Fresh Kothimeera Tips: వేసవిలో కొత్తిమీర తాజాగా ఉండాలా మార్కెట్ నుంచి తెచ్చిన వెంటనే ఇలా నిల్వ చేయండి-to keep coriander fresh in summer store it like this immediately after bringing it from the market ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Fresh Kothimeera Tips: వేసవిలో కొత్తిమీర తాజాగా ఉండాలా మార్కెట్ నుంచి తెచ్చిన వెంటనే ఇలా నిల్వ చేయండి

Fresh Kothimeera Tips: వేసవిలో కొత్తిమీర తాజాగా ఉండాలా మార్కెట్ నుంచి తెచ్చిన వెంటనే ఇలా నిల్వ చేయండి

Haritha Chappa HT Telugu

Fresh Kothimeera Tips: కొత్తిమీర లేనిదే ఏ పచ్చడి, కూర, బిర్యానికి రుచి రాదు. వేసవికాలంలో కొత్తిమీర త్వరగా మాడిపోయే అవకాశం ఉంది. కాబట్టి కొత్తిమీరను తాజాగా ఉంచడానికి చిట్కాలు ఇక్కడ ఉన్నాయి.

కొత్తిమీర స్టోరేజ్ టిప్స్

కొత్తిమీర వేస్తే ఏ వంటకం రుచి అయినా రెట్టింపు అవుతుంది. అందుకే మార్కెట్లో కొత్తిమీర అమ్మకాలు కూడా అధికంగానే ఉంటాయి. ప్రతి వంట గదిలో కొత్తిమీరను కచ్చితంగా వాడుతారు. అయితే వేసవిలో కొత్తిమీరను సరిగ్గా నిలువ చేసుకోవాలి. లేకపోతే ఆహారం రుచి మారిపోతుంది. ఫ్రిజ్లో పెట్టినా కూడా కొత్తిమీరను సరైన పద్ధతిలో నిల్వ చేస్తేనే అది ఎక్కువ రోజులు తాజాగా ఉంటుంది. ఇక్కడ మేము కొత్తిమీరను అధిక మొత్తంలో కొనుగోలు చేసినప్పుడు దాన్ని వారం పాటు తాజాగా ఎలా ఉంచుకోవాలో చెప్పాము.

కొత్తిమీర ఇలా తాజాగా ఉంచండి

కొత్తిమీర ఆకులను ఒకసారి నీటితో తడిపి శుభ్రం చేయండి. తర్వాత కొత్తిమీరను వేళ్ళతో సహా కాండానికి టిష్యూ పేపర్ను చుట్టండి. అలా చుట్టాక దాన్ని ఫ్రిడ్జ్ లో పెట్టి ఉంచండి. ఇలా అయితే అది తాజాగా ఉండే అవకాశం ఉంది. రోజులో రెండు మూడుసార్లు టిష్యూ పేపర్ పై నీళ్లు చల్లుతూ ఉంటే కొత్తిమీర తాజాగా మంచి వాసన వస్తుంది.

ఒక ప్లాస్టిక్ గ్లాసులో లేదా స్టీల్ గ్లాస్ లో నీరు పోయండి. కొత్తిమీర కాండాలు లేదా వేళ్లు మునిగేలా ఆ గ్లాసులో ఉంచండి. ఆకులు మాత్రం గ్లాసు నుండి బయటికి విరబూసేలా ఉండాలి. ఇప్పుడు దాన్ని అలానే ఉంచి ఫ్రిజ్లో పెట్టండి. లేదా ఇంట్లోని చల్లని ప్రదేశంలో పెట్టినా కూడా ఇది తాజాగా ఉంటుంది. పైనా కొత్తిమీర ఆకులు కవర్ అయ్యేలా కవర్ చుడితే ఇంకా తాజాగా ఉంటాయి.

తడి రుమాలుతో

కొత్తిమీరను మార్కెట్ నుంచి తెచ్చాక ఒకసారి కడిగి కట్ట పట్టుకొని దులపండి. అదనపు నీరంతా తొలగిపోతుంది. ఇప్పుడు ఒక తడి రుమాలలో ఈ కొత్తిమీరను చుట్టి ప్లాస్టిక్ సంచిలో పెట్టి ఫ్రిజ్లో పెట్టండి. ప్రతి రెండు రోజులకు ఒకసారి ఆ రుమాలును తడుపుతూ ఉండండి. కొత్తిమీర కొత్తగా విచ్చుకున్నట్టు తాజాగా ఉంటుంది.

కొత్తిమీర ఆకులను శుభ్రంగా కడిగి వాటర్ లేకుండా దులిపి అల్యూమినియం ఫాయిల్లో చుట్టండి. దీన్ని రిఫ్రిజిరేటర్ లో పెట్టండి. ఇది రెండు మూడు రోజులపాటు తాజాగా ఉండేలా కాపాడుతుంది.

కొత్తిమీర తాజాగా ఉంటేనే వంటలకు ఎంతో రుచి వస్తుంది. ఎండిపోయిన కొత్తిమీరను వేసినా మీకు పెద్దగా వాసనా రుచి ఉండదు. కాబట్టి మేము ఇక్కడ చెప్పిన పద్ధతిలో కొత్తిమీరను వారం పాటు తాజాగా ఉంచుకున్నందుకు ప్రయత్నించండి. కచ్చితంగా ఈ పద్ధతులన్నీ కూడా మంచిగా పనిచేస్తాయి. మీకు కొత్తిమీరను తాజాగా ఇస్తాయి.

కొత్తిమీర ఉపయోగాలు

కొత్తిమీర తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. దీనిలో విటమిన్లు,ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. కొత్తిమీరను ప్రతిరోజూ తింటే ఎన్నో సమస్యలు రాకుండా ఉంటాయి. చెడు కొలెస్ట్రాల్ తగ్గడానికి కొత్తిమీర ఉపయోగపడుతుంది. గుండె జబ్బులను తగ్గించేందుకు సహాయపడుతుంది. మూత్రిపిండాల ఆరోగ్యాన్ని కాపాడేందుకు కొత్తిమీరను ప్రతిరోజూ తినాల్సిందే. అలాగే మానసిక ఆందోళనను తగ్గించడంలో ఇది సహాయపడుతుంది.

Haritha Chappa

TwittereMail
హరిత హిందూస్తాన్ టైమ్స్‌లో చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్లో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, తెలుగు సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్‌వర్క్‌లలో పని చేశారు. ప్రింట్, డిజిటల్ జర్నలిజంలో 17 ఏళ్ల అనుభవం ఉంది. 2023 డిసెంబరు నుంచి హిందూస్థాన్ టైమ్స్‌లో ఆస్ట్రాలజీ, లైఫ్‌స్టైల్ సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు. లింక్టిన్ లో కనెక్ట్ అవ్వండి https://www.linkedin.com/in/haritha-ch-288a581a8/

సంబంధిత కథనం