Trending Bra Designs: మార్కెట్లోకి కొత్త రకం'బ్రా'లు, వీటితో కలిగే ప్రయోజనాలే వేరు!-trending bra designs new types of bras have hit the market know the benefits and uses ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Trending Bra Designs: మార్కెట్లోకి కొత్త రకం'బ్రా'లు, వీటితో కలిగే ప్రయోజనాలే వేరు!

Trending Bra Designs: మార్కెట్లోకి కొత్త రకం'బ్రా'లు, వీటితో కలిగే ప్రయోజనాలే వేరు!

Ramya Sri Marka HT Telugu

Trending Bra Designs: మార్కెట్లోకి కొన్ని కొత్త రకం బ్రాలు వచ్చాయి. ఆధునికతతో కూడిన ఈ బ్రాలు మీకు సౌకర్యంతో పాటు స్టైలీష్ లుక్‌ను ఇస్తాయి. ట్రెండింగ్‌లో ఉన్న స్టైలీష్ అండ్ కంఫర్టబుల్ బ్రాలలో కొన్నింటి గురించి తెలుసుకోండి. మీ సౌకర్యాన్ని బట్టి తగినవి ఎంచుకోండి.

ట్రెండింగ్ స్టైలీష్ బ్రాలు

బ్రా అనేది స్త్రీల జీవితంలో చాలా ముఖ్యమైనది. ఇవి వారి శరీరాకృతిని పెంచి అందమైన, ఆకర్షణీయమైన రూపాన్ని అందిస్తాయి. ఇంట్లో, బయట సౌకర్యవంతమైన అనుభూతిని కలిగించి వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే..బ్రాలు స్త్రీల ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి. రొమ్ములకు మద్దతుగా నిలిచి శరీరాకృతిని కాపాడతాయి, రొమ్ముల్లో నొప్పి, సాగదీత వంటి సమస్యలను నివారిస్తాయి. ఫలితంగా వారు కాన్ఫిడెంట్‌గా, మరింత సౌకర్యంగా కనిపిస్తారు.

మార్కెట్లోకి ఇప్పుడు చాలా రకాల బ్రాలు వచ్చాయి. మరిన్ని ఆధునికతతో కూడిన ఈ బ్రా డిజైన్లు సౌకర్యంగా ఉండటం మాత్రమే కాకుండా స్టైలీష్ గా కనిపించేలా చేస్తాయి. వీటిని ధరించడం వల్ల మరింత స్వేచ్ఛగా, సౌకర్యవంతంగా, ఆత్మవిశ్వసంతో ఉండగలుగుతారు. ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న కొన్ని స్టైలీష్ అండ్ కంఫర్టబుల్ బ్రాలు, వాటి ప్రయోజనాలను తెలుసుకోండి. వీటిలో మీ అవసరాలకు, లైఫ్‌స్టైల్‌కి సరిపోయే బ్రాను ఎంచుకోండి.

హోమ్ బ్రా విత్ గ్యాదర్డ్ కప్స్:

ఇంట్లో రిలాక్స్ అవ్వడానికి, లైట్ యాక్టివిటీస్‌కి ఇది బెస్ట్ బ్రా. ఇది మీ శరీరానికి సహజమైన ఆకృతిని అందిస్తుంది. ఇంటి పనుల్లో నిమగ్నమైనప్పుడు సపోర్టివ్ గా, సౌకర్యంగా ఉంటుంది. కాటన్, నిట్‌వేర్ వంటి మెటీరియల్‌తో తయారు చేసిన ఈ బ్రాలను వేసుకుంటే రిలాక్స్‌డ్‌గా ఉంటుంది.

ప్యాడెడ్ మోల్డెడ్‌ లో బ్యాక్ బ్రా:

బ్యాక్‌లెస్ డ్రెస్సులు, టాప్స్‌కి ఇది పర్ఫెక్ట్ బ్రా. స్ట్రాప్స్ కనిపించవు. పార్టీలు, ప్రత్యేక సందర్భాల్లో వేసుకునే డ్రెస్సులకు పర్ఫెక్ట్ గా యూజ్ అవుతుంది. స్మూత్, మోల్డెడ్ కప్స్‌తో తయారు చేసిన ఈ బ్రాలు వేసుకుంటే అందంగా, ఆకర్షణీయంగా కనిపిస్తారు.

