Seseme Chutney: ఎప్పుడూ పల్లీ చట్నీయేనా..? ఇలా నువ్వుల చట్నీ తయారు చేయండి అదిరిపోతుంది, రెసిపీ ఇక్కడ ఉంది!-tired with peanut chutney make sesame chutney like this for your breakfast its amazing heres the recipe ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Seseme Chutney: ఎప్పుడూ పల్లీ చట్నీయేనా..? ఇలా నువ్వుల చట్నీ తయారు చేయండి అదిరిపోతుంది, రెసిపీ ఇక్కడ ఉంది!

Seseme Chutney: ఎప్పుడూ పల్లీ చట్నీయేనా..? ఇలా నువ్వుల చట్నీ తయారు చేయండి అదిరిపోతుంది, రెసిపీ ఇక్కడ ఉంది!

Ramya Sri Marka HT Telugu
Jan 24, 2025 06:30 AM IST

Seseme Chutney: దోసెలు, ఇడ్లీల్లోకి ఎప్పుడూ పల్లీ చట్నీయే తింటున్నారా..? కొత్తగా ఏదైనా ట్రై చేస్తే బాగుండు అనుకుంటున్నారా? అయితే ఆరోగ్యకరమైన, రుచికరమైన నువ్వుల చట్నీని ట్రై చేయండి మీకు బాగా నచ్చుతుంది. ఇది తయారు చేయడం కూడా చాలా సులువు.

ఎప్పుడూ పల్లీ చట్నీయేనా..? ఇలా నువ్వుల చట్నీ తయారు చేయండి అదిరిపోతుంది
ఎప్పుడూ పల్లీ చట్నీయేనా..? ఇలా నువ్వుల చట్నీ తయారు చేయండి అదిరిపోతుంది (shutterstock)

ఉదయాన్నే ఇడ్లీ, దోసెల్లోకి, రాత్రి పూట చపాతీల్లోకి ఎప్పుడూ పల్లీ చట్నీ తినీ తినీ బోర్ కొడుతుందా. కొత్తగా టేస్టీగా ఏదైనా ట్రై చేద్దాం అనుకుంటున్నారా? అయితే ఈ రెసిపీ మీ కోసమే. ఆరోగ్యానికి చాలా రకాలుగా మేలు చేసే నువ్వులతో పచ్చడి తయారు చేసుకుని ఎప్పుడైనా తిన్నారా? కమెడియన్ భారతీ సింగ్ తన YouTube ఛానెల్‌లో అభిమానులతో తెల్ల నువ్వుల చట్నీని పంచుకున్నారు. ఇది రొట్టె, పరాఠా, దోసె ఇలా ప్రతిదానితోనూ రుచికరంగా ఉంటుంది. ఈ నేపాలీ స్టైల్ నువ్వుల చట్నీని తయారు చేయడం కూడా చాలా సులువు. ఇది రుచికరమైనది మాత్రమే కాదు, ఆరోగ్యానికి కూడా మంచిది. తయారు చేసే విధానంలోకి వెళదాం రండి.

నేపాలీ నువ్వుల చట్నీ తయారీకి కావలసినవి

  1. తెల్ల నువ్వులు
  2. ఎండు మిరపకాయలు
  3. ఒక టమాటా
  4. చింతపండు(చిన్ని నిమ్మకాయ సైజులో)
  5. వెల్లుల్లి మూడు నుండి నాలుగు
  6. ఒక అంగుళం అల్లం ముక్క
  7. కొత్తిమీర ఆకులు
  8. పుదీనా ఆకులు
  9. మెంతులు
  10. పచ్చిమిర్చి
  11. పోపు దినుసులు
  12. కరివేపాకు

నువ్వుల చట్నీ తయారీ విధానం

  • ముందుగా వంద గ్రాముల తెల్ల నువ్వులను పాన్‌లో వేయండి.
  • దానితో పాటు రెండు నుండి మూడు ఎండు మిరపకాయలను వేసి బాగా వేయించండి. నువ్వులను పొడిగా వేయించి బంగారు రంగు వచ్చేవరకు వేయించండి. అవి బాగా వేగిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేయండి.
  • ఇప్పుడు ఒక టమాటాను తీసుకుని పెనం మీద కాకుండా నేరుగా గ్యాస్ మంట మీద గ్యాస్ మీద బాగా కాల్చి తొక్క తీయండి.
  • మిక్సీ జార్‌లో వేయించిన తెల్ల నువ్వులు, వేయించిన ఎండు మిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, అల్లం ముక్కను వేయండి.
  • తాజా కొత్తిమీర, పుదీనా ఆకులను కూడా వేయండి.
  • ఇందులోనే రుచికి తగినంత ఉప్పు వేసి, చింతపండు కూడా వేసి అన్నింటినీ కలపండి.
  • ఇప్పుడు దీంట్లో కొద్ది కొద్దిగా నీరు పోస్టూ మెత్తటి పేస్టులా తయారు చేసుకుని పక్కకు పెట్టుకోండి.
  • ఇప్పుడు ఒక చిన్న కడాయి తీసుకుని తాళింపుకు సరిపడా నూనె పోయండి.
  • నూనె వెేడెక్కిన తర్వాత జీలకర్ర, మెంతులు, పచ్చిమిర్చి, కరివేపాకు వంటి ఇతర పోపు దినుసులతో తాలింపు వేయండి.
  • ఈ తాళింపును తీసుకెళ్లి మిక్సీ పట్టుకుని పక్కకు పెట్టుకున్న నువ్వుల మిశ్రమం మీద వేసి అంతా కలిసేలా చక్కగా కలపండి.
  • అంతే ఆరోగ్యకరమైన, రుచికరమైన తెల్ల నువ్వుల చట్నీ రెడీ. సర్వ్ చేసుకుని తినేయండి.

Whats_app_banner

సంబంధిత కథనం