Mushroom Gravy : మష్రూమ్ గ్రేవీ రెసిపీ.. చేయడం ఈజీ.. చాలా టేస్టీ
Mushroom Gravy Recipe : మీరు తరచుగా ఇంట్లో పుట్టగొడుగులను వండుతున్నారా? ఈ మధ్యాహ్నం మీ ఇంట్లో కొత్తగా ట్రై చేయాలనుకుంటున్నారా? మష్రూమ్ కొని ఆ గ్రేవీ చేయండి. సూపర్ టేస్టీగా ఉంటుంది.
రెస్టారెంట్‍లో మీరు తినే మష్రూమ్ గ్రేవీ రుచిగా లేదా? అయితే ఇంట్లోనే కొత్తగా ట్రై చేయండి. టేస్టీగా ఉంటుంది. ఆరోగ్యానికి కూడా మంచిది. చాలా ఈజీగా చేసేయెుచ్చు. కింద ఇచ్చిన విధంగా ప్రయత్నించండి. ఈ మష్రూమ్ గ్రేవీని తయారు చేయడం సులభం, చాలా రిచ్ ఫ్లేవర్ ఉంటుంది. మష్రూమ్ గ్రేవీ ఎలా చేయాలో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే కింది చిట్కాలు ఫాలో అవ్వండి.
కావాల్సిన పదార్థాలు
పుట్టగొడుగులు - 250 గ్రా (తరిగినవి), నూనె - 3 టేబుల్ స్పూన్లు, దాల్చిన చెక్క - 1, యాలకులు - 3, జీలకర్ర - 1/2 టీస్పూన్, ఉల్లిపాయ - 1 (సన్నగా తరిగినవి), పసుపు పొడి - 1/2 టీస్పూన్, జీలకర్ర పొడి - 1/ 2 tsp, గరం మసాలా - 1 tsp, ధనియాల పొడి - 1 tsp, కారం - 2 tsp, అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 tsp, పచ్చిమిర్చి - 3, కరివేపాకు - కొద్దిగా, టొమాటో - 1 (సన్నగా తరిగిన), నీరు కావలసినంత, ఉప్పు - రుచి ప్రకారం, కొత్తిమీర - కొద్దిగా
తయారు చేసే విధానం
ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టి అందులో నూనె పోసి వేడయ్యాక అందులో దాల్చిన చెక్క, యాలకులు, జీలకర్ర వేసి వేయించాలి.
తర్వాత ఉల్లిపాయలు వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి.
ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, జీలకర్ర పొడి, గరం మసాలా, ధనియాల పొడి, కారం, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి బాగా కలపాలి.
తర్వాత అందులో టొమాటోలు వేసి మెత్తగా వేయించాలి.
ఇక మష్రూమ్ వేసి వేయించాలి. కాసేపు ఉడకబెట్టి, గ్రేవీకి అవసరమైన నీరు పోసి పుట్టగొడుగులను బాగా ఉడకబెట్టాలి.
మష్రూమ్ బాగా ఉడికిన తర్వాత అందులో కొత్తిమీర చల్లి, పైన ఒక టీస్పూన్ నెయ్యి పోసి కదిలిస్తే, రుచికరమైన, స్పైసీ మష్రూమ్ గ్రేవీ రెడీ.