Today Horoscope : నేటి రాశిఫలాలు : చిన్న విషయాలకు బాధపడకండి.. ఇతరుల కోసం అతిగా ఖర్చు చేయకండి..-today horoscope in telugu based on career and life for 25th august 2022 ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Today Horoscope In Telugu Based On Career And Life For 25th August 2022

Today Horoscope : నేటి రాశిఫలాలు : చిన్న విషయాలకు బాధపడకండి.. ఇతరుల కోసం అతిగా ఖర్చు చేయకండి..

Geddam Vijaya Madhuri HT Telugu
Aug 25, 2022 06:22 AM IST

Today Horoscope : నేటి రాశిఫలాలు : రాశిచక్రాలనేవి ఆ రాశి వారి వ్యక్తిత్వాన్ని నిర్వచించేలా లక్షణాలు కలిగి ఉంటాయి. ఈ రోజు మీకు అనుకూలించే అంశాలు ఏంటో.. అనుకూలించనివి ఏంటో తెలుసుకుని.. రోజును ప్రారంభిస్తే ఎంత బాగుంటుంది. ఆగస్టు 25వ తేదీ 2022న రాశుల ప్రకారం మీకు ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. సూర్యమానం అనుసరించి రాశిఫలాలుగా గమనించగలరు.

నేటి రాశిఫలితాలు
నేటి రాశిఫలితాలు

Today Horoscope : నేటి రాశిఫలాలు (25-08-2022) ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

మేష రాశిఫలం

స్నేహితుడి మార్గదర్శకత్వంలో మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. గత పెట్టుబడులలో నష్టాన్ని ఎదుర్కొనే అవకాశాలున్నాయి. పెండింగ్‌లో ఉన్న ఇంటి పనులను పూర్తి చేయడానికి ఇది అనుకూలమైన రోజు. మీ సమయాన్ని ఇస్తానని ఎవరికైనా వాగ్దానం చేసే ముందు.. మీ పని ప్రభావితం కాకుండా చూసుకోండి. ఈరోజు మద్యం, సిగరెట్లకు దూరంగా ఉండండి.

వృషభ రాశిఫలం

మీరు ఎవరి సహాయం లేకుండానే డబ్బు సంపాదించగలుగుతారు. పెండింగ్‌లో ఉన్న ఇంటి పనులను పూర్తి చేయడానికి అనుకూలమైన రోజు. మొబైల్ ఫోన్ లేదా టీవీ చూస్తూ మీరు సమయాన్ని వృథా చేయవచ్చు. ఆ సమయాన్ని మీ జీవిత భాగస్వామితో వెచ్చించండి.

మిథున రాశిఫలం

చిన్న చిన్న విషయాలకు బాధపడకండి. ఇతరులను ఆకట్టుకోవడానికి అతిగా ఖర్చు చేయకండి. మీరు మీ ప్రత్యేక వ్యక్తిని కోల్పోవచ్చు. ఓపెన్ మైండ్ ఉంటే మంచి అవకాశాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. సృజనాత్మకత, ఉత్సాహం మిమ్మల్ని మరొక ప్రయోజనకరమైన రోజుకి నడిపిస్తుంది. కొన్ని అపార్థాల తర్వాత.. మీరు మీ జీవిత భాగస్వామితో మనోహరమైన సమయాన్ని గడుపుతారు.

కర్కాటక రాశిఫలం

మీ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోండి. మీ సనాతన ఆలోచన మీ పురోగతికి ఆటంకం కలిగించవచ్చు. ఖర్చుపై నిఘా ఉంచండి. సాయంత్రం జీవిత భాగస్వామితో సినిమా లేదా డిన్నర్​కి వెళ్లండి. రిలాక్స్‌ అవుతారు. మీరు ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ఇతరుల అవసరాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి.

సింహ రాశిఫలం

మీ మేనమామ లేదా తాత మీకు ఆర్థికంగా సహాయం చేయవచ్చు. మీ కుటుంబ సభ్యులలో ఒకరి ప్రవర్తన వల్ల మీరు కలవరపడవచ్చు. మీరు వారితో మాట్లాడితే అంతా సెట్ అవుతుంది. మీ ప్రేమ జీవితంలో ఈరోజు అద్భుతమైన రోజు కానుంది. మీ పనికి ఎవరిని క్రెడిట్ తీసుకోనివ్వవద్దు.

