Pimples on Scalp: తలపై మొటిమలు.. ఇలా సులభంగా తొలగించుకోండి!-troubled by pimples on your scalp here s how to get rid of them ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Troubled By Pimples On Your Scalp? Here's How To Get Rid Of Them

Pimples on Scalp: తలపై మొటిమలు.. ఇలా సులభంగా తొలగించుకోండి!

HT Telugu Desk HT Telugu
Oct 03, 2022 09:18 PM IST

Pimples on Scalp: తలపై మొటిమలు చాలా బాధాకరంగా ఉంటాయి. ఈ సమస్య సాధారణంగా రంధ్రాల అడ్డుపడటం వల్ల లేదా బ్యాక్టీరియా లేదా ఫంగల్ ఇన్ఫెక్షన్ వల్ల రావచ్చు. వీటిని స్కాల్ప్ యాక్నే అంటారు.

Pimples on Scalp
Pimples on Scalp

చాలా మంది ముఖంపై మొటిమల కారణంగా ఇబ్బంది పడుతుంటారు. మొటిమలు ముఖ అందాన్ని పాడుచేస్తాయి. సాధరణంగా మొటిమలు ముఖంపైనే ఎక్కువగా కనిపిస్తుంటాయి. కానీ తలపై కూడా వస్తాయంటే నమ్ముతారా? ఈ మధ్య కాలంలో తలపై మొటిమలు కారణంగా ఇబ్బంది పడే వారే సంఖ్య పెరిగిపోయింది. తలపై ఏర్పడే మొటిమల వల్ల తీవ్రంగా ఇబ్బందిపడాల్సి వస్తుంది. ఈ సమస్య చర్మంపై ఉండే రంధ్రాల అడ్డుపడటం వల్ల లేదా బ్యాక్టీరియా లేదా ఫంగల్ ఇన్ఫెక్షన్ వల్ల రావచ్చు. వీటిని స్కాల్ప్ యాక్నే అని కూడా అంటారు. మీ తలపై చిన్న మొటిమలు లేదా మొటిమలు వచ్చినట్లయితే, వాటిని తొలగించడానికి ఈ ఇంటి నివారణలను పాటించండి.

టొమాటో జ్యూస్-

సాలిసిలిక్ యాసిడ్ అధికంగా ఉండే టొమాటోలు మీ స్కాల్ప్ pH స్థాయిని బ్యాలెన్స్ చేయడం ద్వారా మొటిమలను క్రమంగా తగ్గించడంలో సహాయపడతాయి. ఈ రెమెడీ చేయడానికి, ముందుగా ఒక గిన్నెలో టొమాటో రసాన్ని తీసి, దూది ముక్కను నానబెట్టి, తలలోని మొటిమల మీద తేలికగా రాయండి. ఒక గంట తర్వాత ఏదైనా తేలికపాటి షాంపూతో మీ తలను కడగాలి.

మెంతులు

మెంతులతో ఈ సమస్యలను తొలగించుకోవడానికి నానబెట్టిన మెంతులు గింజలు రుబ్బి ఆ తర్వాత దీన్ని తలకు పట్టించి 30 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. ఆ తర్వాత మీ జుట్టును షాంపూతో కడగాలి.

వెల్లుల్లి

వెల్లుల్లిలో సాలిసిలిక్ యాసిడ్, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఫంగల్, యాంటీ వైరల్ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది తలపై వచ్చే మొటిమల నుంచి ఉపశమనం పొందడంలో చాలా సహాయపడుతుంది. కొన్ని వెల్లుల్లి రెబ్బలను నీటిలో ఉడకబెట్టిన తర్వాత, ఆ నీటిని చల్లబరచండి. మీ వతలపై 30 నిమిషాల పాటు ఉంచండి.ఆ తర్వాత తేలికపాటి షాంపూతో తలను కడగాలి.

కలబంద, పుదీనా –

20 పుదీనా ఆకులను నీటిలో వేసి సగానికి తగ్గించి, ఆ తర్వాత అలోవెరా జెల్ తీసుకొని పుదీనా ద్రావణంలో కలపండి. దీన్ని రోజూ తలకు బాగా పట్టించడం వల్ల ప్రయోజనం ఉంటుంది.

ఆపిల్ సెడార్

వెనిగర్ - యాపిల్ సైడర్ వెనిగర్‌లో క్రిమినాశక యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి, ఇవి మొటిమలను కలిగించే బ్యాక్టీరియా మరియు నూనెను నెత్తిమీద నుండి శుభ్రపరుస్తాయి.సమాన పరిమాణంలో వెనిగర్, నీరు కలపండి, ఈ మిశ్రమాన్ని జుట్టుకు అప్లై చేసి 20 నిమిషాలు అలాగే ఉంచండి. కాసేపటి తర్వాత మీ తల కడగాలి.

WhatsApp channel

సంబంధిత కథనం