స్వచ్ఛమైన అరబీ వంటకం "దమ్ కా సేమియా" ఎప్పుడైనా ట్రై చేశారా? ఒకసారి తిన్నారంటే, ఫుల్ మీల్స్ తిన్నంత హ్యాపీ-tired of the usual breakfast try flavorful dum ka seviyan a taste of authentic arabia ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  స్వచ్ఛమైన అరబీ వంటకం "దమ్ కా సేమియా" ఎప్పుడైనా ట్రై చేశారా? ఒకసారి తిన్నారంటే, ఫుల్ మీల్స్ తిన్నంత హ్యాపీ

స్వచ్ఛమైన అరబీ వంటకం "దమ్ కా సేమియా" ఎప్పుడైనా ట్రై చేశారా? ఒకసారి తిన్నారంటే, ఫుల్ మీల్స్ తిన్నంత హ్యాపీ

Ramya Sri Marka HT Telugu

"దమ్ కా సేమియా" అంటే ఒక టేస్టీ, ట్రెడిషనల్, అరబిక్ వంటకం అన్నమాట. ఇది సాధారణ సేమియా ఉప్మా కాదు. ఇది మీరు ఇంతకుముందెన్నడూ చూడని ఒక రిచ్, ఫ్లేవర్‌ఫుల్ స్పెషల్ రెసిపీ. చాలామంది దీనిని మటన్/చికెన్‌తో తయారు చేసుకుంటారు. అది నచ్చనివాళ్లు వెజ్ వర్షన్‌ కూడా ట్రై చేయొచ్చు.

దమ్ కా సేమియా సింపుల్ రెసిపీతో మీ కోసం

దమ్ కా సేమియా పేరులోనే మంచి దమ్ముంది. నాన్ వెజ్ లవర్స్ ఎక్కువగా ఇష్టపడే ఈ వంటకం చిన్నారుల నుంచి పెద్ద వాళ్ల వరక అందరూ ఇష్టపడి తినేస్తారు. పైగా దీనిని చేయడం వల్ల రొటీన్ బ్రేక్‌ఫాస్ట్‌ల నుంచి బ్రేక్ ఇచ్చినట్లు అవుతుంది. నాన్ వెజ్ తో తయారుచేసింది కాబట్టి పోషకాల్లో కూడా ఏ మాత్రం తక్కువ కాదు. వీకెండ్స్‌లో ప్రశాంతంగా తయారుచేసుకోగల ఈ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ ఏంటో చూసేద్దామా!

దమ్ కా సేమియా తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు:

  • సేమియా : 1 కప్పు (రొస్ట్ చేసినవి అయితే బెటర్)
  • ఉల్లిపాయలు: 2
  • టొమాటోలు: 2
  • పచ్చిమిరపకాయలు: 2
  • అల్లం వెల్లుల్లి పేస్ట్: 1 టేబుల్ స్పూన్
  • పుదీనా & కొత్తిమీర: తరిగినవి (1 కప్పు కలిపి)
  • తయారు చేసిన మసాలా పౌడర్‌లు (ధనియాలు, జీలకర్ర, మిరియాలు, గరం మసాలా )
  • చికెన్ ముక్కలు లేదా మటన్ కీమా: 250 గ్రా (చిన్న ముక్కలు)
  • పెరుగు – 2 టేబుల్ స్పూన్లు
  • నెయ్యి – 1 టేబుల్ స్పూన్
  • నూనె – 2 టేబుల్ స్పూన్లు

దమ్ కా సేమియా తయారీ విధానం:

