New Year 2025: న్యూ ఇయర్‌లో అదృష్టం కలిసి రావాలా.. ? అయితే ఈ స్పెషల్ వంటకాలు ట్రై చేసేయండి!
New Year 2025: కొత్త సంవత్సరం మీతో పాటు మీ కుటుంబాల్లోకి సంతోషం నింపాలని ఆశిస్తున్నారా..? హ్యాపీ న్యూ ఇయర్ అని విష్ చేసుకోవడమే కాదు. సాంప్రదాయబద్ధమైన ఈ ఐదు వంటకాలను ట్రై చేసి, కుటుంబంతో కలిసి ఎంజాయ్ చేయండి.
న్యూ ఇయర్ అనేది కొత్త ఆరంభాలతో పాటు మనస్సుకు సంతోషాన్ని, ఉత్సాహాన్ని కలిగించే రోజు. ఇటువంటి స్పెషల్ రోజును స్పెషల్ ఫుడ్ తోనే స్టార్ట్ చేయాలి కదా. ఇలాంటి మంచి రోజున ఏదో కొత్త వంటకంతో ప్రయోగం చేయడం ఎందుకు? చక్కగా మీ ఇంటిల్లిపాదికి సంతోషాలు, అదృష్టం కలిగించే వంటకాన్ని రెడీ చేసేయండి. ఈ సంవత్సరానికి మీవారందరితో కలిసి హ్యాపీగా వెల్ కమ్ చెప్పేయండి.
అదృష్టం తెచ్చిపెట్టే ఐదు వంటకాలు
1. పప్పులు:
పప్పులు అనేవి చాలా శుభప్రదమైన ఆహారం. ప్రత్యేకమైన రోజుల్లో, శుభకార్యాల్లో తప్పక పప్పుకు ప్రాధాన్యతనిస్తూ తప్పక వండుతారు. పప్పులు తినడం వల్ల సుఖసంతోషాలు వస్తాయని నమ్మకం. ఇవి మంచి అదృష్టం తెచ్చిపెట్టేవి మాత్రమే కాదు. పప్పులు ప్రోటీన్‌తో నిండి ఉండి, పోషకాలు అందిస్తాయి. వాటిని సూప్, దాల్ పరాఠా, కర్రీలు లేదా క్రిస్పీ దాల్ పకోడా లాంటి రకరకాల రూపాలలో ఉపయోగించవచ్చు.
2. అలచందలు (లోబియా):
అమెరికన్ సంప్రదాయాల ప్రకారం, బ్లాక్-అయిడ్ పీస్‌ను అదృష్టం, పోరాటాలలో విజయం తెచ్చిపెట్టేవిగా పరిగణిస్తారు. దీనిని ఉడికించిన లోబియా (పచ్చి బఠాణీ), టమోటాలు, ఉల్లిపాయలు, మసాలాలతో రిచ్ గ్రేవీగా తయారు చేస్తారు. సాధారణంగా దీనిని జీరా రైస్‌తో కలిపి వడ్డిస్తారు.
3. పాయసం (ఖీర్):
ఖీర్ అని పిలుచుకునే పాయసం భారతదేశంలో ప్రత్యేకంగా సౌత్ ఇండియాలో ప్రాచుర్యం పొందిన స్వీటు డెసర్ట్. న్యూ ఇయర్ వేడుకలకు ఇది కచ్చితంగా చేసుకునే స్వీట్. ఇది పాలు, బియ్యం, చక్కెర, డ్రైఫ్రూట్స్ (బాదం, కాజు, కిశ్మిష్)తో తయారు చేస్తారు. పాయసం న్యూ ఇయర్ రోజున మాత్రమే కాదు, దీపావళి, హోలి వంటి అనేక పండుగల సమయాల్లో, పుట్టిన రోజు వేడుకల్లోనూ తిని మంచి అదృష్టం వస్తుందని ఆశిస్తారు.
4. ద్రాక్ష:
యూరోపియన్, కొన్ని అమెరికన్ దేశాలలో, మిడ్నైట్ సమయంలో పన్నెండు ద్రాక్షలు తినడం వల్ల అదృష్టం, సుఖసంతోషం వస్తాయని నమ్ముతారు. ఈ సంప్రదాయం ప్రకారం, అక్కడి వారు 12 గంటలు మోగుతున్న సమయంలో గంటకొక ద్రాక్ష చొప్పున తీసుకుంటారు. ఇది కొత్త సంవత్సరానికి అదృష్టం సంపాదించడానికి సంకేతం.
5. పొంగల్:
పొంగల్, ఒక సౌత్ ఇండియన్ ప్రత్యేక వంటకం. బియ్యం, నెయ్యి, డ్రైఫ్రూట్స్‌తో తయారు చేస్తారు. ఇది సాధారణంగా పండుగలు, ప్రత్యేక సందర్భాలలో చేస్తారు. పొంగల్ నవ సంవత్సరానికి మధురమైన విజయాలను, ఆశీర్వాదాలను తీసుకొస్తుందని విశ్వసిస్తారు.
ఈ సంప్రదాయ ఆహారాలు కేవలం రుచికరమైనవి కాకుండా, ఆరోగ్యం, సంపద, అదృష్టానికి సంబంధించిన సాంస్కృతిక ప్రాముఖ్యత కలిగివున్నవి. మీరు ఎంచుకున్న ఆహారంతో ఈ న్యూ ఇయర్‌ను జరుపుకుని, అదృష్టంతో పాటు సుఖసంతోషాలతో 2025 ప్రారంభించేయండి.