Bad Breath: నోటి దుర్వాసనతో ఇబ్బంది పడుతున్నారా? ఈ సింపుల్ ఇంటి చిట్కాలతో వదిలించుకోండి
Bad Breath: నోటి దుర్వాసన మిమ్మల్ని ఇతరుల ముందు ఇబ్బంది పడేలా చేస్తుంది. మీ ఆత్మవిశ్వాసాన్ని తగ్గిస్తుంది. ఈ హోం రెమెడీస్ ఆ సమస్యను తగ్గించేందుకు సహాయపడతాయి.
నోటి నుంచి వచ్చే దుర్వాసన ఎంతో ఇబ్బందిని కలిగిస్తుంది. ఈ సమస్య మీ ఆత్మవిశ్వాసాన్ని తగ్గించడమే కాదు ఇతరుల ముందు మీకు చాలాసార్లు ఇబ్బంది కలిగిస్తుంది. నోటి నుండి దుర్వాసన రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. కానీ దంతాలను శుభ్రం చేయడంలో నిర్లక్ష్యం, చిగుళ్లలో వాపు, పైరియా లేదా రక్తస్రావం, నాలుకను సరిగ్గా శుభ్రం చేయకపోవడం, నోరు పొడిబారడం దీనికి ప్రధాన కారణాలు కావచ్చు. మీరు కూడా ఈ సమస్యతో బాధపడుతుంటే, ఈ హోం రెమెడీస్ మీ సమస్యను అధిగమించడానికి మీకు సహాయపడతాయి.

లవంగాలు
లవంగాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. బ్రష్ చేసిన తర్వాత నోటి నుంచి దుర్వాసన వస్తుంటే లవంగాల సాయంతో ఉపశమనం పొందవచ్చు. ఈ లవంగాలను బ్యాగులో లేదా జేబులో కొన్ని ఉంచుకోండి. రోజులో మూడు నుంచి నాలుగు సార్లు ఈ లవంగాలను నమిలేందుకు ప్రయత్నించండి. లవంగాల్లో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు నోటిలో దాగి ఉన్న బ్యాక్టీరియాను సహజ పద్ధతిలో తొలగించడానికి సహాయపడతాయి. నోటి నుంచి దుర్వాసన రాకుండా అడ్డుకుంటాయి.
ఉప్పు, నూనె
ఆవనూనెను కొంత మీకోసం పక్కన పెట్టుకోండి. చిటికెడు ఆవనూనెలో చిటికెడు ఉప్పు కలిపి చిగుళ్లకు వేలితోనే మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల నోటి దుర్వాసన చాలా వరకు తగ్గిపోతుంది. అంతేకాదు ఈ రెమెడీని ఫాలో అవడం వల్ల చిగుళ్లు కూడా బలపడతాయి. ఇది దంతాలు బలపడడానికి ఎంతో సహాయపడతాయి.
సోంపు
ఆహారం తిన్న తర్వాత, ప్రజలు తరచుగా సోంపు తింటూ ఉంటారు. అయితే రెస్టారెంట్లకు వెళ్లినప్పుడే ఇలా సోంపు తినేందుకు ఇష్టపడతారు. నిజానికి ప్రతిరోజూ ఇంట్లో భోజనం చేశాక కూడా సోంపు తినడం ఆరోగ్యానికి మంచిది. సోంపు జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంతో పాటు మౌత్ ఫ్రెఫ్ నర్‌గా కూడా పనిచేస్తుంది. సోంపులో ఉండే కూలింగ్ ఏజెంట్ పొట్టను చల్లగా ఉంచుతూ నోటి దుర్వాసనను తొలగించడానికి సహాయపడుతుంది.
తులసి-పుదీనా
తులసి ఆకులు, పుదీనా ఆకులు రెమెడీ కూడా నోటి దుర్వాసనను తొలగించడానికి సహాయపడతాయి. ఈ రెమెడీ చేయడానికి పుదీనా ఆకులను గ్రైండ్ చేసి నీటిలో కరిగించాలి. ఇప్పుడు ఈ నీటితో రోజుకు మూడు సార్లు నోటితో కడగాలి. అలాగే తులసి రసాన్ని ఒక స్పూను నోటిలో వేసి పుక్కిలించడం వల్ల లేదా తాగడం వల్ల నోటి దుర్వాసన చాలా వరకు తగ్గుతుంది.
అల్లం
అల్లం రసం తాగడం కాస్త కష్టేమ కానీ ఆరోగ్యానికి మాత్రం చాలా మేలు చేస్తుంది. ఒక గ్లాసు నీటిలో ఒక స్పూను అల్లం వేసి బాగా మరిగించి చల్చార్చాలి. రోజుకు మూడు సార్లు ఆ నీటితో నోరు కడిగేస్తే నోటి దుర్వాసన నుంచి ఉపశమనం లభిస్తుంది.
(గమనిక: అధ్యయనాలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ కోసం ఇక్కడ అందిస్తున్నాం. ఇది కేవలం సమాచారం మాత్రమే. ఇది వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి సందేహాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించండి.)
టాపిక్