కన్య రాశిఫలం

అధిక వ్యయం, సందేహాస్పద ఆర్థిక పథకాలను నివారించండి. మీ జీవిత భాగస్వామి సాంగత్యంలో మీకు సుఖం లభిస్తుంది. మీ విశ్వాసం మీ వృత్తి జీవితంలో ప్రభావం చూపుతుంది. ఇది మీ అభిప్రాయాన్ని ఇతరులను ఒప్పించడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. కొందరు మీకు, మీ భాగస్వామికి మధ్య విభేదాలు సృష్టించడానికి ప్రయత్నిస్తారు. కానీ వాళ్లు విజయం సాధించలేరు.

తుల రాశిఫలం

ఈరోజు మీరు బహుళ వనరుల నుంచి ద్రవ్య లాభాలను పొందుతారు. స్నేహితులు, కుటుంబ సభ్యులు మీ వ్యక్తిగత, వృత్తి జీవితంలో మిమ్మల్ని ప్రోత్సహిస్తారు. అర్హులైన ఉద్యోగులకు పదోన్నతి లేదా ద్రవ్య ప్రయోజనాలు లభించే అవకాశం ఉంది. ఈ రోజు మీ వైవాహిక జీవితం చాలా బాగుంటుంది.

వృశ్చిక రాశిఫలం

విదేశీ వ్యవహారాలు ఉన్న వ్యాపారులు, వ్యాపారులు ధనాన్ని కోల్పోయే అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా ముందడుగు వేసే ముందు జాగ్రత్తగా ఆలోచించండి. ఎవరైనా మీకు హాని కలిగించడానికి ప్రయత్నించవచ్చు. మీరు ఊహించిన విధంగా ఫలితాలు బాగా లేవని మీరు భావిస్తే.. మీ ప్లాన్‌ మార్చుకోవడం తెలివైన పని.

ధనుస్సు రాశిఫలం

మీరు మీ అభిరుచుల కోసం కొంత ఖాళీ సమయాన్ని వెచ్చిస్తారు. డబ్బుకు సంబంధించిన సమస్య పరిష్కారమవుతుంది. మీరు ఆర్థికంగా లాభపడవచ్చు. కుటుంబ బాధ్యతలు ఎక్కువ అవుతాయి. కార్యాలయంలో మీ సహోద్యోగులు మీకు సహాయం చేయవచ్చు. మీ జీవిత భాగస్వామి అనారోగ్యం మిమ్మల్ని ఒత్తిడికి గురి చేస్తుంది.

మకర రాశిఫలం

మీకు ఆర్థిక ప్రయోజనాలు ఉండవచ్చు. కుటుంబ బాధ్యతలు మీకు భారం కావచ్చు. మీరు పని ప్రదేశంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే చీట్ చేసే వారు ఎక్కువగానే ఉన్నారు కాబట్టి. మీ జీవిత భాగస్వామితో కొంత సమయం గడపడం వల్ల మీకు ఇది మంచిరోజు అవుతుంది. రిఫ్రెష్​గా ఉంటుంది.

కుంభ రాశిఫలం

మీ ప్రేమ జీవితం ఉల్లాసంగా ఉంటుంది. పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేయడంలో వ్యాపార భాగస్వాములు ఒకరికొకరు మద్దతు ఇవ్వవచ్చు. మీరు కొంతమంది ముఖ్యమైన వ్యక్తులను కలవవచ్చు. మీకు, మీ జీవిత భాగస్వామికి మధ్య నమ్మకం లేకపోవడం.. మీ వైవాహిక ఆనందానికి భంగం కలిగించవచ్చు.

మీనం రాశిఫలం

మీ ఆరోగ్యం, శరీరాకృతిపై పని చేయడానికి మీకు తగినంత సమయం లభిస్తుంది. ఆర్థిక ప్రయోజనాలు ఉండవచ్చు. నివాసం మార్చడం శుభప్రదం కావచ్చు. సాహసోపేతమైన చర్యలు, నిర్ణయాలు అనుకూల ఫలితాలను తీసుకురావచ్చు. అనుకోని అతిథి మీ ప్రణాళికలకు భంగం కలిగించవచ్చు. అయితే అది కూడా మీకు మంచే చేస్తుంది.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్