Mood Swings: మూడ్ స్వింగ్స్‌తో ఇబ్బంది పడుతున్నారా.. మీ ఎమోషన్స్ ఎప్పుడూ మీ కంట్రోల్‌లో ఉండాలంటే ఇలా చేయండి!-to control mood swings and emotions here are 7 simple ways ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Mood Swings: మూడ్ స్వింగ్స్‌తో ఇబ్బంది పడుతున్నారా.. మీ ఎమోషన్స్ ఎప్పుడూ మీ కంట్రోల్‌లో ఉండాలంటే ఇలా చేయండి!

Mood Swings: మూడ్ స్వింగ్స్‌తో ఇబ్బంది పడుతున్నారా.. మీ ఎమోషన్స్ ఎప్పుడూ మీ కంట్రోల్‌లో ఉండాలంటే ఇలా చేయండి!

Ramya Sri Marka HT Telugu
Published Feb 15, 2025 06:30 PM IST

Mood Swings: ఏ సిచ్యుయేషన్‌ని ఎంజాయ్ చేయాలంటే మంచి మూడ్ ఉంటే చాలు. కానీ, చాలా మంది అప్పటివరకూ బాగానే ఉన్నా, సడెన్‌గా వేరే మూడ్‌లోకి మారిపోతారు. ఫలితంగా ఈవెంట్ మొత్తం డిస్టర్బ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. చంచల స్వభావంతో కాకుండా స్థిరంగా వ్యవహరించడానికి 7 సింపుల్ టెక్నిక్స్ ఫాలో అయితే సరిపోతుంది.

మూడ్ స్వింగ్స్‌తో ఇబ్బంది పడుతున్నారా.. మీ ఎమోషన్స్ ఎప్పుడూ మీ కంట్రోల్‌లో ఉండాలంటే ఇలా చేయండి!
మూడ్ స్వింగ్స్‌తో ఇబ్బంది పడుతున్నారా.. మీ ఎమోషన్స్ ఎప్పుడూ మీ కంట్రోల్‌లో ఉండాలంటే ఇలా చేయండి!

హ్యూమన్ ఎమోషన్స్ అనేవి చాలా వరకూ మన చుట్టూ ఉండే వాతావరణం మీదే ఆధారపడి ఉంటాయి. అంతేకాకుండా, మూడ్ మారుతుండటానికి పలు కారణాలు కూడా ఉండొచ్చు. దాదాపు ఈ మూడ్ స్వింగ్స్ అనేవి టీనేజర్లలోనే ఎక్కువగా కనిపిస్తాయి. ఎందుకంటే వారు ప్రతి విషయాన్ని ఎమోషనల్ గానే చూస్తుంటారు. కానీ, కొన్నిసార్లు ఊహించని పరిస్థితులు ఎదురైతే పెద్ద వాళ్లలోనూ ఈ మూడ్ స్వింగ్స్ అనేవి సహజంగా కనిపిస్తాయి.

మూడ్ స్వింగ్స్ ఎందుకు కలుగుతున్నాయని, అర్థం చేసుకుని బిహేవియర్ మార్చుకోగలిగితే సమస్య ఇట్టే పరిష్కారమవుతుంది. పీరియడ్స్ సమయంలో కనబరిచే ఫీలింగ్స్ నుంచి రోజువారీ జీవితంలో ఎదుర్కొనే ఒత్తిడి, చికాకు, విచారం వంటివి అన్నింటినీ మూడ్ స్వింగ్స్ లక్షణాలుగానే చెప్పొచ్చు. వీటిని అధిగమించాలంటే ఆరోగ్యకరమైన ఆహారం, సరిపడా నిద్ర, విశ్రాంతి తీసుకోవడం వంటి టెక్నిక్స్ పాటించడం చాలా మంచి పద్దతి.

మూడ్ స్వింగ్స్‌ను కంట్రోల్ చేసే విధానం:

మీరు నిజంగా మీలో కలుగుతున్న మార్పులైన మూడ్ స్వింగ్స్‌ను గమనించి, మార్చుకోవాలని అనుకుంటే ఈ టిప్స్ ఫాలో అవండి.

మార్పును స్వీకరించండి

ముందుగా మీలో కలుగుతున్న మార్పులకు కారణమేంటో తెలుసుకోండి. అవి వాతావరణం కావొచ్చు, మీరు తీసుకుంటున్న ఎనర్జీ డ్రింక్స్ లేదా సీజనల్ ఛేంజెస్, హార్మోనల్ మార్పులు వంటివి ఏవైనా మీ మూడ్ ను మారుస్తుండవచ్చు.

