Semiya Tomato Dosa: సేమియాలు టమాటోతో ఇన్‌స్టంట్ దోసెలు వేసుకోవచ్చని మీకు తెలుసా.. ఇదిగోండి రెసిపీ ట్రై చేసేయండి!-try this instant breakfast semolina tomato dosa recipe for your breakfast ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Semiya Tomato Dosa: సేమియాలు టమాటోతో ఇన్‌స్టంట్ దోసెలు వేసుకోవచ్చని మీకు తెలుసా.. ఇదిగోండి రెసిపీ ట్రై చేసేయండి!

Semiya Tomato Dosa: సేమియాలు టమాటోతో ఇన్‌స్టంట్ దోసెలు వేసుకోవచ్చని మీకు తెలుసా.. ఇదిగోండి రెసిపీ ట్రై చేసేయండి!

Ramya Sri Marka HT Telugu

Semiya Tomato Dosa: సేమియాతో ఉప్మా చేసుంటారు. స్వీట్ కూడా చేసుకుని ఉంటారు. కానీ, సేమియా టమాటోలు కలిపి దోసలు ఎప్పుడైనా తిన్నారా? కేవలం పదిహేను నిమిషాల్లో రెడీ అయ్యే సేమియా టమాటో దోసలు ఎలా తయారుచేసుకోవాలో చూద్దాం.

పదిహేను నిమిషాల్లో రెడీ అయ్యే సేమియా టమాటో దోస

సేమియాతో కేవలం ఉప్మా, పాయసమే కాదు, రుచికరమైన దోసలు కూడా వేసుకోవచ్చు. అది కూడా ముందు రోజు నానబెట్టి, రుబ్బుకుని పని లేకుండా కేవలం పది నుంచి పదిహేను నిమిషాల్లో తయారుచేసుకోవచ్చు. సేమియా, రవ్వతో కలిపి తయారుచేసే ఈ ఇన్ స్టంట్ దోసలు ఇంట్లో అందరికీ నచ్చుతాయి. పిల్లలకు ఇది మంచి బ్రేక్ పాస్ట్ ఆప్షన్. వేగంగా అవడంతో పాటు మరింత రుచికరంగా ఉంటుంది. సేమియా, రవ్వ కలిపి దోసెలు ఎలా తయారుచేసుకోవాలో చూద్దాం.

సేమియా టమాటో దోసకు కావాల్సిన పదార్థాలు:

  • సేమియా - ఒక కప్పు
  • బొంబాయి రవ్వ లేదా ఉప్మా రవ్వ - ఒక కప్పు
  • టమాటో - మీడియం సైజులో నాలుగు
  • అల్లం - అరంగుళం ముక్క
  • కరివేపాకు - రెండు రెమ్మలు
  • ఎండుమిర్చి - నాలుగు
  • కొత్తిమీర - అర కప్పు
  • ఉప్పు - రుచికి తగినంత

సేమియా టమాటో దోస తయారీ విధానం:

  1. ముందుగా సేమియా ఒక కప్పు తీసుకుని దోరగా ఫ్రై చేసుకుని పక్కకు పెట్టుకోవాలి.
  2. ఆ తర్వాత ఒక కప్పు రవ్వను ఫ్రై చేసుకుని ఉంచుకోవాలి.
  3. ఇప్పుడు మిక్సీ జార్లో టమాటో ముక్కలు, అల్లం, కరివేపాకు, ఎండిమిరప కాయలు వేసుకుని గ్రైండ్ చేసుకోండి.
  4. అవి మెత్తగా అయిన తర్వాత, అదే మిశ్రమంలో వేయించిన రవ్వను వేసి, కాస్త నీరు పోసుకుని మళ్లీ గ్రైండ్ చేయండి.
  5. ఆ విధంగా తయారైన పిండిని ఒక బౌల్‌లోకి తీసుకుని, అందులో సేమియా, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర వేసుకుని బాగా కలుపుకోండి.
  6. ఆ పిండిని ఒక అరగంట సేపు నాననివ్వండి.
  7. ఇప్పుడు అందులో దోసలు వేసేందుకు సరిపోయేలా నీరు పోసుకుని, కాస్త ఉప్పు కలుపుకోండి.
  8. ఆ తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టి దానిపై పిండిని గుండ్రంగా పోసుకోండి.
  9. దోసను మీడియం ఫ్లేమ్ పైనే ఉంచుకుని బాగా రోస్ట్ అవనివ్వండి.
  10. అంతే, మెత్తగా ఉండి చాలా టేస్టీగా అనిపించే దోసలు రెడీ అయినట్లే.

ఈ దోసలో సేమియా నుంచి ప్రొటీన్, కార్బొహైడ్రేట్స్ ప్రబలంగా ఉండటంతో ఆరోగ్యానికి మంచివి. శరీరానికి తగిన శక్తి సమకూరుతుంది కూడా. టమాటో, అల్లం, కరివేపాకు వంటి పదార్థాలు ఉండి అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉంటాయి.

రమ్య శ్రీ మార్క హిందుస్థాన్ టైమ్స్‌లో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్. జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న ఆమె లైఫ్ స్టైల్, ఆస్ట్రాలజీ వార్తలు రాయడంలో ప్రత్యేకత కలిగి ఉంది. కాకాతీయ యూనివర్సిటీలో జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ పట్టా పొందారు. గతంలో ఈనాడు, టీన్యూస్, ఈటీవీ భారత్ వంటి సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు.లింక్డ్‌ఇన్‌లో ఆమెతో కనెక్ట్ అవ్వండి.

సంబంధిత కథనం