Meat Cooking Tips: మాంసం రుచి అద్భుతంగా ఉండాలంటే, వండేటప్పుడు ఈ నాలుగు విషయాలు మర్చిపోకండి!-try these 4 cooking tips to achieve perfectly cooked and tender meat or chicken every time ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Meat Cooking Tips: మాంసం రుచి అద్భుతంగా ఉండాలంటే, వండేటప్పుడు ఈ నాలుగు విషయాలు మర్చిపోకండి!

Meat Cooking Tips: మాంసం రుచి అద్భుతంగా ఉండాలంటే, వండేటప్పుడు ఈ నాలుగు విషయాలు మర్చిపోకండి!

Ramya Sri Marka HT Telugu
Jan 05, 2025 08:30 AM IST

Meat Cooking Tips: మటన్ లేదా చికెన్ వండేటప్పుడు ఈ 4 వంట చిట్కాలను మీరు ప్రయత్నించాలి. అలా చేస్తే మాంసం ఉడకలేదనే ఫీలింగ్ రాదు. ప్రతి పీస్ అద్భుతమైన రుచితో మృదువుగా అనిపిస్తుంది. అలా ఉండేందుకు పాటించాల్సిన చిట్కాలంటో చూద్దామా..

మాంసం రుచి అద్భుతంగా ఉండాలంటే,
మాంసం రుచి అద్భుతంగా ఉండాలంటే, (shutterstock)

వీకెండ్ వచ్చిందంటే భోజనంలోకి చికెన్ లేదా మటన్ ఉండాల్సిందే. చాలా పండుగలు, ప్రత్యేక రోజుల్లో కూడా మాంసాహారానికి ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది. అయితే రుచిగా, మృదువుగా లేకపోతే చికెన్ లేదా మటన్ తిన్న తృప్తి కూడా ఉండదు. కొన్నిసార్లు మాంసం ఉడకకుండా, మరికొన్ని సార్లు అన్ని ముక్కలకు మసాలా రుచిపట్టకుండా ఉంటుంది. అలాంటప్పుడు తిన్న తర్వాత కాస్త నిరాశ కనిపించొచ్చు. అతిథుల ముందు ఇది అవమానంగా కూడా అనిపించొచ్చు. ఇలాంటి సమస్య రాకుండా ఉండాలంటే మటన్ లేదా చికెన్ వండేటప్పుడు తప్పకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు కొన్ని ఉన్నాయి. ఈ చిట్కాలు పాటించి మృదువైన, రుచికరమైన చికెన్ లేదా మటన్‌ను మీరు ఎంజాయ్ చేయొచ్చు. అతిథులతోనూ ఔరా అనిపించుకోవచ్చు.

yearly horoscope entry point

మాంసాన్ని రుచికరంగా వండుకునేందుకు కోసం చిట్కాలు:

1. మాంసం ముక్కలను సరైన పద్ధతిలో కట్ చేసుకోండి

మీరు వంట చేస్తున్న మాంసాన్ని బట్టి ముక్కలు కట్ చేసే విధానం మార్చుకోవాలి. గొర్రె, మేక వంటి మాంసాన్ని వండుకునే సమయంలో చాలా చిన్న చిన్న ముక్కలు కట్ చేయాలి. అప్పుడు ఆ ముక్కలకు మసాలాతో పాటు అన్ని రకాల రుచులు సమపాళ్లలో అందుతాయి.

చికెన్ వండేటప్పుడు ముక్కలు కాస్త పెద్దగా ఉన్నా పరవాలేదు. చికెన్ వండుకోవాలని అనుకుంటే, లెగ్ పీస్, వింగ్స్ వంటివి చాలా బాగా అనిపిస్తాయి.ఇవి బ్రెస్ట్ పీస్ కంటే ఎక్కువ జ్యూసీగా ఉంటాయి. చికెన్ వండుకునే సమయంలో బ్రెస్ట్ పీసులు, బ్యాక్ పీసులు చాలా చిన్నవిగా కట్ చేసుకోవాలి.పీసులు పెద్దవిగా ఉంటేనే ఇష్టంగా తింటామనుకునేవారు వాటిపై గాట్లు పెట్టుకోండి. ఇలా చేయడం వల్ల మాంసం మృదువుగా ఉడకడంతో పాటు మసాలాలన్నీ ముక్కలకు పట్టి మరింత రుచిగా మారుతుంది.

2. మాంసాన్ని ఉడికించేటప్పుడు సరైన మంట ఉపయోగించడం అత్యవసరం

మాంసం లేదా చికెన్ వండేటప్పుడు మంట కీలకపాత్ర వహిస్తుంది. మాంసం ముక్కలు పూర్తిగా ఆవిరిలో ఉడకాలంటే మీడియం ఫ్లేమ్ లో ఉంచాలి. ఏ మాత్రం మంట ఎక్కువైనా త్వరగా మాడిపోయే అవకాశం ఉంది. మరీ లేటు అవకుండా ఉండటానికి తక్కువ మంటపై అస్సలు ఉంచొద్దు.

3. మాంసాన్ని మారినేట్ చేయండి

మటన్ లేదా చికెన్ వండుకోవడాని కంటే ముందే మరో పని చేయాలి. మారినేట్ చేయడం అనేది మాంసం లోపలికి రుచిని జొప్పిస్తుంది. అంతేకాకుండా, మాంసాన్ని మృదువుగా మార్చడంలో సహాయపడుతుంది. వెనిగర్, నిమ్మరసం, పెరుగు వంటి ఎంజైమ్‌లను ఉపయోగించడం ద్వారా మాంసాన్ని స్మూత్ గా మార్చుకోవచ్చు. వండటానికి కనీసం 30 నిమిషాల ముందైనా వీటన్నిటినీ కలిపి పెట్టుకోవాలి. ఇంకా మృదువుగా, రుచికరంగా రావాలంటే రాత్రంతా మారినేట్ చేసుకుని ఉంచండి.

4. వంట చేసిన తర్వాత మాంసాన్ని కాసేపు అలా ఉండనివ్వాలి

చాలా మంది చేసే పొరబాటు మాంసం ఉడుకుతున్న సమయంలోనే ప్లేటుతో రెడీగా ఉండటం. అలా స్టవ్ ఆఫ్ చేశామో లేదో తినేయడానికి రెడీగా ఉంటాం. ఇలా చేయడం వల్ల ముక్కకు మసాలాలు, ఉప్పు, కారం వంటివి పూర్తిగా పట్టవు. అందుకే కర్రీ వండిన సూప్ మాంసం ముక్కల్లోకి ఇంకేందుకు, స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కాసేపటి వరకూ వేచి ఉండాలి.

ఈ నాలుగు టిప్స్ మీ వంటలను మరింత రుచిగా, సంతోషకరంగా మార్చడానికి మీకు సహాయం చేస్తాయి. ఈ నాలుగు టిప్స్ అనుసరించడం ద్వారా మీరు సింపుల్‌గా మృదువైన, రుచికరమైన చికెన్ లేదా మటన్ కర్రీ తయారుచేసుకోవచ్చు.

Whats_app_banner

సంబంధిత కథనం