రబ్డీ గురించి ఉత్తర భారత దేశ వంటకాల్లో ఎక్కువగా వింటుంటాం. కాస్త బాసుంది లాగా పోలి ఉంటుందిది. పాలను సగం దాకా మరిగించి చిక్కగా తయారు చేసి దాంతో రబ్డీ తయారు చేస్తారు. ప్రత్యేక వేడుకల్లో తప్పకుండా రబ్డీ ఉండాల్సిందే. అయితే దీనికి సీతాఫలం జోడిస్తే రుచి మరింత బాగుంటుంది. ఒక మంచి డెజర్ట్ రెసిపీ అవుతుంది.
సీతాఫలం వాడటం వల్ల తీపి కోసం ఎక్కువగా పంచదార వాడాల్సిన అవసరం లేకుండా హెల్తీగా ఉంటుంది. సీతాఫలం సీజన్ మొదలైనట్లే. ఈ పండ్లు పుష్కలంగా దొరికినప్పుడే ఒక్కసారన్నా ఈ స్వీట్ రెసిపీ ట్రై చేయండి. రుచి మాత్రం అమోఘంగా ఉంటుంది.
(సీతాఫలం గింజలు వేరు చేసి గుజ్జును మాత్రమే తీసుకోవాలి)
సీతాఫల్ తీపి, క్రీమీ గుజ్జుతో కూడిన పండు. దీంట్లో విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. చర్మాన్ని ఆరోగ్యకరంగా ఉంచుతుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. రబ్డీ కోసం వాడే పాల నుండి కాల్షియం, ప్రోటీన్ దొరుకుతుంది. ఇది ఎముక ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుంది. గార్నిష్ కోసం ఉపయోగించే బాదం, పిస్తాపప్పులు అవసరమైన ఫ్యాటీ యాసిడ్లు, విటమిన్ ఇ ను అందిస్తాయి. ఇవన్నీ ఈ కమ్మటి స్వీట్ పోషక విలువల్ని పెంచుతాయి.
టాపిక్