Menu for diabetic: షుగర్ ఉన్నవాళ్లు రెస్టారెంట్‌కి వెళ్తే ఏం ఆర్డర్ చేసుకోవాలి? ఈ టిప్స్‌తో రుచితో పాటూ ఆరోగ్యం-tips to order food at restaurant for diabetic patients ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Menu For Diabetic: షుగర్ ఉన్నవాళ్లు రెస్టారెంట్‌కి వెళ్తే ఏం ఆర్డర్ చేసుకోవాలి? ఈ టిప్స్‌తో రుచితో పాటూ ఆరోగ్యం

Menu for diabetic: షుగర్ ఉన్నవాళ్లు రెస్టారెంట్‌కి వెళ్తే ఏం ఆర్డర్ చేసుకోవాలి? ఈ టిప్స్‌తో రుచితో పాటూ ఆరోగ్యం

Koutik Pranaya Sree HT Telugu
Jul 06, 2024 02:30 PM IST

డయాబెటిస్ ఉన్నవాళ్లు చిన్న చిన్న ఆనందాలకు దూరం అయిపోతారు. బయటికి వెళ్లినప్పుడు ఏం తినాలో తెలీక రెస్టారెంట్లకు వెళ్లడం మానేస్తారు. అది మంచిదే. కానీ వెళ్లాలనిపిస్తే అక్కడ ఏం తినొచ్చు, ఎలా ఆర్డర్ చేసుకోవచ్చో చూసేయండి.

డయాబెటిక్ రెస్టారెంట్ మెన్యూ
డయాబెటిక్ రెస్టారెంట్ మెన్యూ (freepik)

షుగర్ ఉన్నవాళ్లు ఆహారం తీసుకునేటప్పుడు ఆచీతూచీ వ్యవహరించాల్సిందే. బయట రెస్టారెంట్లకు వెళ్లినప్పుడు అయితే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. ఏం తినాలో అర్థం కాదు. ఏం చూసినా దాని ప్రభావం షుగర్ పెంచేస్తుంది అనిపిస్తుంది. కానీ కొన్ని సింపుల్ విషయాలు గుర్తుంచుకుంటే ఆ ప్రభావం మరీ ఎక్కువ కాకుండా, అసలే లేకుండానూ చూసుకోవచ్చు. అలాగని రుచిలేని ఆహారం తినక్కర్లేదు.. ఎలా తినాలో కొన్ని టిప్స్‌ తెలియాలంతే..

పిజ్జా, బర్గర్ కోసం వెళ్తే..

పిజ్జాలో పూర్తిగా మైదాతో చేసిన రకాలే ఎక్కువగా ఉంటాయి. కానీ గోధుమపిండితో చేసే వీట్ క్రస్ట్ రకం పీజ్జాలు కూడా ఉంటాయి. వాటిని ఆర్డర్ పెట్టొచ్చు. అలాగే తిన్ క్రస్ట్ రకం.. అంటే పీజ్జా క్రస్ట్ సన్నగా ఉంటుంది. వాటిని ఎంచుకోవాలి. టాపింగ్స్ లో కూరగాయ ముక్కలు ఎక్కువగా కస్టమైజ్ చేసుకుని వేయించుకుంటే సరిపోతుంది. దాంతో మీకు పీచు ఎక్కువగా అందుతుంది. కార్బోహైడ్రేట్లు తక్కువగా అందుతాయి. ఒకేసారి షుగర్ స్థాయులు పెరిగిపోవు. అలాని పీజ్జా ఆరోగ్యకరం కాదు.. కానీ తినడం తప్పకపోతే, తినాలనిపిస్తే ఇలా చేయొచ్చు.

బర్గర్‌లలో కూడా నో బ్రెడ్ బర్గర్లు ఉంటాయి. చుట్టూ కూరగాయలతో చేసిన ప్యాటీలతో నో బ్రెడ్ బర్గర్ తయారు చేస్తారు. లేదంటే బర్గర్ చేసేటప్పుడు ఎక్కువగా కూరగాయలు వేయమని, తక్కువ సాస్‌లు వాడమని చెప్పాలి. అలాగే బర్గర్ బన్ లోపలి వైపుండే పిండి భాగాన్ని లోపలి దాకా తీసేసి బర్గర్ చేసివ్వమని చెప్పొచ్చు. దీంతో ఎక్కువగా పిండి పదార్థాలు తినేయరు.

లంచ్ లేదా డిన్నర్ కోసం వెళ్లినప్పుడు:

1. మీ ప్లేట్‌లో ఎక్కువగా కూరగాయలు, పండ్లు ఉండేలా.. తక్కువ అన్నం ఉండేలా చూసుకోవాలి. తాజా కూరగాయలు, పండ్ల సలాడ్లు ఆర్డర్ చేసుకోవాలి.

2. బటర్ నాన్, బటర్ రోటీలు మైదాతో చేస్తారు. వాటిలో బటర్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. కేలరీలు ఎక్కువ. సైజులో కూడా పెద్దగా ఉంటాయి. అందుకే కొవ్వు, కేలరీలు తక్కువగా ఉండే చపాతీలు మంచి ఎంపిక.

3. స్టార్టర్ ఆర్డర్ చేసేటప్పడు సలాడ్, చికెన్ టిక్కా, గ్రిల్ చేసిన ఫిష్, చికెన్, సీక్ కబాబ్, సూప్ ఆర్డర్ చేయొచ్చు. అలాగే వెజిటేబుల్ 65, పన్నీర్ 65 లాంటి వాటిలో తక్కువగా సాస్ వేసేలా చేయించుకుని తినొచ్చు. స్టిర్ ఫ్రై చేసిన కూరగాయ ముక్కలూ ఆర్డర్ చేసుకోవచ్చు. మైదాతో చేసే సమోసా, స్ప్రింగ్ రోల్స్, నూడుల్స్, పాస్తా లాంటి వాటి జోలికి పోకండి.

4. చివరగా తినే తియ్యటి డెజర్ట్ జోలికి పోకండి. బదులుగా ఫ్లేవర్డ్ యోగర్ట్ ఉంటే తెప్పించుకోండి. స్మూతీలు కూడా షుగర్ లెవల్స్ పెంచేస్తాయి. కాబట్టి కూల్ డ్రింకులు, జ్యూసులు మంచి ఆప్షన్ కాదనే చెప్పాలి.

డయాబెటిస్ పేషెంట్లు ఎప్పటికప్పుడు, ఏపూటకాపూట ఒక సరైన నియమం పెట్టుకుని ఆహారం తీసుకోవాలి. బయటికి వెళ్లినప్పుడు ఏమీ తినకుండా పక్కన కూర్చుని బాధ పడకుండా ఉండాలంటే.. పైన చెప్పిన కొన్ని సలహాలు ఉపయోగపడతాయి. వీలైనంతగా ఇంటి భోజనానికే ప్రాముఖ్యత ఇవ్వడం ఆరోగ్యకరం.

Whats_app_banner