Egg Pepper Kurma : ఎగ్ పెప్పర్ కుర్మా.. అబ్బా తింటే అదిరిపోతుంది
Egg Pepper Kurma Recipe In Telugu : తరచుగా మీ ఇంట్లో గుడ్లు వండుతున్నారా? ఎప్పుడూ గుడ్లు ఒకే విధంగా వండుకుని తింటే బోర్ కొడుతుంది కదా. ఈరోజు కాస్త భిన్నమైన రుచిలో ఎగ్ పెప్పర్ కుర్మా చేయండి.
చపాతీ, అన్నం, ఇడ్లీ, దోసె మొదలైన వాటితో చక్కగా తినేందుకు ఎగ్ పెప్పర్ కుర్మాను తయారు చేయండి. ఇది తయారు చేయడం చాలా ఈజీ. ఈ ఎగ్ పెప్పర్ కుర్మా ఎలా చేయాలో తెలుసుకోవాలనుకుంటున్నారా? కింది విధంగా ఫాలో అయితే చాలా సులభంగా చేసేయెుచ్చు.
ట్రెండింగ్ వార్తలు
కావాల్సిన పదార్థాలు
ఉడికించిన గుడ్లు - 5, ఆలివ్ ఆయిల్ - 2 టేబుల్ స్పూన్లు, మిరియాలు - 1 1/2 టేబుల్ స్పూన్, దాల్చిన చెక్క- 1 అంగుళం, ధనియాలు - 1 టేబుల్ స్పూన్, కరివేపాకు - కొద్దిగా , ఉల్లిపాయలు - 2 కప్పులు (సన్నగా తరిగినవి), టొమాటో - 1 కప్పు (సన్నగా తరిగినవి), ఉప్పు - 1 tsp, చింతపండు కొంచెం, గసగసాలు - 1 టేబుల్ స్పూన్, తురిమిన కొబ్బరి - 1/2 కప్పు, నెయ్యి - 1 tsp, పసుపు పొడి - 1/2 tsp,
ఎలా చేయాలంటే
ముందుగా మసాలా సిద్ధం చేసుకోవాలి. పొయ్యి మీద కడాయి పెట్టి అందులో నెయ్యి పోసి వేడయ్యాక అందులో మిరియాలు, దాల్చిన చెక్క, కొత్తిమీర, కరివేపాకు వేసి వేయించాలి. తర్వాత ఉల్లిపాయ వేసి రంగు మారే వరకు వేయించాలి.
ఆ తర్వాత టొమాటోలు వేసి కొంచెం ఉప్పు చల్లి చింతపండు రసం వేసి మీడియం మంట మీద ఉంచి మెత్తబడేవరకు వేయించాలి.
తర్వాత గసగసాలు, కొబ్బరి తురుము వేసి కొన్ని నిమిషాలు వేయించి చల్లార్చి మిక్సీ జార్ లో వేసి కొన్ని నీళ్లు పోసి మెత్తగా రుబ్బుకోవాలి.
ఇప్పుడు మరో కడాయి పెట్టి అందులో నూనె పోసి వేడయ్యాక మసాలా కోసం కరివేపాకు, ఉల్లిపాయలు వేసి మెత్తగా వేయించాలి. తర్వాత పసుపు వేసి కొన్ని సెకన్ల పాటు వేయించి, రుబ్బిన మసాలా వేసి, కావలసినంత నీరు వేసి కలపాలి. రుచికి ఉప్పు వేసి కొన్ని నిమిషాలు బాగా మరిగించాలి.
అదే సమయంలో మరో ఓవెన్‌లో ఫ్రైయింగ్ పాన్ పెట్టి అందులో కాస్త నూనె పోసి వేడయ్యాక ఉడకబెట్టిన కోడిగుడ్లను తీసుకుని అందులో పైపైన ఫ్రై చేసుకోవాలి.
ఆ తర్వాత వేయించిన కోడిగుడ్లను ఉడుకుతున్న కుర్మాలో వేసి 2-3 నిమిషాలు ఉడకబెట్టితే రుచికరమైన ఎగ్ పెప్పర్ కుర్మా రెడీ.