Breakfast Recipe : బీట్రూట్ని ఈ రూట్లో తీసుకోండి.. హెల్తీగా ఉండండి
Beetroot Pulao : చాలామంది పిల్లలు బీట్‌రూట్ తినడానికి ఇష్టపడరు. కానీ బీట్ రూట్ పిల్లల నుంచి పెద్దలవరకు అందరికీ మంచిదే. అయితే మీరు కచ్చితంగా బీట్‌రూట్ తినాలి లేదా తినిపించాలి అనుకుంటే.. ఈ రుచికరమైన ఆలు బీట్‌రూట్ పులావ్‌ను మీ డైట్లో చేర్చుకోవచ్చు. ఇది హెల్తీ, రుచికి రుచి ఉంటుంది. పైగా దీనిని త్వరగా తయారు చేసుకోవచ్చు. దీనిని బ్రేక్‌ఫాస్ట్‌గా, బ్రంచ్గా, లంచ్‌గా కూడా తీసుకోవచ్చు.
Beetroot Pulao : ఉదయాన్నే బీట్‌రూట్ తినడం నచ్చనివారు.. బీట్రూట్ని వేరే రూట్లో తీసుకుని.. హెల్తీగా తినడం ప్రారంభించండి. ఈ రోజుల్లో రక్తహీనతతో బాధపడేవారు చాలామందే ఉన్నారు. అలాంటివారు కచ్చితంగా బీట్‌రూట్ తీసుకోవాలి. అలా తీసుకోవడం నచ్చని వారు ఈ రెసిపీని ట్రై చేయండి. మీకు రుచి ఉంటుంది. హెల్త్‌కి కూడా చాలా మంచిది. పైగా తక్కువ టైమ్‌లో దీనిని తయారు చేసుకోవచ్చు. బీట్‌రూట్ పులావ్ రెసిపీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ట్రెండింగ్ వార్తలు
కావాల్సిన పదార్థాలు
* ఉల్లిపాయలు - 2 (తరగాలి)
* టొమాటోలు - 2
* బంగాళదుంపలు - 2
* బీట్‌రూట్ - 1 (చిన్నగా తరగాలి లేదా తురమాలి)
* బియ్యం - 1 కప్పు
* అల్లం-వెల్లుల్లి పేస్ట్ - 1 టేబుల్ స్పూన్
* పచ్చిమిర్చి - 2 (కట్ చేసి పెట్టుకోవాలి)
* జీలకర్ర - అరటీస్పూన్ 1/4
* కారం - 1 స్పూన్
* ఉప్పు - రుచికి తగినంత
* ధనియాల పొడి - అరటీస్పూన్
* మసాల దినుసులు - తగినన్ని (మీ రుచికి తగ్గట్లు)
బీట్‌రూట్ పులావ్ తయారీ విధానం
బియ్యాన్ని కడిగి.. కనీసం అరగంట పాటు నీటిలో నానబెట్టాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి నూనె వేయాలి. దానిలో జీలకర్ర వేయించాలి. అనంతరం ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం-వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. అవి గోల్డెన్ కలర్లోకి మారుతున్నప్పుడు టొమాటోలు, ఉప్పు, మసాలా దినుసులు వేయాలి.
అవి కాస్త మగ్గిన తర్వాత.. దానిలో బీట్‌రూట్, బంగాళాదుంపలు, బియ్యం వేయాలి. ఒకకప్పు బియ్యానికి.. ఒకటిన్నర కప్పు నీళ్లు పోసి.. అన్నింటినీ ఉడికించాలి. అంతే వేడి వేడి పులావ్ రెడీ. దీనిని వేడి తింటే చాలా బాగుంటుంది.
సంబంధిత కథనం