Today Horoscope : అధికారులతో విభేదాలు.. కార్యాలయంలో ఇబ్బందులు.. జాగ్రత్త అవసరం-today horoscope based on career and life for 7th july 2022 ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Today Horoscope Based On Career And Life For 7th July 2022

Today Horoscope : అధికారులతో విభేదాలు.. కార్యాలయంలో ఇబ్బందులు.. జాగ్రత్త అవసరం

Geddam Vijaya Madhuri HT Telugu
Jul 07, 2022 06:07 AM IST

రోజువారీ జాతకంలో మీకు రాశులు అనుకూలంగా ఉన్నాయా? ఈ రోజు మీ లక్ష్యాలకు అనుకూలించే అంశాలు ఏంటో.. అనుకూలించనివి ఏంటో తెలుసుకుని.. రోజును ప్రారంభిస్తే ఎంత బాగుంటుంది. జూలై 7వ తేదీ 2022న రాశులు మీకు అనువుగా ఉన్నాయో లేదో తెలుసుకుందాం. చంద్రమానం ప్రకారం అనుసరించి రాశిఫలాలుగా గమనించగలరు.

ఈరోజు రాశి ఫలాలు
ఈరోజు రాశి ఫలాలు

మేషం

మనస్సు చంచలంగా ఉంటుంది. అనవసరమైన కుటుంబ వివాదాలకు దూరంగా ఉండండి. స్త్రీ నుంచి ధనం అందుకోవచ్చు. వ్యాపారంలో శ్రమ ఎక్కువగా ఉంటుంది. మానసిక స్థితి అంత మెరుగ్గా ఉండదు. కాబట్టి సంభాషణల్లో ఓపికగా ఉండండి. ఉద్యోగం కోసం రాసే పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. ఆదాయ వనరులు అభివృద్ధి చెందుతాయి.

వృషభం

పనిలో నిమగ్నత పెరుగుతుంది. ఉద్యోగంలో మార్పు వచ్చే అవకాశం ఉంది. సహనం లోపిస్తుంది. మనస్సులో ప్రతికూలత ఏర్పడవచ్చు. వాక్కు ప్రభావం వల్ల నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి. ఉద్యోగంలో అధికారులతో విభేదాలు పెరగవచ్చు. కార్యాలయంలో ఇబ్బందులు ఉండవచ్చు. శ్రమ అధికంగా ఉంటుంది. టెన్షన్ పెరిగే అవకాశముంది.

మిథునం

ఆత్మవిశ్వాసంతో ఉంటారు. మితిమీరిన ఉత్సాహాన్ని తగ్గించుకోండి. పనిలో మెరుగుదల ఉండవచ్చు. పిల్లల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఆఫీసులో అవాంతరాలు ఉంటాయి. మానసిక సమస్యలు కొంత తగ్గుముఖం పట్టవచ్చు. ధన స్థితి సంతృప్తికరంగా ఉంటుంది. లాభదాయక అవకాశాలు ఉంటాయి.

కర్కాటకం

ఉద్యోగంలో మార్పు వచ్చే అవకాశం ఉంది. ఆదాయం పెరుగుతుంది. కుటుంబానికి దూరంగా ఉండాల్సి రావచ్చు. ఖర్చులు పెరుగుతాయి. మీరు పూర్తిగా ఆశ, నిరాశలతో నిండిపోయి ఉంటారు. ఆత్మవిశ్వాసం తగ్గుతుంది. భావోద్వేగాలను నియంత్రణలో ఉంచుకోవడం మంచిది. తల్లి నుంచి ధనం పొందవచ్చు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి. విద్యా సంబంధమైన పనులలో ఇబ్బందులు ఎదురుకావచ్చు.

సింహం

ఓపికతో ఉండండి. అనవసరమైన కోపాన్ని పక్కనపెట్టేయండి. ఉద్యోగంలో పురోగతికి బాటలు వేస్తారు. అధికారుల సహకారం కూడా ఉంటుంది. వాహన ఆనందం పెరగవచ్చు. కుటుంబ జీవితం కష్టంగా ఉంటుంది. సహనం లోపిస్తుంది. పనిలో స్థానచలనం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఖర్చులు అధికంగా ఉంటాయి. వ్యాపారం చేసే వారికి ఆదాయం పెరుగుతుంది.

