Unwanted hair tips: మహిళల్లో అవాంఛిత రోమాలకు శాశ్వతంగా చెక్ పెట్టాలా? ఈ సింపుల్ టిప్స్ ఫాలో అవ్వండి-tips to stop growth of unwanted hair naturally in women ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Unwanted Hair Tips: మహిళల్లో అవాంఛిత రోమాలకు శాశ్వతంగా చెక్ పెట్టాలా? ఈ సింపుల్ టిప్స్ ఫాలో అవ్వండి

Unwanted hair tips: మహిళల్లో అవాంఛిత రోమాలకు శాశ్వతంగా చెక్ పెట్టాలా? ఈ సింపుల్ టిప్స్ ఫాలో అవ్వండి

Koutik Pranaya Sree HT Telugu
Sep 07, 2024 02:00 PM IST

Unwanted hair tips: ఆడవాళ్లలో అవాంఛిత రోమాల సమస్య కనిపిస్తుంది. గడ్డం మీద, ముఖం మీద, ఛాతీ దగ్గర వెంట్రుకలు పెరుగుతాయి. వీటికి హార్మోన్ల సమస్య కారణం. దీన్ని సహజంగా తగ్గించుకునే మార్గాలు చూసేయండి.

అవాంఛిత రోమాలు తగ్గించే చిట్కాలు
అవాంఛిత రోమాలు తగ్గించే చిట్కాలు (shutterstock)

ముఖంపై కనిపించే అవాంఛిత రోమాలను తొలగించుకోడానికి మహిళలు తరచుగా పార్లర్ను ఆశ్రయిస్తారు. అయితే ఈ సమస్య కేవలం అందంతో మాత్రమే ముడిపడి ఉన్నది కాదు. ఒకరకమైన హార్మోన్ సమస్య.

అధిక డిహెచ్‌టి స్థాయులకు సూచన:

ముఖంపై, నాభి చుట్టూ, ఛాతీ ప్రాంతంలో అవాంఛిత రోమాలు ఉంటే అది అధిక డిహెచ్‌టి స్థాయులకు సూచన. డిహెచ్‌టి అంటే డైహైడ్రోటెస్టోస్టెరాన్, ఇది ఒక హార్మోన్. ఇది పెరిగే కొద్దీ, పురుషుల మాదిరిగా మహిళలు శరీరంపై వెంట్రుకలు రావడం మొదలవుతుంది. ముఖం, ఛాతీ, పొట్టపై వెంట్రుకలు కనిపిస్తాయి. ఈ సమస్యను హిర్సుటిజం అంటారు. ఈ సమస్యను ఎదుర్కోవడానికి, జీవనశైలిలో మార్పులు చేయడానికి డైటీషియన్లు కొన్ని మార్గాల గురించి చెబుతున్నారు.

మెంతుల నీరు:

డిహెచ్‌టి స్థాయిలను తగ్గించడానికి మెంతులు నానబెట్టిన నీటితో రోజును ప్రారంభించండి. ఇలా చేయడం వల్ల ముఖంపై వచ్చే అవాంఛిత రోమాలు తగ్గుతాయి.

స్పియర్ మింట్ టీ:

తాగండి రోజుకు కనీసం రెండుసార్లు స్పియర్ మింట్ టీ త్రాగాలి. ఈ టీ ఫ్రీ టెస్టోస్టెరాన్ స్థాయులను తగ్గిస్తుంది. ఇది మహిళల్లో పిసిఒఎస్, హిర్సుటిజం రెండింటి నుండి ఉపశమనం కలిగిస్తుంది.అవాంఛిత రోమాలు బయటకు వచ్చే ముఖ భాగాల్లో స్పియర్ మింట్ ఆయిల్ ను అప్లై చేయాలి. ఈ నూనె ఆండ్రోజెన్ స్థాయిలను తగ్గిస్తుంది మరియు ముఖం మీద వెంట్రుకల పెరుగుదలను కూడా నిరోధిస్తుంది.

మెగ్నీషియం

మెగ్నీషియం అధికంగా ఉండే ఆహారాల్ని తినడానికి ప్రయత్నించండి. బాదం, ఆకుకూరలు తినడం ద్వారా టెస్టోస్టెరాన్ ఉత్పత్తిని ఇది నియంత్రిస్తుంది.

దాల్చిన చెక్క నీరు త్రాగడం:

భోజనం తర్వాత దాల్చిన చెక్క నీరు త్రాగాలి. ఈ నీటిని తాగడం వల్ల ఇన్సులిన్ సున్నితత్వం తగ్గుతుంది, ఆండ్రోజెన్ స్థాయిలు కూడా తగ్గుతాయి.

జింక్:

గుమ్మడి గింజలు, తెల్ల శనగలు వంటి జింక్ అధికంగా ఉండే ఆహారాన్ని తినండి. జింక్ టెస్టోస్టెరాన్ హార్మోన్ డైహైడ్రోటెస్టోస్టెరాన్ గా మార్చే ఎంజైమ్ ఏర్పడకుండా నిరోధిస్తుంది. ఇది ముఖంపై వెంట్రుకల సమస్యను తగ్గించడంలో సహాయపడుతుంది.

ప్రొటీన్:

పెసరపప్పు చీలా, శనగలతో తయారు చేసే సలాడ్లు ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవాలి. ఇవి ఇన్సులిన్ సున్నితత్వాన్ని నిరోధిస్తాయి. ముఖంపై వెంట్రుకల పెరుగుదలను తగ్గిస్తాయి.

టాపిక్