  1. ముందుగా ఒక గిన్నె తీసుకుని అందులో సేమియాలను వేసి ఉడికించాలి.
  2. దాని కోసం 1 లీటర్ నీటిలో కొద్దిగా ఉప్పు వేసి, సేమియాను 60–70% ఉడికించండి. తరువాత అందులో నుంచి నీరును వడకట్టి పక్కకుపెట్టండి.
  3. ఇప్పుడు మరో కడాయిలో నూనె వేసి వేడి చేసి దాంట్లో ఉల్లిపాయలు వేసి గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారేంత వరకు వేయించండి.
  4. ఆ తర్వాత అల్లం, వెల్లుల్లి పేస్ట్ వేసి స్మెల్ పోయేవరకు ఫ్రై చేయండి.
  5. తర్వాత దీంట్లోనే టమాటో, పచ్చిమిర్చి వేసి అవి మెత్తబడే వరకు ఉడికించండి.
  6. ఇవి ఉడికిన తర్వాత మసాలా పౌడర్‌లు వేసి, మంచి ఆవిరి వచ్చే వరకు వేపాలి.
  7. ఇప్పుడు మీకు నచ్చినట్లుగా వెజ్‌తో తయారుచేయాలనుకుంటే అయితే బీన్స్, క్యారెట్, బఠాణి వేసి ఉడకబెట్టండి. లేదా నాన్ వెజ్ అయితే చికెన్ వేసి వేపుకోవాలి.
  8. ఆ తర్వాత ఈ మిశ్రమంలో పెరుగు, పుదీనా, కొత్తిమీర వేసి కలపండి.
  9. ఈ దమ్ చేసిన మిశ్రమం పూర్తిగా వేగకముందే సేమియా వేసుకోండి.
  10. ఇప్పుడు కొద్దిగా నెయ్యి పోసి, గరం మసాలా చల్లండి.
  11. అలాగే మూత పెట్టి, చాలా తక్కువ మంట మీద 10-15 నిమిషాలపాటు “దమ్” అవనివ్వండి.
  12. ఉడికిందని కన్ఫామ్ చేసుకున్న తర్వాత చివర్లో మాత్రమే ఒకసారి కింద నుంచి పైకి తిప్పి వదిలేయండి.
  13. ఉడికిని సేమియామొత్తాన్ని పైకి కిందకు తిప్పిన తర్వాత స్టవ్ మీద మరో 5 నిమిషాలు పాటు ఉంచి స్టవ్ ఆపేయండి.
  14. అంతే, మీరు కోరుకున్న దమ్ కా సేమియా రెడీ అయినట్లే.

దమ్ కా సేమియా వల్ల ఉపయోగాలు:

1. పోషకాహారం: మాంసాహారం లేదా ప్రొటీన్ ఉండే కూరగాయలు కలుపుకోవడం వల్ల ప్రోటీన్స్ & విటమిన్లు శరీరానికి ఎక్కువగా అందుతాయి.

2. శక్తినిచ్చే అల్పాహారం లేదా డిన్నర్: ఇది తేలికగా జీర్ణమవుతుంది కానీ శక్తిని ఎక్కువ ఇస్తుంది.

3. ఒకే డిష్ లో పూర్తి భోజనం: కార్బ్స్ (సేమియా), ప్రోటీన్ (చికెన్/పప్పులు), ఫైబర్ (కూరగాయలు) అన్నీ కలిపిన డిష్.

4. జీర్ణక్రియ కోసం: జీలకర్ర, అల్లం, మిరియాలు వంటివి జీర్ణక్రియకు బాగా సహకరిస్తాయి.

రమ్య శ్రీ మార్క హిందుస్థాన్ టైమ్స్‌లో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్. జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న ఆమె లైఫ్ స్టైల్, ఆస్ట్రాలజీ వార్తలు రాయడంలో ప్రత్యేకత కలిగి ఉంది. కాకాతీయ యూనివర్సిటీలో జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ పట్టా పొందారు. గతంలో ఈనాడు, టీన్యూస్, ఈటీవీ భారత్ వంటి సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు.లింక్డ్‌ఇన్‌లో ఆమెతో కనెక్ట్ అవ్వండి.

సంబంధిత కథనం