Bike Riding Side Effects : అతిగా బైక్ నడిపితే డ్యామేజ్ అయ్యేది బండి కాదు.. మీ బాడీ
Bike Riding Side Effects In Telugu : కొందరికి బైక్ నడపడం అంటే ఎక్కువగా ఇష్టం. కానీ ఎక్కువ రోజు బైక్ అతిగా నడిపితే మాత్రం మీ శరీరం దెబ్బతింటుంది. అనేక సమస్యలు మిమ్మల్ని చుట్టుముడతాయి.
బైక్‌పై లాంగ్ డ్రైవ్‌కు వెళ్లడం ప్రస్తుత ట్రెండ్. చాలా మంది అబ్బాయిలకు ఈ క్రేజ్ ఉంటుంది. వీకెండ్ వస్తే చాలు గర్ల్ ఫ్రెండ్‌ను తీసుకుని లాంగ్ డ్రైవ్ వెళ్లాలని చాలా మంది అబ్బాయిలు ప్లాన్స్ వేసుకుంటారు. ఊరికి వెళ్లాలి అన్నా.. ఎంత దూరం నుంచైనా బైక్ తీసుకుని వెళ్తారు. అలా వెళ్లడం ఓ కిక్కుగా భావిస్తారు. కానీ దీనితో అనేక సమస్యలు ఉన్నాయని గుర్తించాలి. ఎక్కువ దూరం బైక్‌పై వెళ్లడం అంత తేలికైన పని కాదు. ఇది చాలా అలసట కలిగిస్తుంది. ఎక్కువ గంటలు మోటార్ బైక్ నడపడం వల్ల ఎముకల సమస్యలు వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంది. ఇది ఆర్థరైటిస్ ప్రమాదాన్ని పెంచుతుంది. అందుకే జాగ్రత్తగా ఉండాలి.
ఎక్కువ దూరం బైక్‌పై వెళ్లడం వల్ల శరీరంపై ఒత్తిడి పెరిగి సమస్యలు వస్తాయి. ఇది ఎముక పగుళ్లు, ఆర్థరైటిస్, గాయం ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. మీరు ఈ ప్రమాదాలను నివారించాలనుకుంటే వైద్యుని సలహాను అనుసరించండి. సుదీర్ఘంగా బైక్ రైడ్ ద్వారా శరీరంలోని 3 భాగాలు బలహీనపడతాయి. ఇవి రానురాను మీకు అనేక శరీర సమస్యలను కలిగిస్తాయి.
లాంగ్ డ్రైవ్ చేస్తే మజా వస్తుంది. కానీ మీ శరీరంలోని భాగాలు మాత్రం వద్దు బాబు అంటాయి. అతిగా బైక్ నడిపితే తొడ, కాలు, తుంటి కండరాలు బలహీనపడతాయి. దీనివల్ల మీ ఆరోగ్యం కూడా బాగుంటుంది.
ఎక్కువగా బైక్ నడిపితే.. ఒత్తిడి కలుగుతుంది. మోకాలి, వెన్నునొప్పి ప్రమాదాన్ని పెంచుతుంది. ఎందుకంటే బైక్ నడుపుతున్నప్పుడు పదే పదే బ్రేకులు వేయడం, ఒక్కోసారి సడన్ గా కాలు నేలపై పెట్టడం వంటివి చేయాల్సి వస్తుంది. దీని కారణంగా కాలులో ఒత్తిడి తరచుగా కనిపిస్తుంది.
బైక్ నడుపుతున్నప్పుడు మంచి ప్యాడింగ్ ధరించండి. మోకాలు, మోచేయి, తుంటికి సపోర్ట్ గార్డ్స్ ధరించాలి. ఇది ఆర్థరైటిస్, గాయం సంభావ్యతను నివారిస్తుంది.
దూర ప్రయాణాలలో విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యం. ఇది మీ కండరాలను రిలాక్స్ చేస్తుంది. అలసటను తగ్గిస్తుంది. తరచుగా లాంగ్ డ్రైవ్‌లను నివారించండి.
బైక్‌ను సురక్షితంగా నడపడానికి మీరు కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. అంటే నిత్యం హెల్మెట్ ధరించి ట్రాఫిక్ రూల్స్ పాటించాలి. ఇది ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
మద్యం సేవించి వాహనం నడపవద్దు. ఇది మీ జీవితాన్ని, ఇతరులను ప్రమాదంలో పడేస్తుంది. మీరు పూర్తిగా స్పృహతో, ఆరోగ్యంగా ఉన్నప్పుడు మాత్రమే రైడ్ చేయండి. లేదంటే డ్రైవ్ చేయవద్దు, మరొకరి ప్రాణాన్ని లేదా మీ స్వంత జీవితాన్ని బలి చేసుకోవద్దు.
చాలా మంది బైక్ డ్రైవ్ చేస్తూ నడుం సంబంధిత సమస్యలు వచ్చినవారు ఉన్నారు. ఎక్కువగా బైక్ నడిపితే ఇలాంటి సమస్యలు వస్తాయి. వెన్నెముక మీద ప్రభావం పడుతుంది. తక్కువ వయసులోనే మీరు వెన్ను నొప్పిని ఎదుర్కోవలసి వస్తుంది. ఒక్కసారి వెన్ను సమస్యలు వస్తే వాటిని తగ్గించుకునేందుకు మీరు చాలా ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది. బైక్ ఎక్కువగా నడిపితే రకరకాల సమస్యలు ఎదుర్కొంటారు. అందుకే తగ్గించాలి. చేతులు, కాళ్లు, వెన్నెముకకు ఇబ్బందులు ఎదురవుతాయి.