Bread Dosa : అల్పాహారం కోసం బ్రెడ్ దోసె.. కొత్తగా ట్రై చేయండి-today breakfast recipe how to make bread dosa in telugu ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Bread Dosa : అల్పాహారం కోసం బ్రెడ్ దోసె.. కొత్తగా ట్రై చేయండి

Bread Dosa : అల్పాహారం కోసం బ్రెడ్ దోసె.. కొత్తగా ట్రై చేయండి

HT Telugu Desk HT Telugu
Sep 16, 2023 06:30 AM IST

Bread Dosa : రోజూ అల్పాహారం ఒకేలాగా తిని బోర్ కొడుతుందా? అయితే అప్పుడప్పుడు కొత్తగా ట్రై చేయండి. దోసెను కాస్త వెరైటీగా చేయండి. బ్రెడ్ దోసె చేసి లాగించేయండి.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (unsplash)

బ్రెడ్‌ తరచుగా ఆపద సమయంలో ఆదుకుంటుంది. అదే.. ఇంట్లో ఏమీ లేనప్పుడు, బ్రెడ్ తో ఏదైనా ఫటాఫట్ సిద్ధం చేసుకుంటాం. కానీ ఇది స్నాక్స్ లాగా తింటాం. ఏదో కాసేపు కడుపు నిండినట్టుగా అనిపిస్తుంది. అయితే కొత్తగా బ్రెడ్ దోసెను ట్రై చేయండి. అల్పాహారం కోసం దోసెను ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం.. ఇది మీ సమయాన్ని ఆదా చేస్తుంది, ఇది రుచిగా ఉంటుంది.

కావల్సిన కావలసిన పదార్థాలు

4 ముక్కలు బ్రెడ్, 1 కప్పు రవ్వ, ¼ కప్పు బియ్యం పిండి, ¼ కప్పు పెరుగు, ½ స్పూన్ ఉప్పు, ½ చెంచా చక్కెర, 1 కప్పు నీరు, కొద్దిగా బేకింగ్ సోడా నూనె (వేయించడానికి)

తయారీ విధానం

మొదట బ్రెడ్ కత్తిరించండి. దీని కోసం వైట్ లేదా బ్రౌన్ బ్రెడ్ ఉపయోగించవచ్చు. అయితే తెల్ల రొట్టె వాడితే దోసె క్రిస్పీగా ఉంటుంది. ఇప్పుడు బ్రెడ్‌ను చిన్న ముక్కలుగా కట్ చేసి గిన్నెలో వేయాలి. దానికి కప్ బియ్యం పిండి, కప్పు పెరుగు, రవ్వ , ఉప్పు, చక్కెర జోడించండి. దీనికి పంచదార ఎందుకు కలుపుతారంటే, దోసె బంగారు రంగులో ఉంటుంది.

ఈ మిశ్రమానికి 1 కప్పు నీరు వేసి 20 నిమిషాలు నాననివ్వండి. 20 నిముషాల తర్వాత మిక్సీలో వేసి, అవసరమైనంత నీరు కలపండి. తర్వాత దీనిని రుబ్బాలి. ఈ పిండిని ఒక గిన్నెలో వేసి, 5 నిమిషాలు కలపండి. దానికి ముందుగా పక్కన పెట్టుకున్న బేకింగ్ సోడా వేసి, నెమ్మదిగా తిప్పండి. ఇప్పుడు దోసె పాన్ వేడి చేసి, నీళ్లు చిలకరించి టిష్యూ పేపర్‌తో తుడవాలి. దోస పిండిని వేసి వీలైనంత సన్నగా చేయాలి. దానిపై కొంచెం నూనె వేసి అటు ఇటు తిప్పండి. గోల్డెన్ బ్రౌన్ రంగు వచ్చే వరకు తక్కువ మంట మీద వేడి చేయండి. దీంతో వేడి వేడిగా బ్రెడ్ దోసె రెడీ. చట్నీ, సాంబారుతో బ్రెడ్ దోసె రుచికి సిద్ధంగా ఉంది.