Reduce Oil tips: కూరల్లో పొరపాటున ఎక్కువ నూనె పడిందా? ఈ చిట్కాలతో తగ్గించేయండి-too much oil in the curries reduce oil with these tips ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Reduce Oil Tips: కూరల్లో పొరపాటున ఎక్కువ నూనె పడిందా? ఈ చిట్కాలతో తగ్గించేయండి

Reduce Oil tips: కూరల్లో పొరపాటున ఎక్కువ నూనె పడిందా? ఈ చిట్కాలతో తగ్గించేయండి

Haritha Chappa HT Telugu
Nov 02, 2024 10:30 AM IST

Reduce Oil tips: ఆహారంలో ఎక్కువ నూనె ఉంటే దాని రుచి మొత్తం చెడిపోతుంది. కూరల్లో, పులుసుల్లో ఎక్కువ నూనె పడితే ఈ ఆ నూనెను చిన్న చిట్కాల ద్వారా తగ్గించుకోవచ్చు. ఎలాంటి చిట్కాలను పాటించడం ద్వారా నూనెను తగ్గించుకోవచ్చు.

కూరల్లో నూనెను తగ్గించడం ఎలా?
కూరల్లో నూనెను తగ్గించడం ఎలా?

కూరలు వండేటప్పుడు ఒక్కోసారి తెలియకుండా నూనె ఎక్కువైపోతుంది. కూరల్లో ఉప్పూ, కారమే కాదు నూనె ఎక్కువైనా కూడా కూడా తినలేము. చాలా సార్లు గ్రేవీలో నూనె ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల గ్రేవీ టెస్ట్ చెడిపోతుంది. గ్రేవీలో ఆయిల్ ఎక్కువగా పడితే దాన్ని తినడం కూడా ఆరోగ్యకరం కాదు, అలాగని ఆ కూరను పడేయలేము కూడా. అందుకే ఇక్కడ మేము కొన్ని చిట్కాలు ఇచ్చాము. ఈ చిట్కాలు పాటిస్తే త్వరగా నూనెను తగ్గించవచ్చు. పులుసు, గ్రేవీల నుంచి నూనెను ఎలా తగ్గించాలో తెలుసుకోండి.

అదనపు నూనెను తగ్గించండి

1) గ్రేవీ నుండి అదనపు నూనెను తొలగించడానికి మీరు పెద్ద సైజు ఐస్ క్యూబ్ ఉపయోగించవచ్చు. ఇందుకోసం గ్రేవీలో ఐస్ క్యూబ్స్ ను కాసేపు వేయండి. ఈ సమయంలో నూనె మొత్తం దానికి అంటుకుంటుంది, దాన్ని బయటికి తీసేస్తే నూనె కూడా బయటికి వచ్చేస్తుంది. తద్వారా మీరు గ్రేవీ నుండి నూనెను సులభంగా తొలగించవచ్చు.

2) చలిలో కొవ్వు గడ్డకడుతుంది. అటువంటి పరిస్థితిలో, గ్రేవీలో ఎక్కువ నూనె ఉంటే, దానిని తొలగించడానికి గ్రేవీని కాసేపు ఫ్రిజ్లో ఉంచండి. నూనెలో కొవ్వు ఉంటుంది కాబట్టి, అది గట్టిపడుతుంది, మీరు సులభంగా దాన్ని స్పూనుతో తొలగించవచ్చు.

3) పేపర్ టవల్ లేదా టిష్యూ పేపర్ ఏదైనా నూనెను గ్రహించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. గ్రేవీ నుండి అదనపు నూనెను తొలగించడానికి, నూనె పూర్తిగా ఉపరితలంపై ఉన్నప్పుడు టిష్యూ పేపర్ను ఆ కూరపై అలా సున్నితంగా పెట్టండి. ఇలా చేయడం వల్ల టిష్యూ పేపర్ కొంత నూనెను గ్రహిస్తుంది. అప్పుడు దాన్ని తొలగించండి. ఇలా రెండు మూడు టిష్యూ పేపర్లతో చేయండి. అదనపు నూనె దాదాపు తగ్గిపోతుంది.

4) రొట్టెలో కూడా టిష్యూ పేపర్ లాగా నూనెను గ్రహించే గుణం ఉంటుంది. ఇందుకోసం బ్రెడ్ ను పెద్ద ముక్కలుగా కట్ చేసి గ్రేవీలో వేయాలి. కాసేపటి తర్వాత బ్రెడ్ నూనెను గ్రహిస్తుంది. దాన్ని చెంచా సాయంతో గ్రేవీ నుంచి బ్రెడ్ ముక్కలను తీసేయాలి.

5) గ్రేవీలో నూనె ఎక్కువగా ఉంటే దాన్ని తగ్గించుకోవడానికి ఉడికించిన బంగాళాదుంపలను వాడవచ్చు. ఇందుకోసం బంగాళాదుంపలను ఉడకబెట్టి, తొక్కతీసి గ్రేవీలో వేసి 5 నిమిషాలు మూతపెట్టి ఉడికించాలి. ఇలా చేయడం వల్ల బంగాళాదుంపలు నూనె మొత్తాన్ని గ్రహిస్తాయి.

ఇలా చిన్న చిన్న చిట్కాల ద్వారా కూరలో ఉన్న నూనెను తగ్గించుకోవచ్చు. ఎందుకంటే ఎక్కువ నూనెను తినడం వల్ల ఆరోగ్యానికి కూడా కీడు జరుగుతుంది. కాబట్టి నూనె తొలగించి తినడమే చాలా ముఖ్యం. నూనెను అధికంగా తినడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోయి అనేక ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది.

Whats_app_banner