Telugu News  /  Lifestyle  /  Today Breakfast Recipe Is Diabetic Friendly Sweet Here Is The Ingredients And Process
డయాబెటిక్ ఫ్రెండ్లీ స్వీట్
డయాబెటిక్ ఫ్రెండ్లీ స్వీట్

Breakfast Recipe : మీరు డయాబెటికా? అయితే ఈ స్వీట్ మీరు కూడా తినొచ్చు..

13 August 2022, 7:20 ISTGeddam Vijaya Madhuri
13 August 2022, 7:20 IST

పాపం మధుమేహం ఉన్నవారు స్వీట్ కష్టాలు అన్ని ఇన్నికావు. వీరికి స్వీట్ తినాలనిపిస్తుంది. కానీ తినకూడదు. ఇంట్లో వాళ్లు అసలు వారికి స్వీట్ ఇచ్చే ఛాన్సే లేదు. మీరు కూడా అలాగే ఫీల్ అవుతున్నారా? అయితే మీరు ఈ స్వీట్ తినొచ్చు. అవునండి.. మీరు ఇంట్లోనే దీనిని తయారు చేసుకోవచ్చు కూడా.

Breakfast Recipe : ఓట్స్, నారింజతో తయారు చేసే ఈ వంటకం రుచికరమైనది మాత్రమే కాకుండా చాలా ఆరోగ్యకరమైనది కూడా. ఈ రెసిపీని మధుమేహ వ్యాధిగ్రస్తులు వేరే ఆలోచన లేకుండా చక్కగా లాగించేయవచ్చు. అయితే స్వీట్ కోసం ఆరాటపడే మీ ఇంట్లోని వారికి.. ఉదయమే వేడిగా వండి.. చల్లగా వారికి వడ్డించి వారి నోరు తీపి చేయండి. పైగా దీనిని వండడం కూడా చాలా సులభం. ఈ ప్రత్యేకమైన స్వీట్ ఎలా తయారు చేయాలో, కావాల్సిన పదార్థాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

ట్రెండింగ్ వార్తలు

కావాల్సిన పదార్థాలు

* ఓట్స్ - పావు కప్పు

* ఆరెంజ్ - 2 కప్పులు (పీల్ తీసేయాలి)

* పాలు - 2 కప్పులు

* నెయ్యి - 1 టీస్పూన్

* స్టెవియా - 1 టీస్పూన్ (పంచదారకు ప్రత్యామ్నాయం)

తయారీ విధానం

స్టవ్ వెలిగించి ఓ పాన్ దానిమీద ఉంచాలి. దానిలో నెయ్యి వేసి.. ఓట్స్‌ను కూడా వేసి 2 నిమిషాలు వేయించాలి. అలా వేగాక ఓట్స్‌లో పాలు వేసి బాగా కలపాలి. దానిని 10 నిమిషాలు ఉడికించాలి.

ఓట్స్ చిక్కగా అయిన తర్వాత.. మంట నుంచి దించేయాలి. అది చల్లారాక.. దానిలో నారింజ ముక్కలు, స్టెవియో వేసి బాగా కలపాలి. వడ్డించే ముందు కనీసం 30 నిమిషాలు ఫ్రిజ్‌లో ఉంచండి. తినేముందు తరిగిన బాదంపప్పులతో అలంకరించండి. దీనిని మధుమేహం ఉన్నవారు కూడా హ్యాపీగా తినొచ్చు.

టాపిక్