండు లవంగాలు
- రెండు యాలకులు
గుమ్మడికాయ, క్యాబేజీ కబాబ్‌లు తయారు చేసే విధానం..
-మొదట గుమ్మడికాయ, కాలిఫ్లవర్, క్యారెట్‌లను శుభ్రం చేసి పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేయండి.
-నానబెట్టిన పెసర పప్పును కూడా శుభ్రం చేసి పక్కన పెట్టుకోండి.
- ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకుని దాంట్లో కట్ చేసిన కూరగాయలు, పెసరపప్పులతో పాటు కట్ చేసిన ఉల్లిపాయను వేసి ఒక విజిల్ వచ్చేవరకూ ఉంచండి.
-ఇప్పుడు గ్రైండర్ లేదా మిక్సీ జార్‌లో అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, కొత్తిమీర వేయండి.
-పొడి మసాలా దినుసులు నల్ల మిరియాలు, కొత్తిమీర, లవంగాలు, యాలకులను కూడా వేసి బాగా మెత్తగా మెత్తని పేస్ట్ చేయండి.
- ఈ మిశ్రమంలోనే ఉడికించిన కూరగాయలను వేసి బాగా కలపండి. నీరు వేయకుండానే కూరగాయల నుండి వచ్చే నీటితోనే దీన్ని కచ్చాపచ్చాగా ఉండే పేస్టులా తయారు చేయండి.
-ఇప్పుడు ఒక బౌల్‌లో అన్నివేసి పేస్ట్‌లా తయారు చేయండి. తర్వాత దానిలో పనీర్‌ను తురిమి వేయండి.
-చివరగా దీంట్లోనే శనగపిండి, రుచికి తగినంత ఉప్పు వేసి బాగా కలపండి.
- తరువాత ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న కబాబ్ లాగా చేసి, తక్కువ నూనెలో వేయించండి.
-రుచికరమైన కూరగాయల కబాబ్‌లు సిద్ధం. ఈ కబాబ్ లను పిల్లలకు పెట్టారంటే వదలకుండా తినేస్తారు. బరువు తగ్గాలనుకునే వారికి కూడా చాలా బాగా సహాయపడుతుంది.
సంబంధిత కథనం