Dragon Fruit Benefits : డ్రాగన్ ఫ్రూట్‍తో 10 ప్రయోజనాలు.. తప్పకుండా తెలుసుకోవాలి
Dragon Fruit Benefits : డ్రాగన్ ఫ్రూట్ ధర ఖరీదైనదిగా అనిపించినా ఆరోగ్యానికి చాలా మంచిది. కొందరికి దీని రుచి నచ్చుతుంది.. మరికొందరికి నచ్చదు. కానీ ఇందులో అద్భుతమైన గుణాలు ఉన్నాయి. మీకు ఇష్టం లేకపోయినా తినండి. డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో చూద్దాం.
ఒకప్పుడు ఇటు వైపు డ్రాగన్ ఫ్రూట్ అంటే పెద్దగా తెలియదు. రానురాను ఇక్కడి రైతులు కూడా దీనిని సాగు చేయడం మెుదలుపెట్టారు. తెలుగు రాష్ట్రాల్లో చాలామంది.. డ్రాగన్ ఫ్రూట్ పండిస్తున్నారు. అయితే దీనితో చాలా లాభాలు ఉన్నాయి. డ్రాగన్ ఫ్రూట్‍లో మంచి పోషకాలు ఉన్నాయి. ప్రోటీన్, కేలరీలు, ఐరన్ కంటెంట్, విటమిన్ సి, విటమిన్ ఇ, మెగ్నీషియం, కాల్షియం ఇందులో ఉంటాయి.
డ్రాగన్ ఫ్రూట్ మధుమేహ వ్యాధిగ్రస్తులకు చాలా మేలు చేస్తాయి. ఇందులో ఫైబర్ ఉండటం వల్ల మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఎంతో మేలు చేస్తుంది, షుగర్ వ్యాధిగ్రస్తులు తింటే షుగర్ లెవెల్ పెరగదు. రోజూ తింటే చాలా మంచిది.
ఇది పెద్దపేగు క్యాన్సర్‌ను నివారించడంలో సహాయపడుతుంది. ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. పార్కిన్సన్స్, క్యాన్సర్, అల్జీమర్స్ వంటి వ్యాధులను నివారించడంలో ఇది ఉపయోగపడుతుంది.
డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల జీర్ణక్రియకు చాలా మంచిది. దీనిలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. గుండె ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. బరువు అదుపులో ఉంటుంది.
ఒమేగా 3 ఫ్యాట్‌లను కలిగి ఉంటుంది. ఒమేగా 3 కొవ్వులు చేపలలో ఉంటాయి, చేపలు తినని వారు ఈ పండు తినడం ద్వారా ఒమేగా 3 కొవ్వులను పొందవచ్చు. ఒమేగా 3 కొవ్వులు గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. దీన్ని రోజూ తీసుకోవడం వల్ల గుండె జబ్బులు తగ్గుతాయి.
చర్మ సౌందర్యాన్ని పెంచుతుంది డ్రాగన్ ఫ్రూట్. ఇందులోని విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇది చర్మ ఆరోగ్యాన్ని పెంచుతుంది. ఇందులో ఉండే విటమిన్ సి ముఖ కాంతిని పెంచుతుంది. చర్మ సౌందర్యానికి రోజూ డ్రాగన్ ఫ్రూట్ జ్యూస్ తాగితే మంచిది.
జుట్టు ఆరోగ్యానికి బాహ్య సంరక్షణ మాత్రమే కాకుండా అంతర్గత సంరక్షణ కూడా అవసరం. అందుకు పౌష్టికాహారం తీసుకోవాలి. జుట్టు ఆరోగ్యానికి కూడా డ్రాగన్ ఫ్రూట్ చాలా మంచిది.
ఎముకల ఆరోగ్యానికి డ్రాగన్ ఫ్రూట్ మంచిది. 18 శాతం మెగ్నీషియం ఎముకల ఆరోగ్యానికి చాలా మంచిది. కీళ్లనొప్పులతో బాధపడేవారు ఈ పండును రోజూ తీసుకోవడం మంచిది.
కంటి ఆరోగ్యానికి కూడా ఈ పండు చాలా ప్రయోజనాలు చేస్తుంది. ఈ పండులో బీటా కెరోటిన్ ఉంటుంది. ఇది కంటి రెటీనా ఆరోగ్యానికి మంచిది.
ఈ పండులో విటమిన్ బి, ఫోలేట్, ఐరన్ ఉంటాయి. గర్భిణీలు ఈ పండును తినడం మంచిది. ఈ పండు తినడం తల్లి, బిడ్డ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులోని మెగ్నీషియం ప్రసవానంతర డిప్రెషన్‌ను నివారించడంలో కూడా సహాయపడుతుంది.