Wheat Rava Idli : గోధుమ రవ్వతో ఇడ్లీలు.. అద్భుతంగా ఉంటాయి
Wheat Rava Idli Recipe : గోధుమ రవ్వతో ఇడ్లీలు తయారుచేసుకోండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..
ప్రతీరోజూ ఉదయం పూట ఏమి వండాలని చాలా మందికి పెద్ద తలనొప్పి. అయితే ఈజీగా ఉండే రెసిపీ తయారుచేసుకోవాలి. కొన్నిసార్లు వండేందుకు ముందుగా ప్రిపేర్ అవ్వకుండా ఉంటారు. అలాంటి సమయంలో సింపుల్‌గా చేసే బ్రేక్ ఫాస్ట్ ప్రయత్నించాలి. ఇలాంటి సమయంలో మీ ఇంట్లో గోధుమ రవ్వ ఉంటే చాలు.. ఇడ్లీ తయారు చేసుకోవచ్చు. దానితోపాటుగా పెరుగు, కొన్ని పదార్థాలు ఉంటే ఇడ్లీ తయారు చేయవచ్చు. మంచి రుచిగా ఉంటుంది. గోధుమ రవ్వ ఇడ్లీ తయారు చేయడం చాలా సులభం. ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..
ఇడ్లీ పిండి లేనప్పుడు ఇడ్లీ తినాలనిపిస్తే.. గోధుమ రవ్వ ఇడ్లీ చేసుకోవచ్చు. సైడ్ డిష్‌గా కొబ్బరి చట్నీ, టొమాటో చట్నీ మరింత అద్భుతంగా ఉంటుంది. గోధుమ రవ్వ ఇడ్లీ రెసిపీ వంటకం కింది విధంగా ఉంది.
గోధుమ రవ్వ ఇడ్లీకి కావాల్సిన పదార్థాలు :
గోధుమ రవ్వ - 1 కప్పు, పెరుగు - 3/4 కప్పు, పచ్చిమిర్చి - 2 (సన్నగా తరిగినవి), కరివేపాకు - కొద్దిగా, క్యారెట్ తురుము - 1-2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర - కొద్దిగా, ఉప్పు - 1 tsp, నూనె - కొంచెం, ఆవాలు - 1/2 tsp, మినపప్పు - 1 tsp, శనిగలు - 2 tsp, ఇంగువ పొడి - 1 చిటికెడు
గోధుమ రవ్వ ఇడ్లీ తయారీ విధానం
ముందుగా పెరుగును బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు ఓవెన్‌లో కడాయి పెట్టి అందులో 2 టీస్పూన్ల నూనె పోసి వేడయ్యాక ఆవాలు, ఉల్లి పప్పు, శెనగపప్పు, ఇంగువ పొడి వేసి తాలింపు వేయాలి.
తర్వాత అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి.
ఇప్పుడు గోధుమ రవ్వ వేసి మీడియం మంట మీద ఉంచి బంగారు రంగు వచ్చేవరకు వేయించి చల్లారనివ్వాలి.
తర్వాత పెరుగులో గోధుమ రవ్వ వేసి, రుచికి సరిపడా ఉప్పు వేసి, అవసరమైతే కొన్ని నీళ్లు పోసి బాగా కలపాలి.
ఇప్పుడు తురిమిన క్యారెట్, కొంచెం కొత్తిమీర వేసి బాగా కదిలించి 3-5 నిమిషాలు నాననివ్వండి.
చివరగా పిండిని కలిపి ఇడ్లీ ప్లేట్‌లో పోసి 10-12 నిమిషాలు ఉడకబెట్టితే రుచికరమైన గోధుమ రవ్వ ఇడ్లీ రెడీ.