Traveling: ట్రావెలింగ్ అంటే ఇష్టమా? ఈ దేశాలకు వెళ్తే ఖర్చు ఎక్కువైపోతుంది జాగ్రత్త
Travelling: ట్రావెలింగ్‌ను ఇష్టపడే వారి సంఖ్య ఇప్పుడు పెరుగుతోంది. ఎంతోమంది యూట్యూబ్ వల్ల కూడా ట్రావెలింగ్ బాటలో నడుస్తున్నారు. అయితే కొన్ని దేశాల్లో మాత్రం ట్రావెలింగ్ చాలా ఖర్చుతో కూడుకున్నది.
Travelling: విదేశీ పర్యటనలు చేయాలని ఎంతోమందికి ఉంటుంది. స్నేహితులు, కుటుంబ సభ్యులతో అలా జాలీగా ఫారిన్ ట్రిప్ కు వెళ్తే ఆ మజాయే వేరు. యూట్యూబ్ వల్ల కూడా కొంతమంది ట్రావెలర్లుగా మారుతున్నారు. అయితే కొన్ని దేశాల్లో ట్రావెలింగ్ చాలా ఖరీదైనది. ఆ దేశ కరెన్సీ తో మన కరెన్సీ పోల్చుకొని ట్రావెలింగ్ ప్లాన్ చేయడం ముఖ్యం. ప్రపంచంలో కొన్ని దేశాల్లోని కరెన్సీలతో పోలిస్తే మన రూపాయి వాల్యూ చాలా తక్కువ. అలాంటి దేశాలకు మీరు వెళితే ఖర్చు తడిసి మోపిడైపోతుంది. కాబట్టి విదేశీ ట్రిప్పులకు వెళ్లే ముందు ఏ దేశాల్లో ట్రావెలింగ్ ఎక్కువ ఖర్చుతో కూడుకున్నదో ముందుగా తెలుసుకొని వెళ్లడం మంచిది.
కువైట్
కువైట్ కరెన్సీ దీనార్. ఒక దీనార్ 269 రూపాయలకు సమానం. మనం ఇక్కడ రూపాయి ఖర్చు పెట్టాలంటే కువైట్ వెళ్లేసరికి అది 269 రూపాయలతో సమానంగా మారిపోతుంది. అందుకే భారతీయ సందర్శకులు కువైట్ వెళ్లాలంటే ఎక్కువ మొత్తంలో ఖర్చు పెట్టాలి. బడ్జెట్ జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి.
బహ్రెయిన్
బహ్రేయిన్ కరెన్సీ దీనార్. ఒక బహ్రెయిన్ దీనారు 220 రూపాయలతో సమానం. బహ్రెయిన్ ప్రయాణ ఖర్చులు కూడా ఎక్కువగానే ఉంటాయి. మీ బడ్జెట్ ను బట్టి బహ్రెయిన్ వెళ్లాలా వద్దా అన్నది నిర్ణయించుకోవడం మంచిది.
ఒమన్
ఒమన్ దేశంలో కరెన్సీ ఒమానీ రియల్. ఒక ఒమానీ రియల్ అంటే మన దేశంలో 215 రూపాయలతో సమానం. ఒమన్ వెళ్లే వాళ్ళు ఈ ఖర్చును అంచనా వేసుకొని డబ్బును రెడీ చేసుకోవడం మంచిది. ఒమన్ అనేది అరేబియా ద్వీపకల్ప దేశం. జాగ్రత్తగా బడ్జెట్ ప్లాన్ చేసుకోపోతే ఆ దేశంలోనే ఇరుక్కుపోయే పరిస్థితి ఉంది.
