Yoga Poses for Kids : పిల్లలను యాక్టివ్​గా ఉంచే యోగా ఆసనాలు ఇవే..-top 5 yoga poses for kids to stay warm and active in the morning specially in winter mornings ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Top 5 Yoga Poses For Kids To Stay Warm And Active In The Morning Specially In Winter Mornings

Yoga Poses for Kids : పిల్లలను యాక్టివ్​గా ఉంచే యోగా ఆసనాలు ఇవే..

Geddam Vijaya Madhuri HT Telugu
Jan 19, 2023 08:02 AM IST

Yoga Poses for Kids to Stay Active : రోజంతా ఆటలు ఆడి అలిసిపోయి.. నెక్స్ట్ డే ఉదయం లేచే సరికి పిల్లలు యాక్టివ్​గా ఉండరు. కొందరు మామూలుగానే ఎక్కువ యాక్టివ్​గా ఉండరు. అయితే వారిని తిట్టడం, కొట్టడం వంటివి కాకుండా.. ఇంట్లోనే సింపుల్​గా యాక్టివ్​గా ఉంచే టెక్నిక్​లను ఫాలో అవ్వండి. వాటిలో యోగా కచ్చితంగా ఉండాల్సిందే.

పిల్లలతో ఈ ఆసనాలు వేయించండి..
పిల్లలతో ఈ ఆసనాలు వేయించండి..

Yoga Poses for Kids to Stay Active : కొందరు పిల్లలు ఉదయాన్నే చాలా లేజీగా ఉంటారు. స్కూల్​కు వెళ్లేప్పుడూ కూడా నిద్రమత్తులోనే వెళ్తూ ఉంటారు. అయితే వారిని ఉదయాన్నే చురుకుగా, యాక్టివ్​గా మార్చే యోగాఆసనాలు ఉన్నాయని మీకు తెలుసా? ముఖ్యంగా శీతాకాలంలో పిల్లలు చురుకుగా ఉండటం కష్టం. నిద్రలేచి బయటకు రావడాన్ని చాలా కష్టంగా ఫీల్ అవుతారు. అయితే వాతావరణం ఎలా ఉన్నా.. మీ పిల్లలు ఇంట్లో చురుకుగా ఉండేలా చేయవచ్చు.

దానికోసం మీ పిల్లలను ఏదైనా మైండ్ స్పోర్ట్‌లో నిమగ్నం చేయడం, వారి పాఠ్యేతర కార్యకలాపాల్లో పాల్గొనేలా చేయడం, వాకింగ్​కు తీసుకెళ్లడం వంటివి అద్భుతమైన మార్గాలు. అంతేకాకుండా వారిని చురుకుగా ఉంచడానికి కొన్ని యోగా ఆసనాలను వేయించవచ్చు. ఇవి యాక్టివ్​గా ఉంచడమే కాకుండా.. ఆరోగ్యం, బలం, వశ్యత, స్థిరత్వం, చలనశీలతను అందిస్తుంది. అయితే పిల్లలు చురుకుగా ఉండటానికి సహాయపడే యోగా భంగిమలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

అధోముఖ శ్వానాసనం

ఇది మీ పిల్లల కోర్ని నిమగ్నం చేస్తుంది. శరీరంలోని అనేక కండరాలపై ప్రభావం చూపిస్తుంది. అదనంగా శరీరం అంతటా రక్త ప్రసరణను మెరుగుపరచి.. శక్తిని ఇస్తుంది.

ఈ ఆసనం వేయడం కోసం.. మీ మోకాలు, అరచేతులపై శరీర బరువును ఉంచండి. మోకాళ్లను తుంటి కింద, అరచేతులను భుజాల కింద ఉంచుతూ.. కాళ్లను విలోమ "V" స్థానంలో ఉంచతూ.. మీ చేతులు భుజం-వెడల్పు వేరుగా ఉండేలా పైకి లేవండి. మడమలను మాత్రం నేలకు సమాంతరంగానే ఉండేలా చూసుకోండి. ఈ ఆసనంలో కొన్ని సెకన్లు ఉండొచ్చు.

బాలసనా

ఇది పిల్లల్లో, పెద్దల్లో మెడ, వీపు, భుజాల నుంచి ఒత్తిడిని తగ్గించడానికి సరైన భంగిమ. శరీరాన్ని విశ్రాంతి తీసుకోవడానికి, నిద్ర చక్రం పెంచడానికి సహాయపడుతుంది.

ఈ ఆసనం చేయడం కోసం.. మోకాళ్లపై ఉంటూ మీ మడమల మీద కూర్చోండి. ఊపిరి పీల్చుకుంటూ.. మీ ఎగువ శరీరాన్ని ముందుకు వంచండి. మీ నుదిటిని నేలకు తాగించి.. మీ పిరదులు మడమల మీద విశ్రాంతి తీసుకునేలా ప్లేస్ చేయండి. ఈ ఆసనంలో నిముషం నుంచి 2 నిముషాలు కూడా ఉండొచ్చు.

పాదహస్తాసనం

మీరు ముందుకు వంగినప్పుడు మీ వెన్నెముక, హామ్ స్ట్రింగ్స్, వెనుక కండరాలతో సహా మీ ఎగువ శరీరం సమర్ధవంతంగా సాగుతుంది. ఇది మీ ఒత్తిడి స్థాయిని తగ్గిస్తుంది.

మీరు నిల్చొని ఊపిరి పీల్చుకున్నప్పుడు మీ పైభాగాన్ని ముందుకు వంచండి. మీ భుజాలు, మెడను రిలాక్స్‌గా ఉంచండి. మీరు మొదటిసారి ఈ భంగిమ చేస్తున్నట్లయితే మీ మోకాళ్లను కొద్దిగా వంచండి. తలను మోకాళ్లకు ఆన్చుతూ మీ పాదాల పక్కన మీ అరచేతులను ఉంచండి.

పశ్చిమోత్తనాసనం

కూర్చున్న ఫార్వర్డ్ బెండ్‌ల ప్రయోజనాలు శారీరక, మానసిక ప్రశాంతతను మెరుగుపరుస్తాయి. అదనంగా ఇది కండరాల వశ్యత, కదలికను పెంచుతుంది.

ఈ ఆసనం వేయడం కోసం.. నేలపై కూర్చుని రెండు కాళ్లను ముందుకు చాచండి. మీరు ముందుకు వంగి.. రెండు చేతులతో మీ బొటనవేళ్లను పట్టుకుని ఊపిరి పీల్చుకోండి.

వృక్షాసనం

ఈ యోగ భంగిమ స్థిరత్వం, సమతుల్యతను మెరుగుపరుస్తుంది. ఇది మీ కోర్ని బలపరుస్తుంది. అంతేకాకుండా కండరాలను రిలాక్స్ చేస్తుంది.

సమస్థితిలో దీనిని ప్రారంభించండి. మీ పాదాలను ఒకదానితో ఒకటి దగ్గరగా ఉంచి ఎత్తుగా నిలబడండి. మీ కుడి కాలును మీ ఎడమ కాలుకు లంబంగా ఉండేలా మడిచి.. శ్వాస తీసుకోండి. అనంతరం మీ అరచేతులతో మీ ఛాతీ ముందు నమస్కార ముద్ర వేయండి. మొత్తం కదలికలో.. మీ వెన్నెముక నిటారుగా ఉండేలా చూసుకోండి.

ఈ యోగా భంగిమలతో పాటు.. మీ పిల్లలతో ధ్యానం చేయించండి. ఫలితంగా వారు ప్రశాంతంగా, ఒత్తిడి లేకుండా యాక్టివ్​గా ఉంటారు.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్