Korean Potato Balls: పిల్లల కోసం కోరియన్ చిల్లీ పొటాటో బాల్స్ ఇంట్లోనే తయారు చేయండి, ఇది చాలా సులభమైన రెసిపీ!
Korean Potato Balls: మీరు ఇంతవరకు కోరియన్ వంటకాలు రుచి చూడకపోతే, ఈసారి కోరియన్ చిల్లీ పొటాటో బాల్స్ తయారు చేసుకుని ఆస్వాదించండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇవి త్వరగా తయారు చేయడం కూడా చాలా సులువు.
భారతదేశంలో కోరియన్ బ్యూటీ టిప్స్‌కీ ఆహారానికి ఇటీవల బాగా ఆదరణ పెరిగింది. సోషల్ మీడియాలో కూడా కోరియన్ వంటకాల వీడియోలు వైరల్ తెగ అవుతున్నాయి. కోరియన్ స్పైసీ నూడుల్స్ చాలా మందికి ఇష్టమైనవి ఎందుకంటే అవి భిన్నమైన రుచిని కలిగి ఉంటాయి. మీకు కొరియన్ రెసిపీలను ట్రై చేయాలనిపిస్తే ఇంతవరకు కోరియన్ ఆహారం రుచి చూడకపోతే, ఈసారి కోరియన్ చిల్లీ పొటాటో బాల్స్ తయారు చేసుకుని ఆస్వాదించండి. ఇవి భిన్నమైన రుచితో పాటు ఆరోగ్యకరమైనది కూడా. కోరియన్ చిల్లీ పొటాటో బాల్స్ తయారు చేయడం కూడా చాలా సులభం. సాయంత్రంసరదాగా స్నాక్స్ లా వీటిని మీ పిల్లలకు ఇచ్చారంటే వారి బయట తినడం మానేస్తారు కూడా. కోరియన్ చిల్లీ పొటాటో బాల్స్ తయారు చేసే విధానం ఇక్కడ తెలుసుకోండి.

కోరియన్ చిల్లీ పొటాటో బాల్స్ తయారీకి కావలసినవి:
- నాలుగు బంగాళాదుంపలు
- నాలుగు పెద్ద స్పూన్ల కార్న్‌ఫ్లోర్
- ఒక పెద్ద స్పూన్ నూనె
- నాలుగు నుండి ఐదు వెల్లుల్లి రెబ్బలు (చిన్న ముక్కలుగా తరిగినవి)
- రెండు పెద్ద స్పూన్ల సోయా సాస్
- ఒక పెద్ద స్పూన్ తరిగిన కొత్తిమీర
- అర పెద్ద స్పూన్ కశ్మీరీ ఎర్ర మిరపకాయ పొడి
- అర చిన్న స్పూన్ తెల్ల నువ్వులు
- ఒకటి నుండి ఒకటిన్నర లీటర్ల నీరు
కోరియన్ చిల్లీ పొటాటో బాల్స్ తయారీ విధానం:
కోరియన్ చిల్లీ పొటాటో బాల్స్ తయారు చేయడానికి ముందుగా కొన్ని బంగాళాదుంపలను తీసుకుని బాగా కడగాలి.
తర్వాత ఈ బంగాళాదుంపలను నీటిలో వేసి బాగా ఉడికించాలి.
ఉడికించిన తర్వాత పొట్టు తీసి వీటిని మెత్తగా చూర్ణంలా(పేస్టులా) చేయాలి.
తర్వాత 4 పెద్ద స్పూన్ల కార్న్‌ఫ్లోర్ పిండిని బంగాళాదుంపల పేస్టులో వేసి బాగా కలపాలి. బంగాళాదుంప పిండి సిద్ధమైనట్టే.
ఇప్పుడు ఈ పిండిని చిన్న చిన్న ముక్కలుగా తీసుకుని బాల్స్‌గా తయారు చేసి పక్కకు పెట్టుకోవాలి.
ఇప్పుడు ఒక పాన్‌లో ఒక లీటరు నీరు, ఒక పెద్ద స్పూన్ నూనె వేసి, అందులో బంగాళాదుంప బాల్స్ వేయాలి.
వీటిని కనీసం 10 నిమిషాలు ఉడికించాలి.
ఉడికించిన బంగాళాదుంపలలో కొత్తిమీర, నాలుగు వెల్లుల్లి రెబ్బలు (చిన్న ముక్కలుగా తరిగినవి), రెండు పెద్ద స్పూన్ల సోయా సాస్, అర పెద్ద స్పూన్ కశ్మీరీ ఎర్ర మిరపకాయ పొడి, తెల్ల నువ్వులు, అర కప్పు వేడి నూనె వేయాలి.
అన్నీ బాగా కలిపి దానిపై కొత్తిమీర చల్లుకోవాలి.
అంతే కోరియన్ చిల్లీ పొటాటో బాల్స్‌ను రెడీ అయినట్టే. టేస్ట్ చేసిన వారు ఎవ్వరైనా అదిరిపోయింది అనాల్సిందే. ఆలస్యం చేయకుండా ఈ సాయంత్రం ఈ రెసిపీని ట్రై చేసి చూడండి.
టాపిక్