Fish Egg Fry Recipe : ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ తినాలనిపించే చేపల శన వేపుడు.. తయారీ ఇలా-today recipe how to prepare fish egg fry step by step process ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Today Recipe How To Prepare Fish Egg Fry Step By Step Process

Fish Egg Fry Recipe : ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ తినాలనిపించే చేపల శన వేపుడు.. తయారీ ఇలా

Anand Sai HT Telugu
Feb 05, 2024 11:00 AM IST

Fish Egg Fry Recipe In Telugu : చేపల శన ఎప్పుడైనా తిన్నారా? అదే చేపల గుడ్లు. వీటిని ఫ్రై చేసుకుని తింటే టేస్ట్ మామూలుగా ఉండదు.

చేపల గుడ్ల ఫ్రై
చేపల గుడ్ల ఫ్రై (Unsplash)

చేపలు ఆరోగ్యానికి ఎంతో మంచివో తెలిసిందే. వాటిని తింటే శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. కొంతమంది చేపలు తెచ్చుకున్నప్పుడు వాటిలో గుడ్లు కూడా ఉంటాయి. వీటిని కొందరు పడేస్తే మరికొందరు ఫ్రై చేసుకుని తింటారు. శన అని చెబితే చాలా మందికి తెలుస్తుంది. దీనిని రెసిపీగా తయారు చేసుకుని తింటే రుచి సూపర్‌గా ఉంటుంది. చేయడం కూడా చాలా ఈజీ. చేపల శనను చాలా రకాలుగా తయారు చేసుకోవచ్చు. ఫ్రై చేసుకుంటే ఈ రెసిపీ చాలా బాగుంటుంది. అన్నంలో సైడ్ డిష్‌లాగా పెట్టుకోవచ్చు.

చేపల శన వేపుడుకు కావాల్సిన పదార్థాలు

చేప గుడ్లు

పసుపు పొడి 1 చెంచా

ఉప్పు కావాల్సినంత

నిమ్మరసం కొద్దిగా

ఉల్లిపాయలు, అల్లం, వెల్లుల్లి 2 టేబుల్ స్పూన్లు

పచ్చిమిర్చి 3

1 టేబుల్ స్పూన్ మిరప పొడి

1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి

1/2 టేబుల్ స్పూన్ పసుపు

2 పండిన టొమాటోలు

కరివేపాకు కొన్ని

చేపల శన వేపుడు తయారీ విధానం

చేపల గుడ్లను మెత్తగా కడిగి ఒక ప్లేట్‌లో వేసి అందులో కాస్త పసుపు, రుచికి సరిపడా ఉప్పు, చెంచా నిమ్మరసం వేసి 15-10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి.

తర్వాత బాణలిలో నూనె వేసి, నూనె వేడి కాగానే పసుపు, ఉప్పు కలిపిన చేప గుడ్లు వేయాలి.

2-3 నిమిషాలు వేయించాలి. గుడ్డు పగలకుండా ఉండేందుకు మెల్లగా కదపాలి.

తర్వాత ఇంకో బాణలిలో నూనె వేసి వేడయ్యాక అందులో చిన్న ముక్కలుగా తరిగిన రెండు ఉల్లిపాయలు వేసి బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేయించాలి.

తర్వాత అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి వేసి 5 నిమిషాలు వేయించాలి. కరివేపాకు వేసి, అర చెంచా పసుపు, కారపు పొడి, 1 చెంచా ధనియాల పొడి, కొంచెం గరం మసాలా వేసి వేయించుకోవాలి. కట్ చేసుకున్న టొమాటో వేసి కలుపుకోవాలి.

చివరగా వేయించిన గుడ్డు వేసి కాసేపు వేగించాలి. అంతే ఫిష్ ఎగ్ ఫ్రై రెడీ. తర్వాత కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేస్తే ఫిష్ ఎగ్ ఫ్రై లాగించేయెుచ్చు.

చేప గుడ్ల ప్రయోజనాలు

ఇందులో ఒమేగా 3, విటమిన్ డి, బి12, ప్రొటీన్లు ఉండటం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది.

చేప గుడ్లలో ప్రొటీన్లు ఎక్కువగా ఉంటాయి.

చేపల శనలో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎక్కువగా తినకూడదు.

ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నందున, రక్తం గడ్డకట్టడాన్ని నివారిస్తుంది. వాపును తగ్గిస్తుంది, రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది.

ఈ చేప గుడ్లు బరువును పెంచదు.

WhatsApp channel