Potato Egg Omlet: ఉదయాన్నే ఆలూ ఎగ్ కలిపి ఇలా ఆమ్లెట్ వేసారంటే అదిరిపోతుంది.. వంట రాని వాళ్లు కూడా ఈజీగా వేసుకోవచ్చు-try this easy and tasty potato egg omlette recipe for morning breakfast and evening snacks ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Potato Egg Omlet: ఉదయాన్నే ఆలూ ఎగ్ కలిపి ఇలా ఆమ్లెట్ వేసారంటే అదిరిపోతుంది.. వంట రాని వాళ్లు కూడా ఈజీగా వేసుకోవచ్చు

Potato Egg Omlet: ఉదయాన్నే ఆలూ ఎగ్ కలిపి ఇలా ఆమ్లెట్ వేసారంటే అదిరిపోతుంది.. వంట రాని వాళ్లు కూడా ఈజీగా వేసుకోవచ్చు

Ramya Sri Marka HT Telugu
Jan 19, 2025 07:00 AM IST

Potato Egg Omlette: మీకు వంట చేయడం రాదా? ఆమ్లెట్ లతోనే సగం కాలాన్ని గడిపేస్తుంటారా? అయితే ఇది మీ కోసమే. ఉదయాన్నే బంగాళాదుంపలు, ఎగ్ లతో ఇలా ఆమ్లెట్ వేసుకున్నారంటే రుచి అదిరిపోతుంది. తయారు చేయడం కూడా చాలా సులువు. ఉదయం లేదా సాయంత్రం ఇది మీ కడుపును చక్కగా నింపుతుంది.

ఉదయాన్నే ఆలూ ఎగ్ కలిపి ఇలా ఆమ్లెట్ వేసారంటే అదిరిపోతుంది
ఉదయాన్నే ఆలూ ఎగ్ కలిపి ఇలా ఆమ్లెట్ వేసారంటే అదిరిపోతుంది

ఉదయాన్నే లేవగానే కడపుకు ఏదో ఒక ఆహారాన్ని అందించడం ప్రతి ఒక్కరికీ పెద్ద టాస్క్. అది కూడా రుచికరమైనది, ఆరోగ్యానికి మేలు చేసేది కావాలంటే మరీ కష్టం. వంట రాని వాళ్లు కూడా సులువుగా, త్వరగా చేసుకునే పదార్థం ఏమైనా ఉందా అంటే అది ఆమ్లెట్. ఆలూ, టమాట, గుడ్డుల కలిపి ఉదయాన్నే ఇలా ఆమ్లెట్ వేసుకున్నారంటే అదిరిపోతుంది. ఇది ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది. ఆలూ ఎగ్ ఆమ్లెట్ ఎలా వేయాలో తెలుసుకుందాం రండి.

కావల్సిన పదార్థాలు..

  1. ఒక బంగాళదుంప
  2. ఒక పెద్ద ఉల్లిపాయ
  3. కోడి గుడ్లు
  4. ధనియాల పొడి
  5. చిల్లీ ఫ్లాక్స్(పచ్చిమిరకయాలు అయినా పరవాలేదు)
  6. టమాటా కెచప్
  7. ఉప్పు

పొటాటో ఆమ్లెట్ తయారీ కావాల్సిన పదార్థాలు..

  • ముందుగా బంగాళదుంపలను తీసుకుని తొక్కతీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ముక్కలను నీటిలో వేసి ఉంచండి.
  • తరువాత ఒక పెద్ద ఉల్లిపాయను తీసుకుని సన్నగా తరిగి పెట్టుకోండి.
  • ఇప్పుడు ఒక కడాయి తీసుకుని దాంట్లో నూనె వేసుకుని ఉల్లిపాయలను గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారేంత వరకూ వేయించుకోవాలి.
  • తరువాత కడిగి నీటిలో పెట్టుకున్న బంగాళ దుంపలను కూడా వేయించుకోవాలి.
  • బంగాళ దుంపలు వేపుకునే సమయంలో చిల్లీ ఫ్లాక్స్ లేదా తురిమిన పచ్చిమిరపకాయ ముక్కలను వేసుకోండి. కాస్త ధనియాల పొడి వేసుకుని కలుపుతూ వేపుకోండి.
  • ఆ తర్వాత రెండు కోడి గుడ్లు తీసుకుని ఒక బౌల్ లో కొట్టండి. అందులో కాస్త ఉప్పు వేసి బాగా కలపండి.
  • ఇప్పుడు ఈ గుడ్డు మిశ్రమంలో వేయించుకున్న బంగాళ దుంపలు, ఉల్లిపాయలు వేసుకుని కలుపుకోండి.
  • ఇప్పుడు పాన్‌లో నూనె వేసుకుని అందులో గుడ్లు ఆలూ మిశ్రమాన్ని వేయండి.
  • ఇది నాలుగైదు నిమిషాల పాటు ఉడికిన తర్వాత దానిపై సన్నగా తురుముకున్న చీజ్ ను ఒక లేయర్ లాగా వేయండి.
  • తర్వాత మరోసారి గుడ్ల మిశ్రమాన్ని వేసి దాని మీద మళ్లీ చీజ్ స్టిక్స్ వేయండి.
  • ఇప్పడు మూత పెట్టి ఆమ్లెట్ ను కాసేపు ఉడకనివ్వండి.
  • తరువాత మూత తీసి ఆమ్లెట్ ను మరోవైపుకు తిప్పండి.
  • అలా రెండు వైపులా గోల్డెన్ రంగులోకి వచ్చిన ఆమ్లెట్ తీసుకుని సర్వ్ చేసుకోవడమే.
  • టమాటా కెచప్‌‌తో కలిపి తింటే సూపర్‌గా ఉంటుంది. ఇది ఉదయమైనా, సాయంత్రం, రాత్రి ఎప్పుడు కావాలంటే అప్పుడు మీ కడుపును నింపుతుంది.

Whats_app_banner

సంబంధిత కథనం