Fitness | ట్రెడ్‌మిల్‌పై నడిచేటపుడు ఈ జాగ్రత్తలు పాటించండి-tips to use a treadmill without getting knee injury ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Fitness | ట్రెడ్‌మిల్‌పై నడిచేటపుడు ఈ జాగ్రత్తలు పాటించండి

Fitness | ట్రెడ్‌మిల్‌పై నడిచేటపుడు ఈ జాగ్రత్తలు పాటించండి

HT Telugu Desk HT Telugu

మోకాలిపై భిన్నమైన ప్రభావం పడుతుంది. దీనివల్ల మోకాళ్ల నొప్పులు, ఇతర సమస్యలు ఏర్పడతాయి. ఇందుకోసం నిపుణులు కొన్ని చిట్కాలు ఇస్తున్నారు. అవేంటో చూడండి...

Walking on a Treadmill (Shutterstock)

మన శరీరం ఫిట్‌గా ఉండాలంటే శారీరానికి ఎంతోకొంత శ్రమ కల్పించడం ఎంతైనా అవసరం. వాకింగ్, రన్నింగ్ లాంటివి ఎల్లప్పుడూ మన ఫిట్‌నెస్ రొటీన్‌లుగా ఉండాలి. మనం ఎప్పుడైనా, ఎక్కడైన అత్యంత తేలికగా చేసుకునే వ్యాయామం నడక. కీళ్లనొప్పులు, కాళ్ల నొప్పులు ఉన్నాయని నడవడం మానేయకూడదు. నడక ద్వారా అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇది మన పొట్టప్రాంతంలో పేరుకుపోయిన కొవ్వును కరిగిస్తుంది. చర్మం కింద ఉన్న అనవసరపు కొవ్వును నియంత్రిస్తుంది, మంచి కొవ్వు స్థాయిలను మెరుగుపరుస్తుంది. జన్యువుల పనితీరుపై కూడా ప్రభావం చూపుతుంది. కాబట్టి నడకను కొనసాగించాలి.

ఆరుబయట వ్యాయామాలు చేయడం మీకు కుదరనప్పుడు 'ట్రెడ్‌మిల్' ఉపయోగించవచ్చు. అయితే బయటనడవటం, ట్రెడ్‌మిల్ మీద నడవడం మోకాలిపై భిన్నంగా ప్రభావం చూపుతుంది. మనం నేలపై నడుస్తున్నప్పుడు, శరీరం దానంతటదే నడిచే నేలకు అనుగుణంగా అంతర్లీనంగా సర్దుబాటు చేసుకుంటుంది. కానీ మనం ట్రెడ్‌మిల్‌పై నడుస్తున్నపుడు స్థిరమైన వేగం సెట్ చేసుకోవడం, దాని బెల్ట్ మోకాలికి భిన్నంగా తాకడం వల్ల కండరాలు పట్టుకుంటాయి, మోకాళ్ల నొప్పులు వస్తాయి.

అయితే ఎలాంటి సమస్యలు రాకుండా ట్రెడ్‌మిల్‌పై ఎలా నడవాలి అనే దానిపై నిపుణులు కొన్ని సలహాలు, సూచనలు చేస్తున్నారు. ఇవి పాటించడం వలన ఎలాంటి మోకాళ్ల నొప్పులు రావు, ఫిట్‌నెస్ కూడా బాగుంటుందని చెబుతున్నారు. అవేంటంటే..

వార్మప్: 

వెంటనే ట్రెడ్‌మిల్‌పై నడవకూడదు. ట్రెడ్‌మిల్‌ ఎక్కేముందు శరీరానికి కొంత వార్మప్ ఇవ్వాలి. తేలికపాటి వ్యాయామాలు చేసిన తర్వాత ట్రెడ్‌మిల్‌పై నడవాలి.

క్రమంగా వేగాన్ని పెంచండి:

 ట్రెడ్‌మిల్‌పై ఒకేసారి గరిష్ట వేగంతో నడవకూడదు.మంచి ప్రయోజనాలను పొందాలంటే నెమ్మదిగా మొదలు పెట్టి ఆపై వేగాన్ని క్రమంగా పెంచుతూపోవాలి.

ప్రతిరోజూ అరగంట:

 ప్రతిరోజూ 25 నుంచి 30 నిమిషాల పాటు ట్రెడ్‌మిల్‌పై నడకను కొనసాగించండి. ఇలా కొన్నిరోజుల తర్వాత నడక సమయాన్ని 40-45 నిమిషాలకు పెంచండి.

వేగాన్ని మార్చండి:

 ట్రెడ్‌మిల్‌పై వేగాన్ని ప్రతి 5 నిమిషాలకు ఒకసారి మారుస్తూ ఉండాలి.

సరైన బూట్లు:

 ట్రెడ్‌మిల్‌పై నడుస్తున్నప్పుడు కచ్చితంగా సరైన ఫిట్టింగ్ షూలను ధరించడం చాలా ముఖ్యం. చెప్పులతో లేదా ఎలాంటి పాదరక్షలు లేకుండా నడవకూడదు.

ట్రాకింగ్ ప్యాంట్:

 ట్రెడ్‌మిల్‌పై నడుస్తున్నప్పుడు సరైన ఫిట్టింగ్ ఉండే ట్రాకింగ్ ప్యాంట్ ధరించాలి. మరీ కాళ్ల అంచుల వరకు ఉండేలా పొడవైనవి కాకుండా కొంత పొట్టిగా ఉండేవి ధరిస్తే మంచిది. లేకపోతే బెల్టులో తట్టుకొని మీరు పడిపోయే ప్రమాదం ఉంది.

సంబంధిత కథనం