New year Party Recipe: పార్టీలో స్టార్టర్స్ ఏం పెట్టాలో ఆలోచిస్తున్నారా! అందరికీ నచ్చే చికెన్ మంచూరియా చేయండి-try this crispy and tasty chicken manchurian recipe at home for new year party 2025 ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  New Year Party Recipe: పార్టీలో స్టార్టర్స్ ఏం పెట్టాలో ఆలోచిస్తున్నారా! అందరికీ నచ్చే చికెన్ మంచూరియా చేయండి

New year Party Recipe: పార్టీలో స్టార్టర్స్ ఏం పెట్టాలో ఆలోచిస్తున్నారా! అందరికీ నచ్చే చికెన్ మంచూరియా చేయండి

Ramya Sri Marka HT Telugu
Dec 31, 2024 06:30 AM IST

New year Party Recipe: న్యూ ఇయర్ పార్టీ ఈ సారి ఇంట్లోనే ప్లాన్ చేశారా? ఇంటికి వచ్చిన అతిథులకు రుచికరమైన ఆహారాలు పెట్టాలని అనుకుంటున్నారా? చిన్న పిల్లల నుంచి పెద్దల వరకూ అందరికీ నచ్చే చికెన్ మంచూరియాను మెనూలో చేర్చండి. ఇక్కడ రెసిపీ ఉంది ఎలా చేయాలో తెలుసుకోండి.

 చికెన్ మంచూరియా తయారు చేయడం ఎలా?
చికెన్ మంచూరియా తయారు చేయడం ఎలా?

కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టడానికి ఇంకా కొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే సందడి వాతావరణం మొదలైంది. న్యూ ఇయర్ సందర్భంగా కొందరు స్నేహితులతో ట్రిప్స్ ప్లాన్ చేస్తే మరికొందరు ఫ్యామిలీతో పార్టీలు ప్లాన్ చేసుకున్నారు. మీరు కూడా ఈ సారి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఇంట్లోనే ప్లాన్ చేసి ఉంటే, అతిథిలు మెచ్చే ఆహారం చేసి పెట్టాలనుకుంటే ఇది మీ కోసమే.చిన్న పిల్లల నుంచి పెద్దల వరకూ ప్రతి ఒక్కరూ ఇష్టంగా తినే ఆహారంలో చికెన్ మంచూరియా ఒకటి. బయటి తినాలనుకుంటే మొదట గుర్తొచ్చే పదార్థం కూడా ఇదే. స్పైస్పీ అండ్ టేస్టీ చికెన్ మంచూరియాను ఎప్పుడూ బయటే తినకుండా ఈ సారి ఇంట్లోనే తయారు చేసుకుని తినండి. ఎలా తయారు చేయాలో ఇక్కడ వివరంగా ఉంది.

yearly horoscope entry point

చికెన్ మంచూరియాకు కావాల్సిన పదార్థాలు:

చికెన్ ఫ్రై కోసం..

  • బోన్ లెన్ బ్రెస్ట్ చికెన్- 500 గ్రాములు
  • గుడ్డు తెల్ల సొన-ఒక గుడ్డు
  • సోయా సాస్- 2 టేబుల్ స్పూన్లు
  • కారం- 2 టేబుల్ స్పూన్లు
  • కార్న్ స్టార్చ్ -4 టేబుల్ స్సూన్లు
  • బియ్యం పిండి- 3 టేబుల్ స్పూన్లు
  • అల్లం వెల్లుల్లి పేస్ట్- 2 టేబుల్ స్పూన్లు
  • మిరియాల పోడి - ఒక టేబుల్ స్పూన్
  • ఉప్పు- రుచికి తగినంత
  • నూనె- డీప్ ఫ్రైకి సరిపడా

మంచూరియా గ్రేవీ కోసం..

