Cancer: క్యాన్సర్ పై పోరాటంలో విప్లవాత్మక అభివృద్ది, టిష్యూ ఇంజనీరింగ్‌తో క్యాన్సర్ రోగుల జీవితంలో కొత్త ఆశలు-tissue engineering brings new hope in the lives of cancer patients ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Cancer: క్యాన్సర్ పై పోరాటంలో విప్లవాత్మక అభివృద్ది, టిష్యూ ఇంజనీరింగ్‌తో క్యాన్సర్ రోగుల జీవితంలో కొత్త ఆశలు

Cancer: క్యాన్సర్ పై పోరాటంలో విప్లవాత్మక అభివృద్ది, టిష్యూ ఇంజనీరింగ్‌తో క్యాన్సర్ రోగుల జీవితంలో కొత్త ఆశలు

Haritha Chappa HT Telugu
Dec 09, 2024 12:10 PM IST

Cancer: క్యాన్సర్ భయంకరమైన వ్యాధి. ఒక అవయవం నుంచి మరొక అవయవానికి వ్యాపిస్తూ పోతుంది. ఇది వచ్చిందంటే ఆ రోగులు నరకప్రాయమైన చికిత్సను తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు క్యాన్సర్‌లో కొత్త చికిత్సకు నాంది పడింది.

క్యాన్సర్ ట్రీట్‌మెంట్
క్యాన్సర్ ట్రీట్‌మెంట్ (pixabay)

ప్రపంచంలో క్యాన్సర్ బారిన పడి మరణిస్తున్న వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. శరీరంలోని ప్రతి భాగానికి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. ఒక కణంగా మొదలైన క్యాన్సర్ ప్రతి కణానికి వ్యాపిస్తూ క్యాన్సర్ కణితిగా మారుతుంది. అలాగే ఒక అవయవం నుంచి మరొక అవయవానికి కూడా సోకుతుంది. క్యాన్సర్ కు చికిత్స తీసుకోవడం అంత సులువు కాదు. క్యాన్సర్ చికిత్స కూడా బాధాపూరితంగానే ఉంటుంది. క్యాన్సర్‌ను పూర్తిగా అరికట్టడానికి పరిశోధనలు నిత్యం జరుగుతూనే ఉన్నాయి. ఆ పరిశోధనలో ఇప్పుడు ఒక విప్లవాత్మక అభివృద్ధి జరిగింది. అదే టిష్యూ ఇంజనీరింగ్.

yearly horoscope entry point

క్యాన్సర్ పోరాటంలో టిష్యూ ఇంజనీరింగ్ అనేది ఒక విప్లవాత్మకమైన మార్పుగా చెప్పుకోవచ్చు. సాంకేతికపరంగా ఎంతో అభివృద్ధి చెందిన చికిత్సను ఇది అందిస్తుంది. క్యాన్సర్ చికిత్సలో బాధను చాలా వరకు ఇది తగ్గిస్తుందని వైద్యులు భావిస్తున్నారు. క్యాన్సర్ సోకిన ప్రాంతంలో కణజాల పునరుత్పత్తిని ఇది ప్రభావితం చేస్తుంది. దీని ద్వారా క్యాన్సర్ రోగులకు చికిత్స సులభతరంగా మారుతుంది.

కీళ్ల నొప్పులకు కూడా...

పరిశోధకుడు శాస్త్రవేత్త అయిన రాజా విజయకుమార్ మీడియాతో టిష్యూ ఇంజనీరింగ్ గురించి వివరించారు. ఈ టిష్యూ ఇంజనీరింగ్ అనేది జీవ కణజాలలో కణాల పునరుత్పత్తిని ప్రేరేపించడం ద్వారా క్యాన్సర్‌ను నయం చేసే అవకాశాన్ని ఇస్తుంది. కేవలం క్యాన్సర్‌లోనే కాదు, కీళ్ల నొప్పులు, మధుమేహం చికిత్సలలో కూడా ఈ టిష్యూ ఇంజనీరింగ్ అనేది సమర్థవంతంగా పనిచేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ చికిత్సలో భాగంగా సైటోట్రాన్ అని పిలిచే వైద్య పరికరాన్ని తయారు చేశారు. ఇది కణజాల పునరుత్పత్తికి కణాల మరమ్మతుకు సహాయపడుతుంది. క్యాన్సర్ కణాలతో పాటు క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉన్న కణాలలో కూడా మైటోసిస్ ను ఆపివేస్తుంది.

సైటోట్రాన్ అనేది క్యాన్సర్ చికిత్స కోసం ఇప్పటికే అమెరికాలో ఆమోదాన్ని సాధించింది. ఇది ఖచ్చితంగా క్యాన్సర్ చికిత్సలో గొప్ప మార్పును సూచిస్తుందని, ఆరోగ్యకరమైన కణజాలాలకు క్యాన్సర్ కణాలు ఎలాంటి హాని చేయకుండా అడ్డుకుంటుందని పరిశోధకులు చెబుతున్నారు. ఈ సాంకేతికత లక్షల మందికి అందుబాటులోకి తేవడం వల్ల క్యాన్సర్ పై పోరాటాన్ని తీవ్రతరం చేయడమే తమ లక్ష్యమని శాస్త్రవేత్త రాజా విజయ్ కుమార్ వివరిస్తున్నారు.

మలేషియాలోని కౌలాలంపూర్‌లో‌కు చెందిన వైద్యులు మాట్లాడుతూ ప్రస్తుతం క్యాన్సర్ నివారణలో భాగంగా కీమోథెరపీ, రేడియో థెరపీ వంటి సాంప్రదాయక చికిత్సలను వినియోగిస్తున్నామని... ఇవి రెండూ కూడా తీవ్రమైన దుష్ప్రభావాలను కలిగిస్తాయని చెప్పారు. అలాంటి దుష్ప్రభావాలు లేకుండా తీవ్రమైన బాధ పేషెంట్లకు కలగకుండా టిష్యూ ఇంజనీరింగ్‌లో కణజాలాలను మార్చడం లేదా పునరుత్పత్తి చేయడం వంటివి సులభతరం అవుతుందని ఆయన వివరిస్తున్నారు.

టిష్యూ ఇంజనీరింగ్ అంటే?

టిష్యూ ఇంజనీరింగ్ అంటే శరీరంలోని జీవ కణజాలాలను పునరుద్ధరించడానికి వాటి ఉత్పత్తిని మెరుగుపరచడానికి ఉపయోగించే ఒక బయో మెడికల్ ఇంజనీరింగ్ పద్ధతి. దీనిని అనేక వ్యాధుల్లో ఉపయోగించే అవకాశం ఉంది.

(గమనిక: అధ్యయనాలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ కోసం ఇక్కడ అందిస్తున్నాం. ఇది కేవలం సమాచారం మాత్రమే. ఇది వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి సందేహాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించండి.)

Whats_app_banner