Sunny Side Up Egg Recipe : ఈ సన్నీ సైడ్ అప్ ఎగ్ చాలా సింపుల్, హెల్తీ రెసిపీ
Sunny Side Up Egg Recipe : పేరు చూసి.. ఇదేదో చాలా కష్టమైన రెసిపీ అనుకోవద్దు. ఎందుకంటే ఇది చాలా సింపుల్ అండ్ హెల్తీ రెసిపీ. ఇది మీ బరువును అదుపులో ఉంచడంలో కూడా చాలా సహాయ పడుతుంది. ఫిట్‌నెస్‌పై శ్రద్ధ తీసుకునే వారు ఈ సన్నీ సైడ్ అప్ ఎగ్ రెసిపీని తమ డైట్లో తీసుకోవచ్చు. ఇంతకీ దీనిని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.
Sunny Side Up Egg Recipe : ఇది చాలా సులభమైన గుడ్డుతో చేసే బ్రేక్‌ఫాస్ట్. దీనికోసం గుడ్లను ఉడికించినవసరంలేదు.. గిలకొట్టవలసిన అవసరం లేదు. దీనిని ఆమ్లెట్ చేయడం కంటే వేగంగా తయారు చేసుకోవచ్చు. దీనిని మీ బ్రెడ్‌ను టోస్టర్‌తో కలిపి కూడా తీసుకోవచ్చు. మరి సన్నీ సైడ్ అప్ ఎగ్ రెసిపీ ఎలా తయారు చేయాలో.. కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు
* ఆలివ్ నూనె - 1 టేబుల్ స్పూన్
* వెన్న - అర టేబుల్ స్పూన్
* గుడ్డు - 1
* ఉప్పు - రుచికి తగినంత
* మిరియాల పొడి - రుచికి తగినంత
* ఒరేగానో - రుచికి తగినంత
తయారీ విధానం
మీ ఫ్రైయింగ్ పాన్‌ను తీసుకుని స్టవ్ వెలిగించి.. మీడియం నుంచి తక్కువ వేడి మీద ఉంచండి. దానిని నూనె, వెన్నతో టోన్ చేయండి. అది కొంచెం వేడి అయ్యాక.. పాన్‌లోకి గుడ్డు పగులగొట్టండి. పాన్ బాగా వేడిగా ఉంటే.. స్టవ్‌ని సిమ్‌లో ఉంచండి. గుడ్డు తెల్లసొన సెట్ అయ్యే వరకు దానిని ఉడికించాలి. పచ్చసొన మాత్రం గట్టిపడకుండా చూసుకోండి. ఇది సిద్ధమైన తర్వాత.. పాన్‌ను నుంచి తీసేయండి. దానిని సర్వ్ చేసుకుని.. దాని మీద పెప్పర్, ఒరిగానో, సాల్ట్ చల్లుకోండి. దీనిని నార్మల్‌గా తీసుకోవచ్చు. లేదా టోస్ట్‌తో సర్వ్ చేసుకోవచ్చు. లేదంటే వెజిటేబుల్స్‌తో కలిపి తీసుకోవచ్చు.
సంబంధిత కథనం