Cauliflower Cutlet: కాలీఫ్లవర్‌తో ఇలా కట్లెట్ చేసి పెట్టారంటే.. మీ శ్రీవారితో పాటు పిల్లలు మిమ్మల్ని మెచ్చుకోవడం ఖాయం!
Cauliflower Cutlet: శీతాకాలంలో ఎక్కువగా అందుబాటులో ఉండే కూరగాయ కాలీఫ్లవర్. ఈ సమయంలో దాదాపు ప్రతి ఒక్కరి ఇంట్లో ఇది ఉంటుంది. అయితేఎప్పుటిలాగా కర్రీ చేసుకుని తినేకన్నా కొత్తగా క్రిస్పీగా కట్లెట్లను తయారు చేయండి. ఇది మీ ఇంట్లో అందరికీ తప్పకుండా నచ్చుతుంది. ఈజీ రెసిపీతో టైం కూడా సేవ్ చేసుకోవచ్చు.
న్యూ ఇయర్‌కి పార్టీ ప్లాన్ చేశారా? లేదా ఈవెనింగ్ ఇంటికి బంధువులు వస్తున్నారా..? సందర్భమేదైనా సరే చక్కటి స్పెషల్ స్నాక్స్ చేయాలనుకుంటుంటే, ఇది ట్రై చేయండి. వెజ్ రెసిపీ కాబట్టి నచ్చని వారు, మెచ్చని వారుండరు. శీతాకాలంలో పుష్కలంగా దొరికే కూరగాయల్లో ఒకటైన ఈ క్యాలీఫ్లవర్ తో టేస్టీగా కట్లెట్లను ట్రై చేయండి. క్రిస్పీగా ఉండే స్నాక్స్ తిన్న ప్రతిఒక్కరూ సూపర్బ్ టేస్ట్ అని మెచ్చుకోకుండా ఉండరు. మరింకెందుకు ఆలస్యం మీరూ ఆ రెసిపీ చూసేయండి.
కాలీఫ్లవర్ కట్ లెట్స్ తయారీకి కావలసిన పదార్థాలు:
- ఒకటి నుండి రెండు కాలీఫ్లవర్
- 1 టీస్పూన్ ఉప్పు
- 1 ఉల్లిపాయ
- సన్నగా తరిగిన పచ్చిమిర్చి
- 1 టీస్పూన్ కొత్తిమీర
- ½ టీస్పూన్ వాము
- ఎండి మిరపకాయలు తగినన్ని
- ½ టీస్పూన్ తురిమిన అల్లం
- మామిడి పొడి
- కశ్మీరీ కారం పొడి ½ టీస్పూన్
- శనగపిండి 2 టీస్పూన్లు
- బియ్యం పిండి
- కాలీఫ్లవర్
కట్లెట్ తయారీ విధానం..
- ముందుగా కాలీఫ్లవర్ పువ్వులను కట్ చేసి వేరు చేయాలి. తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రంగా కడుక్కోవాలి.
తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి దాంట్లో నీళ్లు పోసి వేడి చేయాలి. ఇందులోనే ఒక టీస్పూన్ ఉప్పు వేయాలి.
- నీళ్లు మరగడం మొదలు కాగానే కట్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కలన్నింటినీ దీంట్లో వేసి ఉడికించాలి.
-కాలీఫ్లవర్ ముక్కలన్నీ ముప్వావు వంతు ఉడికిన తర్వాత వాటిని వడకట్టి పక్కక్కు పెట్టుకోవాలి.
-ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని దాంట్లో కాస్త నూనె పోయాలి. నూనె వేడిక్కిన తర్వాత దాంట్లో ఉల్లిపాయలు, పచ్చిమిర్చీ, కొత్తిమీర వేసి వేయించండి.
- ఆ తర్వాత జీలకర్ర, వామును చేతులతో బాగా నలిపి దాంట్లో వేసి వేయించండి.
- అదే గిన్నెలో ఎండి మిరపకాయలను వేసి బాగా కలిపిన తర్వాత అల్లం, పసుపు, మామిడి పొడి, రుచికి తగినంత ఉప్పు వేయాలి.
- ఈ పదార్థాలన్నింటినీ బాగా కలుపుతూ కాసేపటికి నూనెలో వేయించండి.
-ఇప్పుడు దీంట్లో ముందుగాఉడికించి వడకట్టి పక్కకు పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలను వేసి బాగా కలపండి.
-కాలీఫ్లవర్ ముక్కలు నూనెలో కాసేపు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కకు పెట్టండి.
-ఇవన్నీ చల్లారిన తర్వాత మిక్సీ జార్ లో వేసి కచ్చాపచ్చాగా రుబ్బండి. తర్వాత ఈ మిశ్రమంలో శనగపిండి, బియ్యంపిండి వేసి పిండి మాదిరిగా బాగా కలపండి.
-ఇప్పుడువీటిని చేతిలో వేసి గారెల్లా చేసి వేడెక్కిన నూనెలో వేసి అన్నింటినీ కలిపి వేడి నూనెలో వేసి వేయించాలి.
అంతే రుచికరమైన క్యాబేజీ కట్లెట్స్ సిద్ధమయినట్టే. వీటిని స్నాక్స్ లాగా, అతిథులకైతే స్టార్టర్స్ లాగా ఇవచ్చు. సాయంత్రాల్లో సరదాగా ఛాయ్‌తో కలిపి కూడా తినచ్చు.
సంబంధిత కథనం