Crispy Onion Dosa | కరకరలాడే క్రిస్పీ ఆనియన్ దోశ.. ఇలా తయారుచేసుకోండి..-today breakfast is crispy onion dosa ingredients and recipe is here ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Today Breakfast Is Crispy Onion Dosa Ingredients And Recipe Is Here

Crispy Onion Dosa | కరకరలాడే క్రిస్పీ ఆనియన్ దోశ.. ఇలా తయారుచేసుకోండి..

Geddam Vijaya Madhuri HT Telugu
May 24, 2022 08:22 AM IST

మీకు క్రిస్పీగా బ్రేక్​ ఫాస్ట్ చేయాలని ఉందా? అదే దోశ అయితే దానిగురించి చెప్పాల్సిన అవసరమే లేదు. అదో స్వర్గం అంతే. క్రిస్పీ దోశను.. మంచి చట్నీతో కలిపి లాగిస్తే.. ఆహా ఆ ఊహ ఎంత బాగుందో కదా. కానీ దోశకోసం పిండి నానబెట్టలేదు రాత్రి అనుకోకండి. జస్ట్ 20 నిముషాల వ్యవధిలో మీరు ఈ దోశ మిశ్రమాన్ని రెడీ చేసుకోవచ్చు.

కరకరలాడే దోశ..
కరకరలాడే దోశ..

Crispy Onion Dosa | మీకు క్రిస్పీ దోశ తినాలనిపిస్తే చాలు. కేవలం 20 నిముషాల ముందు దోశ బేటర్​ రెడీ చేసుకోవచ్చు. పైగా ఇంట్లోనే తయారు చేసుకుని.. తృప్తిగా లాగించేవచ్చు. అయితే క్రీస్పీ దోశను తయారు చేసుకునేందుకు కావాల్సిన పదార్థాలు, ఎలా తయారు చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు

* రవ్వ - కప్పు

* బియ్యం పిండి - కప్పు

* మైదా - కప్పు

* ఉప్పు - తగినంత

* కారం - 2 స్పూన్​లు

* నీరు -4 కప్పులు

* మిర్చి - 2 (సన్నగా తరిగినవి)

* అల్లం - అంగుళం(సన్నగా తరిగినది)

* కొత్తిమీర -తగినంత(సన్నగా తరిగినవి)

* జీలకర్ర - 1 స్పూన్

* నూనె - సరిపడినంత (వేయించడానికి)

* ఉల్లిపాయ - 1 (సన్నగా తరిగిన)

తయారీ విధానం..

ముందుగా రవ్వ, బియ్యం పిండి, మైదా, ఉప్పు వేసి కలపాలి. దానిలో 3 కప్పుల నీరు వేసి.. ఉండలు లేకుండా బాగా కలపాలి. దానిలో కారం, అల్లం, కొత్తిమీర, జీలకర్ర వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని 20 నిమిషాలు పక్కనపెట్టేయాలి.

అనంతరం పిండి కాస్త చిక్కగా ఉన్నట్లు కనిపిస్తుంది. దానిలో అవసరమైన మేరకు నీరు వేయాలి. దోశ పాన్​ స్టౌవ్​ మీద పెట్టి వెలిగించాలి. పాన్ వేడిగా ఉన్నప్పుడు.. సన్నగా తరిగిన ఉల్లిపాయలను చల్లుకోవాలి. దానిపై.. దోశ మిశ్రమాన్ని పోయాలి. నూనెతో దోశను దోరగా వేయించుకోవాలి. అంతే క్రిస్పీ ఆనియన్ దోశ రెడీ. దీనిని స్పైసీ టొమాటో చట్నీతో తింటే ఆహా అనాల్సిందే.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్