క్విర్కీ బ్రా:

ప్రత్యేకమైన డిజైన్స్, రంగులతో మీ మూడ్‌ని మార్చే బ్రా ఇది. టీనేజర్స్, యువతకు ఇది చాలా బాగుంటుంది. పార్టీలు, ఫంక్షన్లకు ప్రత్యేకం. కాటన్, లైక్రా వంటి మెటీరియల్‌తో తయారు చేసిన ఈ బ్రాలను వేసుకుంటే మీకు స్టైలిష్‌గా, కంఫర్ట్‌గా ఉంటుంది.

నాన్-ప్యాడెడ్ అండర్‌వైర్ బ్రా:

ప్యాడింగ్ లేకుండా సపోర్ట్, లిఫ్ట్ ఇచ్చే స్పెషల్ బ్రా ఇది. ఇది ప్లస్ సైజు ఉన్నవారికి అంటే కాస్త లావుగా ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది. ఈ లోదుస్తులు స్ట్రాంగ్ సపోర్ట్ కోసం అండర్‌వైర్‌తో తయారు చేయబడి ఉంటాయి. వీటిని వేసుకుంటే కాన్ఫిడెంట్‌గా, కంఫర్టబుల్‌గా ఉంటుంది.

బేసిక్ మోల్డెడ్ బ్రా విత్ హిడెన్ బాటమ్:

ఈ బ్రాలు మీకు మంచి షేపింగ్ ఇస్తూనే బట్టల కింద కనిపించకుండా ఉంటుంది. ఇది రోజూ వేసుకునే దుస్తులకు అనుకూలంగా ఉంటుంది. ఈ బ్రాలు ఎలాంటి అవుట్‌ఫిట్‌కైనా సూట్ అయ్యేలా డిజైన్ చేసివి. వీటిని వేసుకుంటే కంఫర్ట్‌గా ఉంటుంది.

సీమ్‌లెస్ బాండెడ్ బ్రాస్:

బయటకు కనిపించకుండా స్మూత్ ఫిట్ కోసం సీమ్‌లెస్ బాండెడ్ బ్రాస్ సూపర్ గా యూజ్ అవుతాయి. వీటిని రోజంతా ధరించినా కంఫర్ట్‌గా ఉంటుంది. ఆఫీసులకు, ప్రత్యేక సందర్భాల్లో వేసుకునే దుస్తులకు కూడా ఇది చాలా అనువుగా ఉంటుంది. సాఫ్ట్, స్ట్రెచ్చీ ఫాబ్రిక్‌తో తయారు చేసిన ఈ బ్రాలను వేసుకుంటే మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు.

ఫ్రంట్-ఓపెన్ పోశ్చర్ కరెక్టర్ బ్రా:

ఈ బ్రా మీ పోశ్చర్‌ను కరెక్ట్ చేస్తూ కంఫర్ట్ ఇస్తుంది. ఆఫీసుల్లో, ఎక్కువసేపు కూర్చునేవారికి ఇది చాలా సౌకర్యంగా ఉంటుంది. ఈ బ్రాలు బ్యాక్ సపోర్ట్ కోసం స్పెషల్ ప్యానెల్స్‌తో తయారు చేసినవి. వీటిని వేసుకుంటే పోశ్చర్ కరెక్ట్‌గా ఉంటుంది.

నాన్-ప్యాడెడ్ నిప్పల్ కన్సీలర్ బ్రా:

డ్రెస్ వేసుకున్నాక నిప్పల్స్ కనిపించకుండా ఫుల్ కవరేజ్ ఇచ్చే చక్కటి బ్రా ఇది. ఇది ప్రత్యేకమైన సందర్భాల్లో ధరించే దుస్తులకు అనువుగా ఉంటుంది. ఈ బ్రాలు సాఫ్ట్, కంఫర్టబుల్ ఫాబ్రిక్‌తో తయారు చేసినవి కనుక వీటిని వేసుకుంటే కాన్ఫిడెంట్‌గా ఉంటుంది.

Ramya Sri Marka

eMail
రమ్య శ్రీ మార్క హిందుస్థాన్ టైమ్స్‌లో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్. జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న ఆమె లైఫ్ స్టైల్, ఆస్ట్రాలజీ వార్తలు రాయడంలో ప్రత్యేకత కలిగి ఉంది. కాకాతీయ యూనివర్సిటీలో జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ పట్టా పొందారు. గతంలో ఈనాడు, టీన్యూస్, ఈటీవీ భారత్ వంటి సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు.లింక్డ్‌ఇన్‌లో ఆమెతో కనెక్ట్ అవ్వండి.

సంబంధిత కథనం