Chocolate MilkShake: వాలెంటైన్ వీక్‌లో మీ ప్రియమైన వారికి చాక్లెట్ మిల్క్ షేక్ తయారు చేసి పెట్టండి? ఈ రెసిపీ చాలా సులువు-treat your loved ones to a chocolate milkshake this valentines week this recipe is very easy ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Chocolate Milkshake: వాలెంటైన్ వీక్‌లో మీ ప్రియమైన వారికి చాక్లెట్ మిల్క్ షేక్ తయారు చేసి పెట్టండి? ఈ రెసిపీ చాలా సులువు

Chocolate MilkShake: వాలెంటైన్ వీక్‌లో మీ ప్రియమైన వారికి చాక్లెట్ మిల్క్ షేక్ తయారు చేసి పెట్టండి? ఈ రెసిపీ చాలా సులువు

Ramya Sri Marka HT Telugu
Published Feb 09, 2025 05:30 PM IST

Chocolate MilkShake: వాలెంటైన్స్ వీక్‌లో మూడవ రోజు అయిన ఫిబ్రవరి 9న చాక్లెట్ డే జరుపుకుంటున్నారు. ఈ ప్రత్యేక సందర్భంలో మీ ప్రియుడు లేదా ప్రియురాలికి మీరే స్వయంగా రెస్టారెంట్ స్టైల్ చాక్లెట్ షేక్ తయారు చేసి పెట్టండి. సులభమైన రెసిపీ ఇక్కడ ఉంది.

వాలెంటైన్ వీక్‌లో మీ ప్రియమైన వారికి చాక్లెట్ మిల్క్ షేక్ తయారు చేసి పెట్టండి?
వాలెంటైన్ వీక్‌లో మీ ప్రియమైన వారికి చాక్లెట్ మిల్క్ షేక్ తయారు చేసి పెట్టండి?

వాలెంటైన్ వీక్ సందర్భంగా ప్రేమికులు తమ ప్రేమను రకరకాలుగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఫిబ్రవరి 9న వాలెంటైన్స్ వీక్‌లో మూడవ రోజు చాక్లెట్ డే జరుపుకుంటున్నారు. ప్రేమ జంటలకు ఇది చాలా ప్రత్యేకమైన రోజు. ఈ రోజున ఒకరికొకరు చాక్లెట్లు లేదా చాక్లెట్‌తో తయారైన వస్తువులను ఇచ్చుకుంటూ ప్రేమను ప్రత్యేక శుభాకాంక్షలతో పంచుకుంటారు. మీరు కూడా ఈ రోజున మీ ప్రియమైన వారికి ప్రత్యేకంగా ఏదైనా తినిపించాలనుకుంటే వారికి రెస్టారెంట్ స్టైల్ చాక్లెట్ మిల్క్ షేక్ తయారు చేయండి. ఇది రుచిలో అద్భుతంగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ తమ తమ శైలిలో తయారు చేయడానికి ఇష్టపడతారు, కానీ మీరు ఇక్కడ ఇచ్చిన రెసిపీ ప్రకారం తయారు చేస్తే, అది రుచిలో అద్భుతంగా ఉంటుంది, అందరికీ చాలా నచ్చుతుంది.

చాక్లెట్ షేక్ తయారు చేయడానికి కావలసినవి:-

  • ఒక కప్పు వేడి నీరు
  • కోకో పౌడర్
  • అర కప్పు చక్కెర లేదా రుచికి తగ్గట్టుగా
  • రెండున్నర కప్పు పూర్తి క్రీమ్ పాలు
  • ఒక కప్పు మంచు ముక్కలు
  • చాక్లెట్ ఐస్ క్రీమ్
  • 2 నుండి 3 పెద్ద స్పూన్లు చాక్లెట్ సాస్

చాక్లెట్ మిల్క్ షేక్ ఎలా తయారు చేయాలి?

  1. చాక్లెట్ మిల్క్ షేక్ తయారు చేయడానికి ముందుగా ఒక చిన్న గిన్నెలో వేడి నీరు తీసుకోండి.
  2. అందులో కోకో పౌడర్ వేసి బాగా కలపండి. ఇప్పుడు అందులో చక్కెర వేయండి. మీ రుచికి తగ్గట్టుగా చక్కెర తగ్గించవచ్చు లేదా పెంచవచ్చు.
  3. చక్కెర, కోకో పౌడర్ వేడి నీటిలో పూర్తిగా కరిగిపోయేంత వరకూ బాగా కలపండి.
  4. ఇప్పుడు మిల్క్ షేక్ తయారు చేయడానికి కోకో సిరప్‌ను బ్లెండర్ లేదా మిక్సీలో వేయండి.
  5. దీంట్లోనే కొన్ని ఐస్ ముక్కలు, 2.5 కప్పులు పాలు వేసి మిక్సీ పట్టండి.
  6. ఇది మృదువైన కాస్త చిక్కటి సిరప్‌గా తయారైన తర్వాత దాంట్లో కొద్దిగా చాక్లెట్ సిరప్ వేసి బాగా కలపండి.
  7. అంతే టేస్టీ అండ్ హెల్తీ చాక్లెట్ మిల్క్ షేక్ రెడీ అయినట్టే.
  8. దీన్ని అందమైన గాజు గ్లాసుల్లో వేసి ఐస్ క్రీమ్‌తో అలంకరించండి.

తర్వాత మీ ప్రియమైన వారికి ప్రేమగా ఇవ్వండి. వారికి ఇది చాలా బాగా నచ్చుతుంది.

Whats_app_banner

సంబంధిత కథనం