కన్య

మనసు ఆనందంగా ఉంటుంది. దాంపత్య సంతోషం పెరుగుతుంది. ఉద్యోగంలో కొంత అదనపు బాధ్యత ఉండవచ్చు. పని ఎక్కువ అవుతుంది. కార్యాలయంలో ఇబ్బందులు ఉండవచ్చు. అయినా మీరు పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉంటారు. కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది. సహనం తగ్గుతుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి.

తుల

మనసు కలవరపడవచ్చు. వ్యాపారంలో మార్పులకు అవకాశాలు ఉన్నాయి. వ్యాపారంలో బట్టల వైపు మొగ్గు పెరుగుతుంది. మీకు స్నేహితుల మద్దతు లభిస్తుంది. మానసిక ప్రశాంతత లోపిస్తుంది. తండ్రికి ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఆదాయం తగ్గి ఖర్చులు పెరుగుతాయి. సంబంధంలో మాధుర్యం ఉంటుంది.

వృశ్చికం

కళ లేదా సంగీతం పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఉద్యోగ రీత్యా ప్రయాణం చేయవలసి రావచ్చు. ప్రయాణం లాభదాయకంగా ఉంటుంది. అదే సమయంలో శ్రమ కూడా పెరుగుతుంది. కుటుంబ సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. భవనం నిర్మాణం, ఫర్నిషింగ్‌పై ఖర్చులు పెరగవచ్చు. ఉద్యోగంలో మార్పు వచ్చే అవకాశం ఉంది.

ధనుస్సు

ఉద్యోగంలో మార్పు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఉన్నత స్థానానికి చేరుకుంటారు. పని ప్రదేశంలో ఎక్కువ శ్రమ ఉంటుంది. కార్యాలయంలో ఇబ్బందులు ఉండవచ్చు. స్నేహితులు మీకు సహాయం చేస్తారు. మనస్సులో ప్రతికూల ప్రభావం ఉంటుంది. ఆత్మవిశ్వాసం లోపిస్తుంది. సహనం తగ్గుతుంది.

మకరం

మీరు స్నేహితుడి నుంచి వ్యాపార ఆఫర్‌ను పొందవచ్చు. తల్లిదండ్రుల మద్దతు కూడా లభిస్తుంది. ఆస్తి ఆదాయ వనరుగా మారవచ్చు. విద్యా విషయాలలో విజయం సాధిస్తారు. ఆత్మవిశ్వాసం ఎంత ఉన్నా.. సహనం మాత్రం లోపిస్తుంది. ఏదైనా మతపరమైన స్థలం నిర్మాణంలో మీరు సహాయం చేయవచ్చు. పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవుతాయి.

కుంభం

పూర్తిగా ఆత్మవిశ్వాసంతో ఉంటారు. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. స్నేహితులతో మంచి సంబంధాలు కొనసాగించండి. అనవసర వాదనలకు దూరంగా ఉండండి. ఆదాయానికి అంతరాయం ఏర్పడుతుంది. అదనపు ఖర్చుల వల్ల మీరు ఇబ్బంది పడతారు. మనసులో నిరాశ, అసంతృప్తి కలగవచ్చు. మానసిక ఒత్తిడి ఉంటుంది. సోదరుల సహకారంతో మీరు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు.

మీనం

కుటుంబంలో గౌరవం లభిస్తుంది. ఉద్యోగంలో అధికారులతో మీకు సహాయం చేస్తారు. పిల్లల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఖర్చులు పెరుగుతాయి. మనస్సులో ప్రతికూల ప్రభావం ఉంటుంది. ఆత్మవిశ్వాసం లోపిస్తుంది. విద్యా విషయాలలో విజయావకాశాలు ఉన్నాయి.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్