పిల్లలు ఎత్తుగా కనిపించాలనే చాలా మంది తల్లిదండ్రులకు ఉంటుంది. పిల్లల్లో కూడా తాము ఎత్తుగా ఉండాలనే కోరిక బలంగా ఉంటుంది. అయితే ఎదిగే వయస్సులోనే సరైన వ్యాయామాలు చేయడం వల్ల శరీరాన్ని సాగదీయవచ్చు. ఇది కండరాలను బలపరిచి, మంచి భంగిమను అలవాటు చేయొచ్చు. మరి, ఎత్తు ఎదగడానికి తోడ్పడే వ్యాయామాలు ఏంటో ఒకసారి చూసేద్దామా?
శరీరంపై ప్రభావం చూపిస్తూ ముఖ్యంగా బరువు మోసే వ్యాయామాలు, సాగదీసే వ్యాయామాలు ఎముకలతో పాటు కండరాలను బలపరుస్తాయి. ఇది మంచి షేప్‌తో ఉండటానికి సహాయపడుతుంది. తద్వారా పిల్లలు నిటారుగా నిలబడి కొంచెం పొడవుగా కనిపించవచ్చు. అధిక తీవ్రత కలిగిన కొన్ని రకాల వ్యాయామాలు శరీరంలో వృద్ధి హార్మోన్ విడుదలను ప్రేరేపిస్తాయి. ఈ హార్మోన్ పిల్లల ఎదుగుదలకు చాలా ముఖ్యమైనది. అయితే, వ్యాయామం ద్వారా విడుదలయ్యే హార్మోన్లు చాలావరకూ జన్యుపరమైన పరిమితులను అధిగమించలేదు.
కాబట్టి, వ్యాయామం అనేది పిల్లల ఆరోగ్యానికి, వారి పూర్తి ఎత్తును చేరుకోవడానికి సహాయపడుతుంది. కానీ కేవలం వ్యాయామం ఒక్క దాని మీదే ఆధారపడి వారి తుది ఎత్తును నిర్ణయించలేరు. జన్యువులు, పోషకాహారం, నిద్ర కూడా ఇందులో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని గుర్తుంచుకోవాలి. మీ పిల్లల సరైన ఎదుగుదల గురించి మీకు ఆందోళన ఉంటే, డాక్టర్‌ను సంప్రదించడం ఉత్తమం.
క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల పిల్లల మొత్తం ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇది మంచి నిద్రకు, ఆరోగ్యకరమైన బరువుకు, సరైన పోషకాల శోషణకు సహాయపడుతుంది. ఇవన్నీ సరైన ఎదుగుదలకు అవసరం. మీరు కూడా మీ పిల్లలను ఎత్తు ఎదిగేందుకు ప్రయత్నించమని చెబుతూ ఉంటే, ఇదిగోండి ఈ ఎక్సర్ సైజుల మీద ఫోకస్ పెట్టమని చెప్పండి.
వీటితో పాటుగా జంపింగ్ జాక్స్, స్కిప్పింగ్, బాస్కెట్‌బాల్, వాలీబాల్, సింగిల్ లెగ్ హాపింగ్, స్క్వాట్ జంప్స్, ఈత కొట్టడం, ల్యాండ్ స్విమ్మింగ్ లేదా ఆల్టర్నేట్ లెగ్ కిక్, బోర్లా పడుకుని కాళ్ళు చేతులను ఈత కొట్టినట్లు కదిలించడం వంటివి కూడా ఉపయోగకరంగానే ఉంటాయి.
యోగా చేసి హైట్ ఎదగాలని కోరుకునే వాళ్లు కోబ్రా పోజ్, ట్రయాంగిల్ పోజ్, వృక్షాసనం, పిలేట్స్ రోల్ ఓవర్ వ్యాయామాలు వెన్నెముకను సాగదీయడానికి, కండరాలను బలపరచడానికి మంచి భంగిమను కలిగి ఉండటానికి సహాయపడతాయి. అయితే సరైన పోషకాహారం, తగినంత నిద్ర కూడా ఎదుగుదలకు చాలా ముఖ్యం.
టాపిక్