Sankrathi Special Sakinalu: తెలంగాణ స్పెషల్ సకినాలు కరకరలాడుతూ రుచిగా రావాలంటే ఈ చిట్కాలు పాటించండి!-tips to prepare crispy and tasty telanagana sankranthi special sakinalu recipe ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Sankrathi Special Sakinalu: తెలంగాణ స్పెషల్ సకినాలు కరకరలాడుతూ రుచిగా రావాలంటే ఈ చిట్కాలు పాటించండి!

Sankrathi Special Sakinalu: తెలంగాణ స్పెషల్ సకినాలు కరకరలాడుతూ రుచిగా రావాలంటే ఈ చిట్కాలు పాటించండి!

Ramya Sri Marka HT Telugu
Jan 07, 2025 03:30 PM IST

Sankrathi Special Sakinalu: సంక్రాంతి వచ్చేస్తోంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో పిండి వంటల హడావిడి మొదలైపోయింది. ఈ సారి తెలంగాణ సంక్రాంతి స్పెషల్ వంటకం సకినాలు మీరూ తయారు చేయాలనుకుంటే.. ఇక్కడ రెసిపీతో పాటు సకినాలు కరకరలాడేందుకు కొన్ని చిట్కాలు కూడా ఉన్నాయి. ఫాలో అయిపోండి.

సకినాలు కరకరలాడుతూ రుచిగా రావాలంటే ఈ చిట్కాలు పాటించండి
సకినాలు కరకరలాడుతూ రుచిగా రావాలంటే ఈ చిట్కాలు పాటించండి

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి చాలా స్పెషల్. పిండి వంటలతో ప్రతి ఇల్లు ఘుమఘుమలాడిపోతుంది. ప్రత్యేకించి తెలంగాణ ప్రజలకు సంక్రాంతి అనగానే గుర్తొచ్చే పిండి వంటకం సకినాలు. తెలంగాణలో మాత్రమే చేసే పిండి వంటకాల్లో ఒకటైన ఈ సకినాలు ప్రతి ఒక్కరికీ నచ్చేస్తాయి. మరి కరకరలాడుతూ టేస్టీగా, క్రిస్పీగా ఉండే ఈ వంటకాన్ని మీరూ రెడీ చేయాలనుకుంటున్నారా..? ఇదిగోండి సకినాల రెసిపీతో పాటు కొన్ని చిట్కాలు మీ కోసం.

yearly horoscope entry point

కావాల్సిన పదార్థాలు:

  • బియ్యం - ఒక కేజీ
  • నువ్వులు - పావు కేజీ
  • ఉప్పు 2 - రుచికి సరిపడ
  • వాము - పావు టీ స్పూన్
  • నీళ్లు - రెండు కప్పులు
  • నూనె - (డీప్ ఫ్ఱైకి సరిపడా)

తయారుచేసే విధానం:

  • ముందుగా ఒక బౌల్ తీసుకుని దాంట్లో ఆరు కప్పుల బియ్యం పోయండి. దానిని శుభ్రంగా కడుక్కొని 15 నుంచి 16 గంటల వరకూ (రాత్రంతా) నానబెట్టుకోండి.
  • ఆ తర్వాత ఈ బియ్యంలోని నీరు మొత్తం పోయేంత వరకూ వడకట్టుకోండి.
  • ఆ బియ్యాన్ని తీసి ఒక కాటన్ వస్త్రంపై వేసి పది నుంచి పదిహేను నిమిషాల వరకూ ఆరబెట్టండి.
  • పూర్తిగా ఎండిపోక ముందే కాస్త తడిగా ఉందనిపించినప్పుడే బియ్యాన్ని తీసుకుని మిక్సీలో వేసి మొత్తగా చేసుకోండి. ఆ పిండి ఆరిపోకుండా ఒక గిన్నెలోకి ఉంచండి.
  • ఇప్పుడు ఇందులో నువ్వులు, వాము, రుచికి తగినంత ఉప్పు వేసి కలపండి.
  • ఆ తర్వాత కొద్దికొద్దిగా నీళ్లను పోసుకుంటూ పిండిని కలుపుతూ ఉండండి. మరీ వదులుగా కాకుండా కాస్త గట్టిగానే అంటే చేతిలో వేసుకుంటే జారిపోయే విధంగా మారేంత వరకూ నీళ్లను కలుపుకోండి.
  • అలా కలిపిన పిండిని కాసేపు పక్కకు పెట్టండి.
  • ఇప్పుడు మరో శుభ్రమైన కాటన్ వస్త్రం తీసుకుని నేల మీద పరుచుకోండి.
  • చేతిలోకి పిండి తీసుకుని ఆ వస్త్రంపై వేళ్ల సహాయంతో సన్నగా పిండిని వదులుతూ గుండ్రంగా తిప్పుతూ సకినాలు వేసుకోండి. (సాధారణంగా సకినాలను రెండు లేదా మూడు రింగులుగా తిప్పుకుని వేసుకుంటారు)
  • ఒకవేళ, చేత్తో వేయడం రాకపోతే ఒక కవర్ (పాల ప్యాకెట్ లేదా నూనె ప్యాకెట్ అదీ లేకపోతే జిప్ కవర్) తీసుకుని అందులో పిండిని నింపండి. ఇప్పుడు కవర్‌ చివర్లో లేదా ఒక మూలలో చిన్న రంధ్రం పెట్టండి. ఆ రంధ్రం గుండా పిండిని గుండ్రంగా తిప్పుతూ బయటకు వదలండి.
  • ఇలా ఆ వస్త్రంలో సకినాలను వేసిన తర్వాత పది నిమిషాల పాటు ఆరనివ్వండి.
  • ఈ లోపు ఒక కడాయి లేదా బాండీ తీసుకుని డీప్ ప్రైకు సరిపడా నూనెను తీసుకోండి (ఎక్కువ నూనె ఉంటేనే ఎక్కువ సకినాలను వేయించుకోవచ్చు).
  • నూనె మరిగిందనుకున్న తర్వాత వస్త్రంలో ఆరబెట్టిన సకినాలను ఒకొక్కటిగా తీయండి.
  • వాటి షేప్ డిస్టర్బ్ కాకుండా చేత్తో లేదా చదునైన ప్లేట్ సహాయంతో తీసుకుని నూనెలో వదులుతూ ఉండండి.
  • పెద్ద మంట పెట్టుకుని సకినాలు గోధుమ రంగులోకి మారే వరకూ వేయించండి.
  • అంతే! మీరు తయారు చేయాలనుకుంటున్న సకినాలు రెడీ అయిపోయినట్లే.

Whats_app_banner