Kuska Biryani : లంచ్‌లోకి కుష్కా బిర్యానీ.. ఇలా సింపుల్‌గా చేసేయండి.!-today recipe how to make white kuska biryani in telugu ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Kuska Biryani : లంచ్‌లోకి కుష్కా బిర్యానీ.. ఇలా సింపుల్‌గా చేసేయండి.!

Kuska Biryani : లంచ్‌లోకి కుష్కా బిర్యానీ.. ఇలా సింపుల్‌గా చేసేయండి.!

Anand Sai HT Telugu

Kuska Biryani Recipe : బిర్యానీ ఒకేలా తిని తిని బోర్ కోడుతుందా? అయితే కొత్తగా కుష్కా బిర్యానీ ప్రయత్నించండి. టేస్టీగా ఉంటుంది. ఎలా చేయాలో తెలుసుకుందాం..

ప్రతికాత్మక చిత్రం

బిర్యానీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. బిర్యానీ పేరు వింటేనే చాలామంది నోళ్లలో నీళ్లు వస్తాయి. నాన్‌వెజ్ బిర్యానీ అంటే చాలా ఇష్టం. కానీ వెజ్‌ ప్రియులకు కూడా చికెన్‌, మటన్‌ స్టైల్లో టేస్టీగా చేసే బిర్యానీలు చాలా ఉన్నాయి. ప్లెయిన్ కుష్కా బిర్యానీ గురించి మీరు విన్నారా..? దీని ముందు నాన్‌ వెజ్‌ బిర్యానీ కూడా తక్కువే.. అంత బాగుంటుంది. దీన్ని చేసుకోవడం కూడా తేలికే. కుష్కా బిర్యానీ ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

వైట్ కుష్కా కోసం కావలసినవి :

బియ్యం - 300 గ్రాములు

ఉల్లిపాయ - 2

టొమాటో-1

పచ్చిమిర్చి - 4

అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టేబుల్ స్పూన్

జీడిపప్పు -10

దాల్చిన చెక్క - 2

పులావ్ ఆకు -1

ఏలకులు-2

పుదీనా - 1 పిడికెడు

లవంగాలు - 2

సోంపు - 1/2 tsp

పెరుగు - 2 టేబుల్ స్పూన్లు

కొత్తిమీర - ఒక గుత్తి

ఉప్పు, నూనె - కావలసినంత

నెయ్యి - 1 టేబుల్ స్పూన్

కుష్కా ఎలా తయారు చేయాలి:

కుష్కా చేయడానికి ముందుగా టొమాటో, పచ్చిమిర్చి, ఉల్లిపాయలను శుభ్రం చేసి విడిగా కట్ చేసుకోవాలి. తర్వాత పుదీనా ఆకులను విడిగా కోయాలి.

తర్వాత బియ్యాన్ని నీళ్లలో బాగా కడిగి, వడకట్టి నీళ్లతో ఒక పాత్రలో నానబెట్టాలి. ఇప్పుడు కుక్కర్‌ని స్టవ్‌ మీద పెట్టి నూనె వేసి వేడి చేయండి. నూనె వేడయ్యాక తరిగిన ఉల్లిపాయ, లవంగాలు, దాల్చిన చెక్క, పులావ్ ఆకు, యాలకులు వేయాలి. తర్వాత తరిగిన టొమాటోలు, పుదీనా, అల్లం-వెల్లుల్లి పేస్ట్, లవంగాలు, సోంపు మరియు పెరుగు వేసి 3-4 నిమిషాలు వేయించాలి. తర్వాత అందులో తగినన్ని నీళ్లు పోసి బాగా మరిగించాలి.

నీళ్లు బాగా మరుగుతున్న సమయంలో నానబెట్టిన బియ్యాన్ని బాగా వడకట్టి అందులో కలపాలి. తర్వాత సరిచూసుకుని కుక్కర్ మూసేసి అన్నం 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. ఇంతలో బాణలిలో సరిపడా నెయ్యి వేసి జీడిపప్పు వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి. చివరగా కుక్కర్‌లో కుష్కా కలపాలి. దానిపై కొత్తిమీర తరుగు చల్లితే రుచికరమైన హాట్ వైట్ కుష్కా రెడీ.