Masala Pulao Recipe : నిమిషాల్లో మసాలా పలావ్ చేయండి.. బిర్యానీ టేస్ట్‌లా అదిరిపోతుంది-today recipe how to prepare masala pulao step by step method ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Masala Pulao Recipe : నిమిషాల్లో మసాలా పలావ్ చేయండి.. బిర్యానీ టేస్ట్‌లా అదిరిపోతుంది

Masala Pulao Recipe : నిమిషాల్లో మసాలా పలావ్ చేయండి.. బిర్యానీ టేస్ట్‌లా అదిరిపోతుంది

Anand Sai HT Telugu
Jun 18, 2024 11:00 AM IST

Masala Pulao Recipe In Telugu : పలావ్ చాలా రకాలుగా చేసుకోవచ్చు. ఇది తింటే మళ్లీ మళ్లీ తినాలి అనిపిస్తుంది. అయితే మీరు ఎప్పుడైనా మసాలా పలావ్ ట్రై చేశారా? ఈ రెసిపీ తయారీ విధానం తెలుసుకోండి..

మసాలా పలావ్
మసాలా పలావ్

పలావ్ చాలా ఇళ్లలో ప్రత్యేక వంటకంగా చేస్తారు. ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు ఇలాంటివి ట్రై చేస్తారు. పలావ్ రుచి చాలా అద్భుతంగా ఉంటుంది. దీన్ని తయారు చేయడం చాలా సులభం. పలావ్‌లో చాలా రకాల కూరగాయలు వేస్తారు. ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిది. పలావ్ తయారీలో అనేక విధానాలు ఉన్నాయి.

పలావ్ బిర్యానీ స్టైల్‌లో కూడా తయారుచేసుకోవచ్చు. కొన్ని హోటళ్లు ఈ పలావ్ వంటకానికి ప్రసిద్ధి. మరికొందరు ఈ పలావ్ రుచి కోసం ప్రత్యేకమైన హోటళ్లకు కూడా వెళ్తారు. ఈ పలావ్ ఉదయం అల్పహారంగా, మధ్యాహ్నం భోజనంలోకి కూడా బాగుంటుంది. అయితే ఎప్పుడూ ఒకే రకమైన పలావ్ చేస్తే అందరికీ బోర్ కొడుతుంది. టేస్ట్‌లో కాస్త మార్పు చేసినా రుచిగా ఉంటుంది. అందుకే కొత్తగా మసాలా పలావ్ తయారుచేయండి.

అందుకే అందరూ ఇష్టపడే మసాలా పలావ్ ఎలా చేయాలో తెలుసుకుందాం. ఈ మసాలా పలావ్ చేయడానికి ఏం కావాలి? పద్ధతి ఏమిటి? దీన్ని ఎలా చేయాలో చూద్దాం..

మసాల్ పలావ్ కావాల్సిన పదార్థాలు

బియ్యం - 1 గిన్నె, ఉల్లిపాయ - 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టేబుల్ స్పూన్లు, పచ్చిమిర్చి - 4, పచ్చి బఠానీలు - 1/4 కప్పు, క్యారెట్ - 1, క్యాప్సికమ్ - 1/4 కప్పు, క్యాబేజీ - 1/2 కప్పు, కాలీఫ్లవర్ - 1/2 కప్పు, బీన్స్ - 1/4 కప్పు, పసుపు పొడి - 1/4 tsp, గరం మసాలా పొడి - 1/2 tsp, ఎర్ర కారం - 1/2 tbs, ధనియాల పొడి - 1 tbs, కసూరి మేతి - 1 tbs, టమోటా - 1, పుదీనా ఆకులు - 1/2 కప్పు, కొత్తిమీర ఆకులు - 1/2, వంట నూనె, ఉప్పు

మసాలా పలావ్ తయారీ విధానం

ముందుగా స్టౌ మీద పాత్ర పెట్టి నూనె వేయాలి. ఈ నూనెలో సన్నగా తరిగిన ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, బఠానీలు, క్యారెట్, క్యాబేజీ, క్యాలీఫ్లవర్, క్యాప్సికమ్, బీన్స్ వేసి ఒక నిమిషం పాటు బాగా వేయించాలి.

వేయించేటప్పుడు అందులో టమోటో, ఉప్పు వేసుకోవాలి. 1 నిమిషం వేగిన తర్వాత పసుపు పొడి, గరం మసాలా, కారం పొడి, ధనియాల పొడి, కసూరి మేతి వేసి పలావ్ మసాలా ఉంటే వేయాలి. ఇవన్నీ వేసి బాగా కలపాలి. 5 నిమిషాలు బాగా ఉడికించాలి.

తర్వాత ఈ మసాలాలో ముందుగా సిద్ధం చేసుకున్న అన్నాన్ని కలపండి. చివరగా దీనికి కొత్తిమీర తరుగు, పుదీనా వేసి కలపాలి. 5 నిమిషాలు తక్కువ మంటలో పెట్టుకోవాలి. అంతే మసాలా పలావ్ రెడీ అయినట్టే..

WhatsApp channel