  • సన్నగా తరిగిన అల్లం- 2 టేబుల్ స్పూన్లు
  • సన్నగా తరిగిన వెల్లుల్లి- ఒక టేబుల్ స్పూన్
  • సన్నగా తరిగిన ఉల్లిపాయలు- 4 టేబుల్ స్పూన్లు
  • సోయా సాస్- 2 టేబుల్ స్పూన్లు
  • రెడ్ చిల్లీ సాస్- 4 టేబుల్ స్పూన్లు
  • టమాటో సాస్- నాలుగు టేబుల్ స్పూన్లు
  • వెనీగర్- 2 టేబుల్ స్పూన్లు
  • వాటర్ - రెండు కప్పులు
  • కార్న్ స్టార్చ్- 4 టేబుల్ స్పూన్లు
  • చికెన్ ఉడికించిన నీరు- 6 టేబుల్ స్పూన్లు
  • ఉప్పు- రుచికి సరిపడ
  • చక్కెర- 2 టీస్పూన్లు
  • క్యాప్సికమ్- ఓకటిన్నర కప్పులు

చికెన్ మంచూరియా తయారీ విధానం:

  • ముందుగా చిన్నగా కట్ చేసిన బోస్ లెస్ బ్రెస్ట్ చికెన్ తీసుకుని శుభ్రంగా కడుక్కోవాలి.
  • తర్వాత చికెన్లో సోయా సాస్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, మిరియాల పొడి వేసి చక్కగా కలపండి.
  • ఆ తర్వాత ఇందులోనే గుడ్డు తెల్లసొన, బియ్యం పిండి, కార్న్ ఫ్లోర్ వేసి కలపండి.
  • ఇవన్నీ కలిపిన తర్వాత చికెన్ ను గంటపాటు పక్కన పెట్టండి.
  • గంట పాటు చక్కగా మారినేట్ అయిన చికెన్ మిశ్రమాన్ని తీసుకుని గుండ్రటి వుండల్లాగా చేయండి.
  • ఇప్పుడు ఒక ఫ్రై ప్యాన్ తీసుకుని దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోయండి.
  • నూనె చక్కగా మరిగిన తర్వాత వేయించండి.చికెన్ వుండలను దాంట్లో వేసి వేయించండి.అటు ఇటు తిప్పుకుంటూ, మీడియం ఫ్లేములో మాత్రమే వేయించాలని గుర్తుంచుకోండి.
  • చికెన్ ముక్కలన్నీ బంగారు రంగులో మారిన తర్వాత తీసుకుని టిష్యూ పేపర్ లేదా కిచెన్ టవల్ లో వేసి పక్కకు పెట్టండి.
  • ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని దాంట్లో నాలుగు టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లోర్, ఒక కప్పుకు పైగా నీరు పోసి కలిపి పక్కకు పెట్టుకోండి.
  • మరొక బౌల్ తీసుకుని దాంట్లో వెనిగర్, సోయా సాస్, చెక్కర, రెడ్ చిల్లీ సాస్, టామాలో సాస్ వేసి అన్నింటినీ కలిపి పక్కకు పెట్టుకోండి.
  • ఇప్పుడు మొదట చికెన్ ను ఫ్రై చేసుకున్న ఫ్రైయింగ్ ప్యాన్ ను తీసుకుని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ నూనెను పోయండి.
  • నూనె కాస్త వేడెక్కిన తర్వాత సన్నగా తురిమిన అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు వేయండి.
  • ఇవి చక్కగా వేగి మంచి సువాసన వెదజల్లుతున్నప్పుడు దాంట్లో ఉల్లిపాయలు, ఉల్లికాడలు వేసి వేయించండి.
  • ఉల్లిపాయలు రంగు మారిన తర్వాత దాంట్లో క్యాప్సికమ్ ముక్కలు వేయండి.
  • తరువాత మనం తీసుకున్న అన్ని రకాల సాస్ లను దీంట్లో వేసి చక్కగా కలపండి.
  • సాస్ ను వేడెక్కిన తర్వాత కప్పులో కలిపి పక్కక్కు పెట్టుకున్న నీరు, కార్న్ ఫ్లోర్ మిశ్రమాన్ని దీంట్లో పోయండి.
  • ఈ నీరు మరుగుతున్నప్పుడు ఇంకాస్త నీరు పోసి ఉప్పు కారం, చక్కెర వేసి కలపండి.రుచి చూసి వేయండి.
  • ఈ మిశ్రమం అంతా వేడిక్కి నీరు మరుగుతున్న సమయంలో వేయించి పెట్టుకున్న చికెన్, స్ప్రింగ్ ఆనియన్స్ వేసి చికెన్ ను సాసెస్ అన్నీ పట్టేలా బాగా కలపండి.
  • రెండు నిమిషాల పాటు వీటన్నింటినీ ఉడికించి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి.
  • అంతే టేస్టీ అండ్ స్పైసీ చికెన్ మంచూరియా తయారైనట్టే. సర్వ్ చేసుకుని పెట్టేయచ్చు.

Whats_app_banner