Veg Manchurian : స్నాక్స్ కోసం.. వెజ్ మంచూరియన్.. ఇలా చేయాలి అంతే
Veg Manchurian Recipe : వెజ్ మంచూరియన్ ..వాతావరణం చల్లగా ఉండడంతో ఇంట్లోవాళ్లు సాయంత్రం ఇష్టంగా తింటారు. మీ ఇంట్లో కూడా అదే వింటున్నారా? అయితే టేస్టీగా చేసుకోవచ్చు.
మీ ఇంట్లో క్యాబేజీ, క్యారెట్ వంటి కూరగాయలు ఎక్కువగా ఉన్నాయా? అయితే వెజ్ మంచూరియన్ చేసేయండి. ఆ వెజిటేబుల్స్ తో మంచూరియన్ చేసుకుని ఎంజాయ్ చేస్తూ తినొచ్చు. ఈ వెజ్ మంచూరియన్ తినడానికి రుచికరంగా ఉంటుంది. సులభంగా తయారు చేసుకోవచ్చు. ముఖ్యంగా బడి నుంచి ఇంటికి వచ్చిన పిల్లలకు పెడితే ఎంతో ఇష్టంగా తిని ఆకలి తీర్చుకుంటారు. వెజ్ మంచూరియన్ గ్రేవీ ఎలా చేయాలో తెలుసుకోవాలనుకుంటున్నారా? ఈ గ్రేవీ రెసిపీ వంటకం కింది విధంగా ఉంది.
ట్రెండింగ్ వార్తలు
కావాల్సిన పదార్థాలు
క్యాబేజీ - 1 కప్పు (సన్నగా తరిగినది), క్యారెట్ - 1 కప్పు (తురిమినది), కారం - 1/2 కప్పు, చిల్లీ సాస్ - 1/2 tsp, సోయా సాస్ - 1/2 tsp, మైదా - 2 టేబుల్ స్పూన్లు, మొక్కజొన్న పిండి - 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు - రుచికి అనుగుణంగా, మిరియాల పొడి - రుచికి అనుగుణంగా, నూనె - వేయించడానికి అవసరమైనంత
గ్రేవీ కోసం : నూనె - 2 టేబుల్ స్పూన్, అల్లం - 1 టేబుల్ స్పూన్, వెల్లుల్లి - 1 టేబుల్ స్పూన్ (సన్నగా తరిగినవి), ఉల్లిపాయ - 1 (తరిగినవి), మిరపకాయలు - 1 (పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి), చిల్లీ సాస్ - 1 టేబుల్ స్పూన్, సోయా సాస్ - 1 టేబుల్ స్పూన్, కార్న్ ఫ్లోర్ - 1 టేబుల్ స్పూన్, నీరు - 1 కప్పు, ఉప్పు - రుచికి, మిరియాల పొడి - కొద్దిగా
ఎలా చేయాలంటే..
ముందుగా క్యాబేజీ, క్యారెట్, వెజ్, చిల్లీ సాస్, సోయాసాస్, ఉప్పు, మిరియాల పొడిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి.
తర్వాత మైదా, మొక్కజొన్న పిండి వేసి బాగా మెత్తగా కలపాలి. ఇప్పుడు చిన్న చిన్న ఉండలుగా చేసి ప్లేటులో పెట్టుకోవాలి.
తర్వాత స్టవ్ మీద ఫ్రైయింగ్ పాన్ వేసి వేయించడానికి కావల్సినంత నూనె వేసి వేడయ్యాక అందులో రోల్ చేసిన బాల్స్ వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించి పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు మరో కడాయి పెట్టి అందులో నూనె పోసి వేడయ్యాక అందులో అల్లం, వెల్లుల్లి వేసి ఒక నిమిషం వేయించాలి. ఆ తర్వాత ఉల్లిపాయలు, మిరపకాయలు వేసి 2 నిమిషాలు వేయించాలి.
ఇక చిల్లీసాస్, సోయాసాస్, టొమాటో కెచప్ వేసి, అవసరమైతే కొంచెం ఉప్పు వేసి, మిరియాల పొడి వేసి, కొద్దిగా నీళ్లు పోసి మరిగించాలి.
తర్వాత వేయించిన మంచూరియన్ బాల్స్ వేసి కలపాలి, గ్రేవీ కావాలంటే కాస్త నీళ్లు ఉండగానే ఆఫ్ చేయాలి. అంతే రుచికరమైన వెజ్ మంచూరియన్ గ్రేవీ రెడీ.