ఫీలింగ్స్‌కి సమాధానం వెతకండి

మీరు సరిగా లేరని మీకనిపిస్తే, ఆ ఫీలింగ్ ను నిర్లక్ష్యపెట్టకండి. మూడ్ స్వింగ్ కంట్రోల్ చేయడానికి అదే మొదటి మెట్టు. విశ్లేషించకుండా ఆ విషయంపై తుది నిర్ణయానికి వచ్చినా మోసం చేసుకున్నట్లే అవుతుందట. అందుకే ముందుగా సమస్య ఎలా మొదలైందో వెతుక్కుని, ఆ పరిస్థితిని అంగీకరించండి.

దీర్ఘమైన శ్వాస తీసుకోండి

సహజంగా మూడ్ స్వింగ్స్ ను అదుపులోకి తీసుకోవాలంటే, దీర్ఘమైన శ్వాస తీసుకోండి. నిదానంగా శ్వాస వదులుతూ ఉండండి. ఉఛ్ఛ్వాస, నిశ్వాసలపై మనస్సు కేంద్రీకరిస్తే కాస్త ప్రశాంతత దొరుకుతుంది. ధ్వని, చూపు, వాసన వంటి అంశాలపై ఫోకస్ పెడితే మిగిలిన ఆలోచనలన్నీ డైవర్ట్ అయిపోయి మానసిక ప్రశాంతత దొరుకుతుంది.

ఫిజికల్ యాక్టివిటీలో పాల్గొనండి

మూడ్ స్వింగ్స్ ను సహజంగా కంట్రోల్ చేసుకోవడానికి చాలా ఫిజికల్ యాక్టివిటీస్ ఉన్నాయి. కొద్ది దూరం నడక, మంచి సంగీతం వినడం, చదవడం, ప్రకృతిలో కాసేపు గడపడం వంటివి మిమ్మల్ని ప్రశాంతంగా ఉంచుతాయి. ఆర్ట్ వర్క్ లాంటి పజిల్స్ కూడా ట్రై చేసి మీ మూడ్ ను స్థిరంగా ఉంచుకోవచ్చు.

మీ ఆలోచనలను రాసుకోండి

మీ ప్రయాణాన్ని మీరే గమనిస్తూ ఉండండి. పేపర్ పై మీ ఆలోచనలను రాసుకుంటే, అవి మీకు ఎమోషనల్ గా సహాయపడతాయి. తద్వారా క్రమంగా స్వీయ నియంత్రణ అలవడుతుంది.

సన్నిహితుల నుంచి సహాయం

ఫ్యామిలీ లేదా ఫ్రెండ్స్ నుంచి సహాయం తీసుకోవడం వల్ల మూడ్ స్వింగ్స్ నుంచి బయటపడొచ్చు. సపోర్టివ్ ఫ్యామిలీతో సమయం గడపండి. లేదా ఫ్రెండ్స్ కు సమయం కేటాయించండి.

మంచి లైఫ్‌స్టైల్ ముఖ్యం

సరైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. పండ్లు, కూరగాయలు, ప్రొటీన్ ఆహారం తీసుకోవడం, కనీసం 30 నిమిషాల పాటు వ్యాయామం చేయడం, 7-9 గంటల వరకూ నిద్రపోవడం మీకు బాగా హెల్ప్ అవుతాయి. మనసు కేంద్రీకరించి పనిచేయడం, ధ్యానం, యోగా లాంటి ప్రధానంగా ఆచరించడం వల్ల మీ మూడ్ స్వింగ్స్ నేచురల్ గా అదుపులోకి వచ్చేస్తాయి.

Ramya Sri Marka

eMail
మార్క రమ్యశ్రీ హిందుస్తాన్ టైమ్స్‌ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ లైఫ్‌స్టైల్, ఆస్ట్రాలజీ వార్తలు రాస్తున్నారు. గతంలో ఈనాడు, టీన్యూస్, ఈటీవీ భారత్ వంటి సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పనిచేశారు.జర్నలిజంలో ఎనిమిదేశ్లకు పైగా అనుభవం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. 2024 నవంబరులో హెచ్.టి తెలుగులో చేరారు.
Whats_app_banner

సంబంధిత కథనం