ఉదయాన్నే ఎటువంటి హడావుడి లేకుండా ఇన్‌స్టంట్‌గా బ్రేక్‌ఫాస్ట్ చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే ఈ రెసిపీ మీకు తప్పకుండా ఉపయోగపడుతుంది. హెల్తీగా రాగి పిండితో చేసే ఈ బ్రేక్ ఫాస్ట్ రుచిలో కూడా తక్కువేం చేయదు. ముఖ్యంగా పిల్లల ఆరోగ్యానికి మరింత మంచది. రాగుల పొడి, ఉప్మా రవ్వతో కలిపి ఈజీగా పదినిమిషాల్లో తయారు చేసుకునే ఈ దోస శరీరానికి చలువ కూడా. అంతేకాదు వీటిని తినడం వల్ల శరీరంలో పోషకాల నిల్వ పెరుగుతుంది. ఇంకెందుకు ఆలస్యం, రాగిపిండితో చేసే ఇన్‌స్టంట్ దోసలను తయారు చేసుకుని టేస్ట్ చేసేద్దాం రండి.
రాగి పిండిని ఏ రూపంలో తీసుకున్నప్పటికీ సరైన పోషకాలు అంది శరీరానికి శక్తి సమకూరుతుంది. ఎముకల దృఢంగా మారతాయి. హృదయారోగ్యానికి కూడా చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. బరువు తగ్గాలనుకునేవారు రాగి పిండితో చేసిన పదార్థాలు ఎక్కువ తీసుకోవాలి. ఇంకా ఇది డయాబెటిస్ సమస్య ఉన్న వారికి కూడా మంచిది. కేశారోగ్యానికి కూడా ఉపయోగపడుతుంది.