జోర్డాన్
జోర్డాన్ దేశ కరెన్సీ జోర్డానియన్ దీనార్. ఒక జోర్డానియర్ దినార్ 117 రూపాయలతో సమానం. జోర్డాన్ లో బస్సు ఎక్కాలన్నా కూడా మనదేశ కరెన్సీలో ఎక్కువ ఖర్చు పెట్టాలి. ఇక్కడ మనము పది రోజులకు ఖర్చు పెట్టేది అక్కడ ఒక రోజు బతికేందుకు కూడా సరిపోదు కాబట్టి జోర్డాన్ వెళ్లే వాళ్ళు ప్రయాణపు ఖర్చు, ఆహారపు ఖర్చు, నివాస ఖర్చు అంచనా వేసుకొని వెళ్లడం మంచిది.
యునైటెడ్ కింగ్‌డమ్
యూకేలో కరెన్సీని పౌండ్లలో చెబుతారు. ఒక పౌండు 104 రూపాయలతో సమానం. బ్రిటన్లో ఉద్యోగం చేసి సంపాదిస్తే ఆ డబ్బు మన దేశానికి వచ్చేసరికి 100 రెట్లు పెరుగుతుంది, కానీ అదే అక్కడికి వెళ్లి పర్యటన చేయాలంటే మన దేశ కరెన్సీ లో చాలా ఎక్కువగా అవుతుంది. కాబట్టి సరదాగా తిరిగి రావడానికి అయితే ఇలాంటి ఖరీదైన దేశాలను పక్కన పెట్టడమే మంచిది.
స్విట్జర్లాండ్
ఎంతోమంది ట్రావెలర్లకు స్వర్గం లాంటిది స్విట్జర్లాండ్. జీవితంలో ఒక్కసారి అయినా స్విట్జర్లాండ్ వెళ్లాలని కోరుకునే వారు ఎక్కువే. ఇక్కడ కరెన్సీ ఫ్రాంక్. ఒక ఫ్రాంక్ 94 రూపాయలతో సమానం. అంటే మనం ఇక్కడ రూపాయి ఖర్చు పెట్టాలంటే అక్కడికి వెళ్లేసరికి అది 94 రూపాయలుగా మారుతుంది. ఇక్కడ పది రూపాయల ఖర్చుపెట్టి పెరుగు ప్యాకెట్ కొంటే.. స్విట్జర్లాండ్ వెళ్లేసరికి 940 రూపాయలు పెట్టి కొనాల్సి వస్తుంది. కాబట్టి ఖర్చును జాగ్రత్తగా అంచనా తీసుకొని పర్యటనలు చేయండి.
యూరోపియన్ దేశాలు
యూరోపియన్ దేశాలను యూరో జోన్ అని కూడా పిలుస్తారు. యూరోప్ లో ఉన్న దేశాలు అన్నిట్లో కరెన్సీ యూరోల్లోనే ఉంటుంది .ఒక యూరో 89 రూపాయలతో సమానం. ఆ యూరోజోన్లో ఉన్న దేశాలను సందర్శించాలంటే అధికంగానే ఖర్చు పెట్టా.లి అక్కడ మారకపు రేటును బట్టి మనం పర్యటనలు చేయడం అవసరం. యూరోప్ దేశాల్లోస్థానికంగా ఖర్చు పెట్టేందుకు ఎక్కువ మొత్తంలో డబ్బు అవసరం పడుతుంది.
అమెరికా
ఎంతో మంది కల అమెరికాలో పర్యటించాలన్నది. ఒక యుఎస్ డాలర్ 83 రూపాయలతో సమానం. యూఎస్ తిరిగి రావాలంటే ఎక్కువ మొత్తంలో డబ్బు రెడీ చేసుకుని రావాలి. అదే ఉద్యోగానికి వెళితే మాత్రం ఆనందంగా వెళ్లొచ్చు. అక్కడ ఒక్క డాలర్ సంపాదిస్తే ఇండియా వచ్చేసరికి అది 83 రెట్లు పెరుగుతుంది. కానీ ట్రావెలింగ్ చేసే వారికి మాత్రం అమెరికా ఖరీదైన దేశం గానే చెప్పుకోవాలి.
టాపిక్