Methi Leaf Rice : మెంతి ఆకులతో రెసిపీ.. యమ్మీ యమ్మీగా బ్రేక్‍ఫాస్ట్ చేసేయండి
Today Breakfast Recipe : ప్రతిరోజూ ఒకేలా తింటే బోర్ కొడుతుంది కదా. అందుకే కొత్తగా ట్రై చేయాలి. ఆరోగ్యంగా కూడా ఉండాలి. అందుకే మెంతి ఆకులతో రెసిపీ చేసుకోండి. అల్పాహరంలోకి తీసుకోండి.
కొన్నిసార్లు చాలా మంది సమస్య ఏటంటే ఉదయం నిద్ర లేవగానే అల్పాహారం తీసుకోవడం. టిఫిన్ త్వరగా రెడీ కావాలి. ఆరోగ్యంగా కూడా ఉండాలి. అందుకే మెంతి బాత్ రైస్ చేయండి. మెంతి ఆకులతో రైస్ చేసి తింటే.. పులావ్ కంటే బాగుంటుంది. ఆరోగ్యానికి కూడా మంచిది. కాస్త నెయ్యి కలిపితే.. లొట్టలేసుకుంటూ తింటారు. పిల్లలు దీన్ని తప్పకుండా ఇష్టపడతారు. ఇది అల్పాహారం, లంచ్ బాక్స్‌లోకి కూడా ఉపయోగపడుతుంది.
కావాల్సిన పదార్థాలు
1 మెంతి ఆకు కట్ట, 1 గ్లాసు బియ్యం, 3-4 టమోటాలు, 2 ఎర్ర మిరపకాయలు (మీకు కారంగా కావాలంటే మరిన్ని వాడుకోవచ్చు), పెసరు పప్పు తగినంత, 4 లవంగాలు, 2 ఏలకులు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, ఉల్లిపాయ 2, పసుపు పొడి అర చెంచా, వెల్లుల్లి 10-12, అల్లం, కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర
తయారు చేసే విధానం
మెుదట పెసరపప్పును కడగాలి. ఉల్లిపాయ, టొమాటో కట్ చేసుకోవాలి. ఇప్పుడు అల్లం, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి పేస్ట్‌లా చేసుకోవాలి. కుక్కర్ వేడి చేసి అందులో 2 చెంచాల నెయ్యి (నూనె వాడవచ్చు, నెయ్యి ఉపయోగిస్తే రుచి ఉంటుంది) వేయాలి. నెయ్యి వేడి అయ్యాక, లవంగాలు, యాలకులు వేసి, ఆపై ఉల్లిపాయలు వేసి 1 నిమిషం వేగించండి. ఇప్పుడు ముందుగా తయారు చేసుకున్న పేస్ట్ వేయండి. తరువాత టొమాటోలు వేసి 2-3 నిమిషాలు అలాగే ఉంచండి(తరచుగా వేగించండి). అవి సరిగా వేగిన తర్వాత.. బియ్యం వేసుకోవాలి. తర్వాత మెంతి ఆకులు వేయాలి. పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 2 గ్లాసుల నీరు వేసి, 2 విజిల్స్ వచ్చేవరకూ ఉండనివ్వాలి. రుచికరమైన మెంతి ఆకుల రైస్ రెడీ అయిపోయినట్టే.