Breakfast Recipe : హెల్తీ బ్రేక్ఫాస్ట్ కావాలనుకుంటే.. బార్లీ ఖీర్ తినాల్సిందే..
బార్లీ ఆరోగ్యానికి చాలా మంచివని అందరికీ తెలుసు. జ్వరం వచ్చినప్పుడు బార్లీ తీసుకుంటే మంచిదిని చాలామంది సూచిస్తారు కూడా. అయితే ఆరోగ్యానికి ఎంతో మంచిదైనా ఈ బార్లీతో ఓ హెల్తీ, టేస్టీ రెసిపీ చేయవచ్చని ఎంతమందికి తెలుసు. ఇప్పుడు మనం దాని గురించే తెలుసుకోబోతున్నాం.
Breakfast Recipe : బార్లీ నీళ్లు తాగాలంటే చాలా ఇబ్బందిగా ఉంటాయి. దానికి టేస్ట్ ఉండదు. కానీ ఆరోగ్యానికి మంచిది. కాబట్టి దానితో టేస్టీ వంటను చేస్తే.. ఇంటిల్లిపాది తినొచ్చు. ఆరోగ్యానికి ఆరోగ్యం.. రుచికి రుచి. అయితే బార్లీతో ఏమి డిష్ చేయగలమని ఆలోచిస్తున్నారా? అయితే మీ ప్రశ్నకు సమాధానమే బార్లీ ఖీర్. దీనిని ఎలా తయారు చేయాలో.. కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు
* బార్లీ గింజలు - 1 కప్పు
* పాలు - 1 లీటర్
* ఖర్జూరం - అరకప్పు / తేనే - 2 టేబుల్ స్పూన్లు
తయారీ విధానం..
బార్లీని బాగా కడిగి.. 3-4 గంటలు నానబెట్టాలి. రాత్రి నానబెట్టినా పర్లేదు. అవి నానిన తర్వాత పాన్ తీసుకుని.. దానిలో పాలు పోసి స్టౌవ్ వెలిగించి మరిగించాలి. అనంతరం దానిలో నానబెట్టిన బార్లీని వేయాలి. 10 నిమిషాలు ఉడకనివ్వండి.
ఇప్పుడు తీపికోసం తరిగిన, గింజలు లేని ఖర్జూరం వేయాలి. ఖర్జూరానికి బదులు.. మీరు తేనెను ఉపయోగిస్తే కనుక.. అది చివరి దశలో వేయాలి. మరో 10 నిమిషాలు ఉడికించాలి. ఖర్జూరం కూడా ఉడికిందని నిర్ధారించుకున్నాక.. స్టవ్ ఆపేయండి. వేడి వేడిగా ఇంటిల్లిపాది లాగించేయండి.