సల్మాన్ ఖాన్‌కున్న ఈ వ్యాధి భయంకరమైనది, ఆత్మహత్య చేసుకోవాలనిపించేలా చేసేది, ఇది వస్తే తట్టుకోవడం చాలా కష్టం-trigeminal neuralgia disease that salman khan has is terrible it makes you feel like committing suicide ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  సల్మాన్ ఖాన్‌కున్న ఈ వ్యాధి భయంకరమైనది, ఆత్మహత్య చేసుకోవాలనిపించేలా చేసేది, ఇది వస్తే తట్టుకోవడం చాలా కష్టం

సల్మాన్ ఖాన్‌కున్న ఈ వ్యాధి భయంకరమైనది, ఆత్మహత్య చేసుకోవాలనిపించేలా చేసేది, ఇది వస్తే తట్టుకోవడం చాలా కష్టం

Haritha Chappa HT Telugu

సల్మాన్ ఖాన్‌కు అభిమానులు ఎక్కువ. ఆయన జీవితం చూసి ఎంతోమంది ఈర్ష్య పడుతూ ఉంటారు. నిజానికి ఆయన ఒక బాధాకరమైన వ్యాధి నుంచి బయటపడ్డాడు.

సల్మాన్ ఖాన్‌కుండే వ్యాధి గురించి తెలుసా?

త్వరలో సల్మాన్ ఖాన్ సినిమా విడుదల కాబోతోంది. మార్చి 30న థియేటర్లలో సికిందర్ సినిమా కోసం ఆయన అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ బాలీవుడ్ సూపర్ స్టార్ జీవితంలో కూడా ఒక బాధాకరమైన అంశం ఉంది. అదే అతనికి ఉన్న వ్యాధి దాని పేరు ట్రైజెమీనల్ న్యూరాలజియా. ఈ వ్యాధి వల్ల ఆయనకి ఆత్మహత్య ఆలోచనలు కూడా వచ్చేవి. ఈ వ్యాధి వల్ల కలిగే నొప్పిని తట్టుకోవడం భయంకరంగా ఉండేది.

ఏమీటీ నాడీ వ్యాధి?

సల్మాన్ ఖాన్‌కు ఉండే ట్రైజెమీనల్ న్యూరాలజియా అనే వ్యాధి నాడీ సంబంధితమైనది. దీనివల్ల ముఖ భాగంలో విపరీతమైన నొప్పి వస్తుంది. ట్రైజేమినల్ అని పిలిచే నాడిని ఈ వ్యాధి తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. ఇది ముఖం నుండి మెదడుకు ఇంద్రియ సమాచారాన్ని ప్రసారం చేసే నాడి. ఈ వ్యాధి వస్తే నమిలినా, మాట్లాడినా, ముఖాన్ని తాకినా కూడా విపరీతమైన నొప్పి వస్తుంది. ఆ నొప్పి ఎలా ఉండేదంటే ఒక్కసారి విద్యుత్ షాక్ తగిలినట్టు లేదా గన్ నుంచి వచ్చే తూటా రీరాన్ని చొచ్చుకుపోయినట్టు అనిపిస్తుంది. ఆ నొప్పిని భరించడం చాలా కష్టం.ఈ వ్యాధి ఎందుకు వస్తుందో చెప్పడం కష్టమే. ముఖం తిప్పినప్పుడు కూడా ఎముకల నుంచి శబ్ధాలు వస్తూ ఉంటాయి.

సల్మాన్‌ కు ముఖంలో ఒక భాగంలో మాత్రమే ఇంత నొప్పి వచ్చేది. అది కొన్ని సెకన్ల నుంచి నిమిషాల పాటు ఉండి కనుమరుగయ్యేది. సల్మాన్ ఖాన్ కూడా ఈ నొప్పి గురించి చాలా ఇంటర్వ్యూలలో చెప్పాడు. గట్టిగా ముఖం మీద పంచ్ ఇస్తే ఎంత నొప్పి వస్తుందో అంత నొప్పిని ఈ వ్యాధి ఇచ్చేదని వివరించాడు. 2007లో పార్టనర్ అనే సినిమా చేస్తున్నప్పుడు అతనికి ఈ వ్యాధి లక్షణాలు తొలిసారిగా కనిపించాయి. తర్వాత వ్యాధి తీవ్రంగా మారడంతో 2011లో అమెరికా వెళ్లి చికిత్స చేయించుకుని వచ్చారు. చికిత్స చేయించుకోవడానికి ముందు అతడు తరచూ తీవ్రమైన ముఖనొప్పితో ఇబ్బంది పడేవాడు.

కేవలం సల్మాన్ ఖాన్ మాత్రమే కాదు బ్రిటిష్ ప్రధానమంత్రిగా చేసిన విలియం గ్లాడ్ స్టోన్ కు కూడా ఈ వ్యాధి ఉన్నట్లు చెబుతారు. ఈ వ్యాధి చాలా అరుదుగా వస్తుంది. ప్రపంచంలో కొద్దిమందికి మాత్రమే ఈ వ్యాధి ఉంది. దీన్ని భరించడం చాలా కష్టం. సల్మాన్ ఖాన్ అమెరికాలో ఆపరేషన్ చేయించుకున్న తర్వాత ఈ వ్యాధి తాలూకు లక్షణాలు చాలా వరకు తగ్గిపోయాయి. అతడు సాధారణ జీవితాన్ని గడపగలుస్తున్నాడు.

(గమనిక: అధ్యయనాలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ కోసం ఇక్కడ అందిస్తున్నాం. ఇది కేవలం సమాచారం మాత్రమే. ఇది వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి సందేహాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించండి.)

Haritha Chappa

TwittereMail
హరిత హిందూస్తాన్ టైమ్స్‌లో చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్లో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, తెలుగు సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్‌వర్క్‌లలో పని చేశారు. ప్రింట్, డిజిటల్ జర్నలిజంలో 17 ఏళ్ల అనుభవం ఉంది. 2023 డిసెంబరు నుంచి హిందూస్థాన్ టైమ్స్‌లో ఆస్ట్రాలజీ, లైఫ్‌స్టైల్ సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు. లింక్టిన్ లో కనెక్ట్ అవ్వండి https://www.linkedin.com/in/haritha-ch-288a581a8/

సంబంధిత కథనం